NLG: 30 పడకల మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
మర్రిగూడ: మండల కేంద్రంలోని 30 పడకల CHC ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్యం అంటే సేవ అని వైద్యం కోసం వచ్చే వారికి సమయానికి మెరుగైన చికిత్స అందించి, వారికి ప్రాపర్ గైడెన్స్ అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రికి ఇంకా కావాల్సిన వసతులు అందిస్తామని, సమస్యల పరిష్కారానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వైద్య సిబ్బందితో ప్రతి ఒక్కరూ మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని విద్య ఆరోగ్య రంగాలలో రోల్ మోడల్ గా నిలబెట్టడం కోసం ప్రస్తుతం తాను ఆరోగ్యము, విద్యపై దృష్టి సారించామని తెలిపారు.
నియోజకవర్గంలో ఇప్పటికే తాము బెల్ట్ షాపులను మూయించానని ఎమ్మెల్యే తెలిపారు.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, 400 లేదా 500 మంది విద్యార్థులతో మూడు లేదా నాలుగు గ్రామాలకు కలిపి ఒక పాఠశాలను అభివృద్ధి చేసి ప్రజల, ప్రభుత్వ సహకారంతో మెరుగైన విద్యను అందిద్దామని అన్నారు. విద్యా, ఆరోగ్య రంగాలలో మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తయారు చేసుకుందామని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Jan 13 2024, 19:01