NLG: 'వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శం'
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని, జాతీయ యువజన దినోత్సవం ను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిల్లల కోసం తొలిమెట్టు కమ్యూనిటీ ప్రోగ్రాం వారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి పుస్తకాలను మరియు బ్యాడ్జీలను వాలంటీర్లకి పంపిణీ చేయడం జరిగింది.
ప్రిన్సిపాల్ ఉపేందర్ మాట్లాడుతూ.. విద్యార్థిని, విద్యార్థులు స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి బిక్షపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. యువత క్రమశిక్షణతో ఉండాలని వారు అనుకుంటే ఏదైనా సాధించగలరని, దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉందని అన్నారు. పిల్లల కోసం తొలిమెట్టు కార్యక్రమ నిర్వాహకులు స్టేట్ ఆర్గనైజర్ అభిజిత్ మాట్లాడుతూ.. యువత పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని యువత శక్తివంతులుగా తయారై దేశ సేవలో పాల్గొనాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిల్లల కోసం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నాగుల వేణు, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు యాదగిరి రెడ్డి, ఎం. వెంకట్ రెడ్డి, శీలం యాదగిరి, గంజి భాగ్యలక్ష్మి , శివరాణి , సెక్టర్ ఆఫీసర్ వీరయ్య, అధ్యాపకులు కృష్ణ కౌండిన్య, వెల్దండి, శ్రీనాథ్ పటేల్, వెంకట్ రమణ, మల్లేష్ మరియు వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
Jan 12 2024, 21:09