/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఆశావర్కర్స్ యూనియన్ Mane Praveen
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఆశావర్కర్స్ యూనియన్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, నేడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐదవ రోజు సమ్మె లో భాగంగా, స్థానిక తహసిల్దార్ మహేందర్ రెడ్డి కి  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ..  న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆశల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆశలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఫిక్స్డ్ వేతనం రూ. 18000 ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం ప్రమాద బీమా 5 లక్షలు ఇవ్వాలని, అట్లాగే ఆశా లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, ఆశాల పనిభారం తగ్గించాలని జాబ్ చార్ట్  విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, కాలం సుజాత, భీమనపల్లి అరుణ, జాజాల అనిత, పందుల పద్మ, పొనుగోటి సునీత, బుసిరెడ్డి ధనమ్మ, పల్లె కంసల్య, తదితరులు పాల్గొన్నారు SB NEWS SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
NLG: గిరిజన బిడ్డకు 89 లక్షల ఉద్యోగం
నల్లగొండ జిల్లా, గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామం దేవుల తండాకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పాండు, కుమారుడు జటావత్ గణేష్.. సంవత్సరానికి 89 లక్షల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. హోండా కంపెనీ, జపాన్ ఆర్ అండ్ డి విభాగంలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఎన్నికయ్యాడు. ఐఐటి మద్రాసులో ఎంటెక్ పూర్తి చేసి, క్యాంపస్ ప్లేస్మెంట్లో 89 లక్షల ఉద్యోగం సంపాదించాడు. ఈ సందర్భంగా ప్రతిభ ఉన్నోడికి తిరుగులేదని గ్రామస్తులు అనుకుంటూ గిరిజన బిడ్డ గణేష్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA
NLG: క్రీడాకారులకు భోజన సదుపాయం అందించిన గాంధీ గ్లోబల్ మరియు జిల్లా ట్రస్మా శాఖలు
నల్గొండ: మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నల్గొండ డివిజన్ స్థాయి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ ఆటల పోటీలు.. అండర్ 14, 17 బాలికలకు నిర్వహించారు. ఈ పోటీలలో నల్గొండ డివిజన్లోని 11 మండలాల నుండి దాదాపు 550 మంది క్రీడాకారిణిలు పాల్గొన్నారు. వారందరికీ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు నల్లగొండ జిల్లా ట్రస్మా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన వసతిని 2 రోజులు నేడు, రేపు కల్పిస్తున్నామని డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA SB NEWS NATIONAL NEWS APP

STREETBUZZ NEWS APP
NLG: ఆర్మీ అగ్నివీర్లుగా ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్లగొండ: ఇటీవల విడుదల చేసిన ఆర్మీ అగ్నివీర్ ఫలితాలలో స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల నుండి 12 మంది విద్యార్థులు అగ్నివీర్లు గా ఎంపిక కావడం జరిగింది, వారిని ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ డా.ఘన్ శ్యామ్ అభినందించారు. ఆర్మీ అగ్నివీర్ లుగా ఎంపికైన వారిలో ఎన్జీ కళాశాల విద్యార్థులు  సాల్లోజు ఉమేష్ కుమార్, వీరబోయిన మధు, రేకులరపు రమేష్, బయ్య మహేష్, కోరే శివ, మల్లికంటి కార్తిక్, దాసరి పవన్, పొలాగోని కార్తిక్, కంగుల కళ్యాణ్, గానుగుంట్ల లాజర్, షైక్ షరీఫ్, సిద్దు ఉన్నారు.

కళాశాల అధ్యాపకులు వీరిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.ఘన్ శ్యామ్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్ , వెంకటరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపకులకు పిహెచ్.డి గైడ్ షిప్
నల్లగొండ:  పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపకులకు పిహెచ్డీ గైడ్ షిప్ లభించింది. తెలుగుశాఖాధ్యక్షులు డా. తండు కృష్ణయ్య, తెలుగు అధ్యాపకులు డా. ఎన్. దీపిక, డా. వెల్డంది శ్రీధర్ లను మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి. గోపాల్ రెడ్డి పిహెచ్. డి పర్యవేక్షకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఘన శ్యామ్ తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ఘనశ్యామ్ మాట్లాడుతూ.. తెలుగు విభాగం లోని ముగ్గురు అధ్యాపకులకు ఒకేసారి పిహెచ్. డి  గైడ్ షిప్ రావడం గర్వకారణమని అన్నారు. ఇది విద్యార్థులకే కాదు కళాశాల నాక్ గ్రేడ్ కు కూడా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మిగతా విభాగాల అధ్యాపకులు కూడా పరిశోధన పట్ల, గైడ్ షిప్ సాధించడం పట్ల చొరవ చూపాలని సూచించారు. ఈ సందర్బంగా వైస్ చాన్సలర్ ఆచార్య బి. గోపాల రెడ్డి, డీన్ ఆచార్య ఎం. సుదర్శన్ రెడ్డి, ఉపకులపతి ఓఎస్డీ ఆచార్య అల్వాల రవి, వాణిజ్యశాస్ర మరియు వ్యాపార నిర్వహణ విభాగం ప్రధానాచార్యులు డా. ఆకుల రవి, వ్యాపార నిర్వహణ విభాగం అధిపతి డా. ఎమ్వీ రమణారెడ్డి లకు ప్రిన్సిపాల్ మరియు గైడ్ షిప్ పొందిన అధ్యాపకులు కృతఙ్ఞతలు తెలిపారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల అంతర్గత నాణ్యతా ప్రమాణాల బాధ్యులు డా. ప్రసన్న కుమార్, రీసెర్చ్ కమిటీ అధ్యక్షులు డా అంతటి శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ డా. సయ్యద్ మునీర్ ఇతర అధ్యాపకులు గైడ్ షిప్ పొందిన అధ్యాపకులను అభినందించారు. SB NEWS SB NEWS NALGONDA
NLG: కార్మికుల సమ్మె పై రాష్ట్ర క్యాబినెట్లో చర్చించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా: మర్రిగూడ: తెలంగాణ రాష్ట్రంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెలు చేస్తున్న అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికుల వేతనాలు ఇతర సమస్యలపై 29న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి సమ్మెలో ఉన్న కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని గురువారం సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అంగన్వాడీ, ఆశాలు చేస్తున్న సమ్మె శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే సమ్మెలు ఉండవు, దరఖాస్తులు ఇస్తే చాలు సమస్యలు పరిష్కరిస్తామని మాది ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగే ప్రభుత్వం అని గొప్పలు చెప్పిన కేసీఆర్, రాష్ట్రంలో తమ వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని 18 రోజులుగా అంగన్వాడి, 4 రోజులుగా ఆశ, నిన్నటి నుండి మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఇదే మొండి వైఖరి అనుసరిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కార్మిక వర్గం తమ సమస్యలపై సుదీర్ఘకాలం వివిధ రూపాల్లో ఆందోళన చేసి, విసిగి వేసారి సమ్మె నోటీసు ఇచ్చి ఎదురు చూసిన ఫలితం లేకపోవడంతోనే, కార్మిక వర్గం సమ్మెలో ఉన్నారని వారి సమస్యలు పరిష్కరించకుండా అధికారులతో ఒత్తిడి చేయించి, పోలీసులతో బెదిరించి నిర్బంధాన్ని ప్రయోగించి సమ్మె లను విచ్చినం చేయాలని చూస్తే, గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలుస్తుందని  ఆయన హెచ్చరించారు. కార్మికులు ఎవరు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ, ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖర్ని వ్యవహరిస్తుందని విమర్శించారు.
ప్రభుత్వానికి కార్మిక వర్గం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న, 29న జరిగే క్యాబినెట్లో ఈ సమ్మెలపై చర్చించి పరిష్కరించాలని కోరారు.
          
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, అంగన్వాడీ ఆశ యూనియన్ నాయకులు ఆర్ శోభ, కే రజిత ,బి శోభారాణి, సువర్ణ, జంపాల వసంత, ఏర్పుల పద్మ కాలం సుజాత, జే అనిత, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS
కాంగ్రెస్ పార్టీలో చేరిన వేముల వీరేశం, మైనంపల్లి హన్మంతరావు
TS: మల్కాజ్ గిరి నియోజకవర్గ  ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం కాంగ్రెస్ లో చేరారు. మరి కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు హస్తం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్‌, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి నాయకులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గురువారం సాయంత్రం తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు తాఖరే, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS TELANGANA STREETBUZZ NEWS APP



లెంకలపల్లి: రికార్డ్ స్థాయిలో రూ. 1,01,116/- లకు పలికిన లడ్డు వేలం

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, గాంధీ సెంటర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద లడ్డు వేలంపాట రికార్డ్ స్థాయిలో రూ. 1,01,116/- లకు పలికింది. గ్రామానికి చెందిన కాటం వెంకన్న రూ. 1,01,116/- లకు సొంతం చేసుకున్నారు. అదేవిధంగా

కొబ్బరికాయ - దాసరి వెంకన్న రూ. 9,116/-
పండ్లు - పగిళ్ళ రామకృష్ణ 9,016/-
పట్టువస్త్రాలు - చిరుమామిళ్ళ గోపి రూ.5,116/-
చిన్న లడ్డు - గుంటోజు బ్రహ్మచారి రూ.23,116/-
లకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు గాంధీ సెంటర్ వినాయక ఉత్సవ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. SB NEWS SB NEWS NALGONDA DIST STREETBUZZ NEWS APP SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP TELANGANA
చౌటుప్పల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రేపు శుక్రవారం నాడు చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యక్రమ సమయ వివరాలు:
ఉ 8:00    అల్లాపురం
ఉ 8:30    పీపలపహాడ్
ఉ 9:00    డి నాగారం
ఉ 9:30    కొయ్యలగూడెం
ఉ 10:00  ఎల్లంబావి
ఉ 11:00  పంతంగి
ఉ 11:45  ఎస్ లింగోటం
మ 12:15 నేలపట్ల
మ 1:00   కుంట్లగూడెం
మ 1:30   మందోళ్లగూడెం
మ 2:00   పెద్దకొండూర్
మ 2:30   చిన్నకొండూర్

ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.