TS: నామినేటెడ్ పదవుల బరిలో ముస్లిం మైనారిటీ నుండి ఓయూ తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్
HYD: తెలంగాణ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో బుల్లెట్ గాయాల పాలైన ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
2010 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సందర్భంలో ఆమెకు ఉస్మానియా యూనివర్సిటీలో బుల్లెట్ గాయాలయ్యాయి. ఆవిధంగా ఆమె డేరింగ్, డాషింగ్ మహిళగా బుల్లెట్ రాణిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా నామినేటెడ్ పదవులు భర్తీ చేపట్టే దిశగా వార్తలు వస్తున్న నేపథ్యంలో, నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ రేష్మ హుస్సేన్.. ముస్లిం మైనార్టీ నుండి నామినేట్ పదవి ముస్లిం మైనారిటీ చైర్మన్, టీఎస్పీఎస్సీ చైర్మన్, టిఎస్పిఎస్సి బోర్డు మెంబర్ వంటి ఏదైనా ఒక పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుండి ఆమెకు చదువుల పట్ల ఉన్న ఆసక్తి తో కెమిస్ట్రీ లో ఎమ్మెస్సీ, తెలుగులో ఎంఏ, ఎంఈడి, రసాయన శాస్త్రంలో పిహెచ్డి వంటి ఉన్నత విద్యలను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పూర్తిచేసింది. ఆమె గత ఐదు సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ఐదు సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా మైనారిటీ గురుకుల విద్యా సంస్థలలో విధులు నిర్వహించి విద్యార్థులను ఉన్నత స్థాయిలలో స్థిరపడే విధంగా కృషి చేస్తున్నారు. ఇటీవల మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు లను రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రులను కోరినట్లు ఆమె తెలిపారు.
డా. రేష్మ హుస్సేన్ తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థిని గా ఉద్యమంలో కీలకంగా పని చేయడం, ఆ తర్వాత కూడా విద్యార్థుల కోసం గురుకులాలలో అధ్యాపకురాలుగా ప్రిన్సిపాల్ గా పనిచేయడం, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉన్నత విద్యావంతురాలు కావడం, గత ప్రభుత్వం లో విద్యార్థులకు నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని పలు కార్యక్రమాల ద్వారా, మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమె పేరును నామినేటెడ్ పదవులకు పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Jan 08 2024, 17:54