/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: జీవో నెంబర్ 46 ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలి: గ్రామీణ జిల్లాల పోలీస్ అభ్యర్థులు Mane Praveen
TS: జీవో నెంబర్ 46 ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలి: గ్రామీణ జిల్లాల పోలీస్ అభ్యర్థులు
హైదరాబాద్: వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ అభ్యర్థులు జీవో నెంబర్ 46 ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు ప్రజాభవన్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 53 శాతం పోలీస్ ఉద్యోగాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి కేటాయించడం, 47% ఉద్యోగాలు మిగతా గ్రామీణ జిల్లాలకు కేటాయించడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఈ జీవోను రద్దు చేయాలని కోరుతున్నారు.

హైదరాబాద్: వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ అభ్యర్థులు జీవో నెంబర్ 46 ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు ప్రజాభవన్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత

NLG: రేపు మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలకు రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, రేపు శనివారం మునుగోడు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

ఉదయం 10:30 గంటలకి మర్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాఖాపరమైన సమీక్ష నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు గట్టుప్పల్ మండల కేంద్రంలో పద్మశాలి సోదరులకు అందించే చేనేత మగ్గాల పంపిణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

NLG: 'వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శం'

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని, జాతీయ యువజన దినోత్సవం ను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిల్లల కోసం తొలిమెట్టు కమ్యూనిటీ ప్రోగ్రాం వారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి పుస్తకాలను మరియు బ్యాడ్జీలను వాలంటీర్లకి పంపిణీ చేయడం జరిగింది.

ప్రిన్సిపాల్ ఉపేందర్ మాట్లాడుతూ.. విద్యార్థిని, విద్యార్థులు స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి బిక్షపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. యువత క్రమశిక్షణతో ఉండాలని వారు అనుకుంటే ఏదైనా సాధించగలరని, దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉందని అన్నారు. పిల్లల కోసం తొలిమెట్టు కార్యక్రమ నిర్వాహకులు స్టేట్ ఆర్గనైజర్ అభిజిత్ మాట్లాడుతూ.. యువత పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని యువత శక్తివంతులుగా తయారై దేశ సేవలో పాల్గొనాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పిల్లల కోసం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నాగుల వేణు, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు యాదగిరి రెడ్డి, ఎం. వెంకట్ రెడ్డి, శీలం యాదగిరి, గంజి భాగ్యలక్ష్మి , శివరాణి , సెక్టర్ ఆఫీసర్ వీరయ్య, అధ్యాపకులు కృష్ణ కౌండిన్య, వెల్దండి,  శ్రీనాథ్ పటేల్, వెంకట్ రమణ, మల్లేష్ మరియు వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

TS: ప్రారంభమైన మోడల్ స్కూల్ అడ్మిషన్ లు

నేటి నుండి వచ్చే నెల 22వ తేదీ వరకు మోడల్ స్కూల్ అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు.. 7,8,9,10 తరగతి లలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయుటకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు, ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మాట్లాడుతూ.. ఉన్నతమైన విద్యా విలువలు కలిగిన తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకొని, ప్రవేశ పరీక్ష కొరకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు.

NLG: శబరిమల కు బయలుదేరిన కంజర శ్రీను గురు స్వామి

నల్లగొండ పట్టణంలోని మణికంఠ నగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో, ఈరోజు అయ్యప్ప స్వామి మాలాధరణ గురు స్వాములు, కన్నే స్వాములు దీక్ష పూర్తి చేసుకొని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం ఇరుముడి కట్టుకొని శబరిమల కు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో గురుస్వామి కంజర శ్రీను, తదితరులు ఉన్నారు.

NLG: 'జై భీమ్ సాహో యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఈనెల 14న ముగ్గుల పోటీలు

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'జై భీమ్ సాహో యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 14న మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు యూత్ ప్రెసిడెంట్ ఈద గిరిశ్వర్ తెలిపారు. 

మహిళలు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. ఇందుకోసం 12వ తేదీ సాయంత్రంలోగా తమ పేర్ల ను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. మొదటి బహుమతి రూ.5016, రెండో బహుమతి రూ. 4016, మూడవ బహుమతి రూ. 3016 ఉన్నట్లుగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్ పగడాల శంకర్ 9494707818 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

NLG: అసోసియేట్ ప్రొఫెసర్లు గా పదోన్నతులు పొందిన నాగార్జున ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అంతటి శ్రీనివాసులు-కెమిస్ట్రీ విభాగాధిపతి, డాక్టర్ లక్ష్మణ్ గౌడ్-ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి-కామర్స్ &బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి, డాక్టర్ N. దీపిక - తెలుగు విభాగం.. ఇటీవలనే రాష్ట్ర కళాశాల విద్య చేపట్టిన పదోన్నతుల్లో ఎన్జీ కళాశాల నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బోధన, పరిశోధన, కళాశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల ద్వారా మరియు సర్వీస్ అనుభవం ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించామని చంద్రశేఖర్ స్టాఫ్ క్లబ్ సెక్రటరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, IQAC కోఆర్డినేటర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

NLG: సంక్రాంతి సందర్భంగా NG కళాశాలలో ముగ్గుల పోటీలు

నల్గొండ టౌన్: నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో గురువారం విద్యార్థులకు, మహిళా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా సాధికారత విభాగం కన్వినర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మరియు కమిటీ మెంబర్స్ పోటీని పర్యవేక్షించారు. డాక్టర్ జోత్స్న, మనెమ్మ, లవేందర్ రెడ్డి జడ్జెస్ గా విజేతలను ఎంపిక చేసారు. విజేతలకు రిపబ్లిక్ డే రోజు బహుమతులను ప్రధానం‌ చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఉపేందర్ అధ్యక్షత వహించగా అధ్యాపకులు యాదగిరి రెడ్డి, నాగుల వేణు, మల్లేశ్, శివరాణి, మహేశ్వరి, శీలం యాదగిరి,దుర్గాప్రసాద్ సావిత్రి, స్రవంతి,శిరీష, సరిత, విద్యార్థులు పాల్గొన్నారు.

TS: ఘనంగా పిఆర్టియు టిఎస్ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ

యాదాద్రి జిల్లా:

నారాయణపూర్ మండలంలోని ఎంఆర్సి వద్ద పిఆర్టియు టిఎస్ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో జనగాం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కలిముద్దీన్, మండల శాఖ అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, సీనియర్ ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి, రాష్ట్ర అసోసియేటివ్ అధ్యక్షులు శ్రీనివాస్, హరికిషన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు చొల్లేటి శ్రవణ్ కుమార్, యాదిరెడ్డి, వెంకన్న, మండల కార్యదర్శి పబ్బు దేవేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, కోటేశ్వర్ ఉన్నారు.

TS: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ రాజీనామాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 

సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.