NLG: సంక్రాంతి సందర్భంగా NG కళాశాలలో ముగ్గుల పోటీలు

నల్గొండ టౌన్: నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో గురువారం విద్యార్థులకు, మహిళా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా సాధికారత విభాగం కన్వినర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మరియు కమిటీ మెంబర్స్ పోటీని పర్యవేక్షించారు. డాక్టర్ జోత్స్న, మనెమ్మ, లవేందర్ రెడ్డి జడ్జెస్ గా విజేతలను ఎంపిక చేసారు. విజేతలకు రిపబ్లిక్ డే రోజు బహుమతులను ప్రధానం చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఉపేందర్ అధ్యక్షత వహించగా అధ్యాపకులు యాదగిరి రెడ్డి, నాగుల వేణు, మల్లేశ్, శివరాణి, మహేశ్వరి, శీలం యాదగిరి,దుర్గాప్రసాద్ సావిత్రి, స్రవంతి,శిరీష, సరిత, విద్యార్థులు పాల్గొన్నారు.
Jan 12 2024, 18:13