TS: పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండండి: తెలంగాణ మలిదశ ఓయూ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్
తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండండి, డ్రగ్స్ నేరస్తుల పట్ల పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ మలిదశ ఓయూ విద్యార్థి అన్నారు.
ఆదివారం హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ నేరగాళ్లు స్కూల్ పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేయించడం ఆందోళన కలిగిస్తుందని, ఇటీవల జరిగిన కొత్తూరు ప్రభుత్వ పాఠశాల ఉదంతం.. తల్లిదండ్రులలో భయాందోళన కలిగిస్తుందని అన్నారు. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తుల నుండి చాక్లెట్లు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
డ్రగ్స్ నేరగాళ్లు ముందుగా ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చి తర్వాత చాక్లెట్ రూపంలో డ్రగ్స్ కి అలవాటు చేసే ప్రమాదం ఉందని ఇటీవల జరిగిన ఘటన ద్వారా తెలుస్తుందని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సన్మార్గంలో నడిపించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రేష్మ హుస్సేన్ అన్నారు.
Jan 14 2024, 13:20