NLG: తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక: జెర్రిపోతుల ధనుంజయ గౌడ్
నల్లగొండ జిల్లా: తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ముగ్గుల పోటీలకు ఆర్థికసహకారం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమని వారు అన్నారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చెనగోని నందు, ఎం జంగయ్య మాట్లాడుతూ.. ఇలాంటి ముగ్గులు పోటీలు నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని వారు అన్నారు.
అనంతరం ఈ ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న, చెనగోని నందు, ఎం జంగయ్య చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి టి. యమునా, ద్వితీయ బహుమతి సాగర్ల సరిత, తృతీయ బహుమతి వీణ, నాలుగో బహుమతి సైదమ్మ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల నాయకురాలు గౌసియాబేగం, పుష్ప, ఎం నవ్య, గౌతమి, దీపిక, మౌనిక, సరస్వతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Jan 17 2024, 19:33