/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ప్రజాహితం కోసమే సమాచార హక్కు వికాస సమితి: యర్రమాద కృష్ణారెడ్డి Mane Praveen
Mane Praveen

నల్లగొండ: ఆర్డీవో కార్యాలయంలో సమాచార హక్కు వికాస సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సమాచార హక్కు వికాస సమితి

NLG: ప్రజాహితం కోసమే సమాచార హక్కు వికాస సమితి: యర్రమాద కృష్ణారెడ్డి
నల్లగొండ: ఆర్డీవో కార్యాలయంలో సమాచార హక్కు వికాస సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాహితం కోసం సమాచార హక్కు వికాస సమితి పనిచేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌ లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని మండిపడ్డారు.మౌలిక వ‌స‌తుల లేమితో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు.

ఇది నాగాలాండ్ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని విమర్శించారు.

TS: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు...RRR పనులకు చర్యలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మరో మణిహారం రానుంది, అదే RRR. ప్రాంతీయ రింగురోడ్డు (RRR) పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. RRR కోసం భూసేకరణను మూడు నెలలలో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. భూ సేకరణతో పాటు RRR ఉత్తరభాగం పనులకు టెండర్లు పిలవాలని, దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని NHAI ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దక్షిణభాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.

TS: జనవరి 20న పాస్‌పోర్ట్ అదాలత్‌

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు.

సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు.

వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు.

శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 

దరఖాస్తుదారులు ఒరిజినల్‌ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

TS: అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్..

అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసిసి....

వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరీ వెంకట్ పేర్లు ఖరారు....

అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్...

నిన్నటి వరకు ఎమ్మెల్సీ జాబితాలో అద్దంకి దయాకర్...

దయాకర్ స్థానంలో మహేష్ గౌడ్ పేరు....

TS: క్రిటికల్ గా సిపిఎం నేత తమ్మినేని ఆరోగ్య పరిస్థితి

హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు.ఆయన ప్రస్తుతం గుండె కిడ్ని ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు ఏఐజీ వైద్యులు తెలిపారు. తమ్మినేని కి మందులతో చికిత్స అందిస్తున్నాం రక్తపోటు మెరుగుపడుతుందని వివరించారు.

వీరభద్రం కు ఊపిరితిత్తుల్లో నీరు చేరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయనకు వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్‎ల వైద్యుల బృందం ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్ విడుదల చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన కారణంగా వెంటిలెటర్ సపోర్ట్‎తో ఖమ్మం నుంచి గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‎ కు తరలించారు.

ఎమర్జెన్సీ కావడంతో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారు మంగళవారం ఉదయం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మొదట ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రంను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలసుకున్నారు. గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది, ఆయనకు అప్పుడు స్టంట్ వేశారు.

తాజాగా మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే డాక్టర్ల సూచన మేరకు పార్టీ శ్రేణులు హాస్పిటల్‎కి రావొద్దని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసింది.

NLG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన కీర్తన, సోని

ఈనెల 17 నుండి 20వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరుగుతున్న 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాలికల ఫుట్బాల్ పోటీలకు నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన ఇద్దరు క్రీడాకారిణిలు .. మద్ది కీర్తన మరియు అప్పల సోని లు ఎంపికైనరని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు. 

ఇద్దరూ క్రీడాకారినులు చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ హెడ్ కోచ్ మద్ది కర్ణాకర్ శిక్షణలో నిరంతరం సాధన చేస్తూ హై లెవెల్ ఫిజికల్ ఫిట్నెస్ ని పెంపొందించుకుంటూ.. ఫుట్బాల్ క్రీడలోని మెళుకులని నేర్చుకుని రాష్ట్రస్థాయి బాలికల పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలవడానికి తమ వంతు ప్రధాన పాత్రను పోషించి జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైనారని తెలిపారు.

మద్ది కీర్తన నల్గొండ పట్టణంలోని DVK రోడ్ లో గల ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుచూ ఫార్వర్డ్ ఫుట్బాల్ ప్రేయర్ గా గుర్తింపు సాధిస్తూ ఉన్నది.

అప్పల సోని నల్గొండ పట్టణంలోని నారాయణ స్కూల్ లో 9వ తరగతి చదువుచూ గోల్ కీపర్ గా మంచి గుర్తింపు సాధిస్తున్నది.

ఇద్దరు ప్లేయర్స్ కూడా తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనారని బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

NLG: బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి గా గిరి నర్సింహ

నల్గొండ: బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి గా గిరి నర్సింహ నియమించినట్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏకుల రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా గిరి నర్సింహ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు నిరంతరం సేవలనందిస్తూ.. బహుజనులు ఆర్థికంగా, రాజకియంగా, సామాజికంగా ఎదగాడానికి తన వంతు కృషి చేస్తానని, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు, జిల్లా అధ్యక్షులు రాజారావు కు మరియు బిఎస్పి ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

NLG: ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో విజయం సాధించిన టీమ్ కు రూ. 25,000/-

నల్లగొండ జిల్లా:

చిట్యాల మండలంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో విజయం సాధించిన టీం కు శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు 25 వేల రూపాయలను బహుమతి గా అందించారు. 

యువత క్రిడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, ఉత్తమ ప్రతిభను చూపి తమ గ్రామానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, మొగిలి కిషన్ పాల్గొన్నారు.

NLG: తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక: జెర్రిపోతుల ధనుంజయ గౌడ్

నల్లగొండ జిల్లా: తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ముగ్గుల పోటీలకు ఆర్థికసహకారం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమని వారు అన్నారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చెనగోని నందు, ఎం జంగయ్య మాట్లాడుతూ.. ఇలాంటి ముగ్గులు పోటీలు నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని వారు అన్నారు.

అనంతరం ఈ ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న, చెనగోని నందు, ఎం జంగయ్య చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి టి. యమునా, ద్వితీయ బహుమతి సాగర్ల సరిత, తృతీయ బహుమతి వీణ, నాలుగో బహుమతి సైదమ్మ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల నాయకురాలు గౌసియాబేగం, పుష్ప, ఎం నవ్య, గౌతమి, దీపిక, మౌనిక, సరస్వతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.