నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండషన్: పిన్నింటి నరేందర్ రెడ్డి
మునుగోడు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 80 మంది పదవ తరగతి విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల దృష్ట్యా.. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సహకారంతో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను నేడు ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలకు భవన మరమ్మత్తులు, పెయింట్స్,నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు.
కస్తూరి ఫౌండేషన్ సహకారంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రములోని కొన్ని వందల ప్రభుత్వ పాఠశాలల ను మరమ్మత్తులు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పరిస్థితులకు అనుగుణంగా అనుగుణంగా దేనికైనా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారని, భవిష్యత్తులో ఆ మనసత్త్వమే ఉత్తమ పౌరులుగా ఎదగడానికి దోహద పడుతుందని, అలాంటి విధ్యార్దుల యొక్క విద్యాభివృద్ధి కోసం కస్తూరి ఫౌండేషన్ నిరంతరం పని చేస్తుదని, పేదవారు విద్యకు దూరం కావొద్దనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ ను స్థాపించామన్నారు. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం రవీందర్, ఉపాధ్యాయులు చంద్రం, యాదయ్య, కళావతి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.
Jan 09 2024, 14:47