TG: అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్యలపై ప్రభుత్వం సుమాగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం
అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్య పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
ప్రభుత్వం విద్యార్థినులకు
చెరో 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఇవ్వాలి
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
భువనగిరి పట్టణంలో దారుణం జరిగింది. పట్టణంలోని బీచ్ మహిళ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య (15) గాదె వైష్ణవి(15) అనే ఇద్దరు విద్యార్థునులు హాస్టల్లో ఉరేసుకొని శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఇద్దరు విద్యార్థులకుచెరో 50లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించి ఇవ్వాలని sc st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. జరిగింది. ఈ సందర్భంగా SC st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ లో ఈ ఘటన చోటు చేసుకుందని విద్యార్థినులను కౌన్సెలింగ్ పేరుతో పి ఈ టి వార్డెన్ ఆటో డ్రైవర్లు కలిసి నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేసినారని అన్నారు. కనీసం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేయలేదని ఈ ఘటన వారం రోజులుగా జరుగుతున్నప్పటికీ పై అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేదని అన్నారు. కౌన్సిలింగ్ పేరుతో విద్యార్థులు మనస్థాపానికి గురయ్యారని అన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించకపోవడం కనీసం కుటుంబాలను పరామర్శించకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వ ఉద్యోగం చెరో 50లక్షల ఎక్స్రేసి మరియు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Feb 06 2024, 17:46