/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన కీర్తన, సోని Mane Praveen
NLG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన కీర్తన, సోని

ఈనెల 17 నుండి 20వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరుగుతున్న 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాలికల ఫుట్బాల్ పోటీలకు నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన ఇద్దరు క్రీడాకారిణిలు .. మద్ది కీర్తన మరియు అప్పల సోని లు ఎంపికైనరని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు. 

ఇద్దరూ క్రీడాకారినులు చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ హెడ్ కోచ్ మద్ది కర్ణాకర్ శిక్షణలో నిరంతరం సాధన చేస్తూ హై లెవెల్ ఫిజికల్ ఫిట్నెస్ ని పెంపొందించుకుంటూ.. ఫుట్బాల్ క్రీడలోని మెళుకులని నేర్చుకుని రాష్ట్రస్థాయి బాలికల పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలవడానికి తమ వంతు ప్రధాన పాత్రను పోషించి జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైనారని తెలిపారు.

మద్ది కీర్తన నల్గొండ పట్టణంలోని DVK రోడ్ లో గల ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుచూ ఫార్వర్డ్ ఫుట్బాల్ ప్రేయర్ గా గుర్తింపు సాధిస్తూ ఉన్నది.

అప్పల సోని నల్గొండ పట్టణంలోని నారాయణ స్కూల్ లో 9వ తరగతి చదువుచూ గోల్ కీపర్ గా మంచి గుర్తింపు సాధిస్తున్నది.

ఇద్దరు ప్లేయర్స్ కూడా తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనారని బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

NLG: బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి గా గిరి నర్సింహ

నల్గొండ: బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి గా గిరి నర్సింహ నియమించినట్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏకుల రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా గిరి నర్సింహ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు నిరంతరం సేవలనందిస్తూ.. బహుజనులు ఆర్థికంగా, రాజకియంగా, సామాజికంగా ఎదగాడానికి తన వంతు కృషి చేస్తానని, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు, జిల్లా అధ్యక్షులు రాజారావు కు మరియు బిఎస్పి ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

NLG: ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో విజయం సాధించిన టీమ్ కు రూ. 25,000/-

నల్లగొండ జిల్లా:

చిట్యాల మండలంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో విజయం సాధించిన టీం కు శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు 25 వేల రూపాయలను బహుమతి గా అందించారు. 

యువత క్రిడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, ఉత్తమ ప్రతిభను చూపి తమ గ్రామానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, మొగిలి కిషన్ పాల్గొన్నారు.

NLG: తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక: జెర్రిపోతుల ధనుంజయ గౌడ్

నల్లగొండ జిల్లా: తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ముగ్గుల పోటీలకు ఆర్థికసహకారం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమని వారు అన్నారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చెనగోని నందు, ఎం జంగయ్య మాట్లాడుతూ.. ఇలాంటి ముగ్గులు పోటీలు నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని వారు అన్నారు.

అనంతరం ఈ ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న, చెనగోని నందు, ఎం జంగయ్య చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి టి. యమునా, ద్వితీయ బహుమతి సాగర్ల సరిత, తృతీయ బహుమతి వీణ, నాలుగో బహుమతి సైదమ్మ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల నాయకురాలు గౌసియాబేగం, పుష్ప, ఎం నవ్య, గౌతమి, దీపిక, మౌనిక, సరస్వతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

TS: రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే రిటైరైనప్పటికీ.. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న అధికారుల వివరాలు రేపు సాయంత్రం 5 గంటల్లోగా ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఆర్కియాలజీ, MCHRD, ఎండోమెంట్ ఇలా పలు శాఖల్లో విశ్రాంత అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని తొలగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? అని చర్చ మొదలైంది.

TS: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ లను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరు అభ్యర్థులకు ఫోన్‌ కాల్‌ ద్వారా సమాచారం అందించినట్లు అభ్యర్థులు నిర్దారించారు. అయితే అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

AP: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ (ఏపీ పీసీసీ) గా వై.ఎస్. షర్మిల నియమితులయ్యారు. ప్రజల ఆకాంక్ష మేరకు షర్మిలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం చొరవ చూపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

NLG: జ్ఞాన పథం ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండల కేంద్రంలో జ్ఞాన పథం ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, జ్ఞాన పథం క్యాలెండర్ ఆవిష్కరణ మంగళవారం స్థానిక ఎమ్మార్వో శ్రీనివాసులు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో జ్ఞాన పథం ఛైర్మన్ చిన్నిక్రిష్ణ మొగిళ్ళ, మండల ఇంచార్జ్ ఈద రమేష్ పాల్గొన్నారు. ఈద రమేష్ మాట్లాడుతూ.. జ్ఞాన పదం ఆర్గనైజేషన్ ద్వారా డ్రాప్ ఔట్ పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించడానికి కృషి చేస్తామని తెలిపారు.

మకరజ్యోతి దర్శనమిచ్చింది.. శబరిమలలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది

పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనం

ఇచ్చింది. ఈ ఘట్టాన్ని చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివచ్చారు. అయ్యప్పనామస్మరణతో శబరిగిరులు మారుమోగుతున్నాయి. శబరిమల మకరజ్యోతి లేదా మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు దర్శనమిస్తుంది. అందుకే దీన్ని శబరిమల మకరజ్యోతి అని పిలుస్తారు.

NLG: ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం:

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలు వట్టిమార్తి గ్రామంలో నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. అంతకు ముందు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బెహన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ.. సమసమాజం నిర్మాంచాలన్నా, బహుజనులకు అన్నివిధాల న్యాయం జరగాలన్నా, అణగారిన వర్గాల అభివృద్ధిని చూడాలన్నా బహుజనసమాజ్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, చిట్యాల మునిసిపల్ అధ్యక్షులు అవిరెండి ప్రశాంత్, మల్లేష్, వినయ్ బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు