TS: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీసీఎల్ఏ సభ్యుడు చైర్మన్ గా, ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రేమండ్ పీటర్, భూ నిపుణులు అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీ ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను రెడీ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ధరణి పోర్టల్‌లో చేయాల్సిన మార్పులను ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్స్ చేయనుంది.
Jan 10 2024, 15:20