తెలంగాణ టుడే టాప్ న్యూస్...
తెలంగాణ టుడే టాప్ న్యూస్...
హైదరాబాద్: రికార్డు స్థాయిలో రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ.. ఒకే రోజు 56వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అప్పగించిన మిల్లర్లు.. పౌరసరఫరాలశాఖ చరిత్రలోనే అత్యధికం.. 50 రోజుల్లో 40 శాతం పెరిగిన సీఎంఆర్.
హైదరాబాద్: సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. మంత్రి దామోదర రాజ నర్సింహ, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరు.. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలి.. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలి. ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలి. -సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ పట్టివేత. ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిని పట్టుకున్న పోలీసులు. యువతి నుంచి 4 గ్రామలు MDMA డ్రగ్స్ స్వాధీనం. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
హైదరాబాద్ బాలాపూర్‌లో ఉద్రికత్త. డైమండ్ పాయింట్ దగ్గర పోలీసులపై రాళ్లు రువ్విన ఓ వర్గం. నిన్న బర్మాకు చెందిన యువకుడి హత్యకు నిరసనగా ఆందోళన. నిరసనకారులు రాళ్లురువ్వడంతో కానిస్టేబుల్‌కు గాయాలు. బాలాపూర్‌లో భారీగా మోహరించిన పోలీసులు.
Jan 30 2024, 09:32