NLG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన కీర్తన, సోని
ఈనెల 17 నుండి 20వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరుగుతున్న 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాలికల ఫుట్బాల్ పోటీలకు నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన ఇద్దరు క్రీడాకారిణిలు .. మద్ది కీర్తన మరియు అప్పల సోని లు ఎంపికైనరని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
ఇద్దరూ క్రీడాకారినులు చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ హెడ్ కోచ్ మద్ది కర్ణాకర్ శిక్షణలో నిరంతరం సాధన చేస్తూ హై లెవెల్ ఫిజికల్ ఫిట్నెస్ ని పెంపొందించుకుంటూ.. ఫుట్బాల్ క్రీడలోని మెళుకులని నేర్చుకుని రాష్ట్రస్థాయి బాలికల పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలవడానికి తమ వంతు ప్రధాన పాత్రను పోషించి జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైనారని తెలిపారు.
మద్ది కీర్తన నల్గొండ పట్టణంలోని DVK రోడ్ లో గల ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుచూ ఫార్వర్డ్ ఫుట్బాల్ ప్రేయర్ గా గుర్తింపు సాధిస్తూ ఉన్నది.
అప్పల సోని నల్గొండ పట్టణంలోని నారాయణ స్కూల్ లో 9వ తరగతి చదువుచూ గోల్ కీపర్ గా మంచి గుర్తింపు సాధిస్తున్నది.
ఇద్దరు ప్లేయర్స్ కూడా తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనారని బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
Jan 17 2024, 13:53