తెలంగాణ ఇంజనీర్ల నైపుణ్యం మహా అద్భుతం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ సాంకేతిక అద్భుతం. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ఏర్పాటు చేసిన వాటర్ కండక్టర్ సిస్టమ్ పొడవు మొత్తంగా 112 కిలోమీటర్లు కాగా.. అందులో 61.08 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉండడం విశేషం.
ప్రధాన ఓపెన్ కెనాల్ పొడవు కేవలం 50 కిలోమీటర్లు.. అంటే కృష్ణమ్మ నీళ్లు ఎక్కువ భాగం భూగర్భంలోనే పరవళ్లు తొక్కనున్నాయి. అదీగాక భారీ జలాశయాలు, వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్న్‌లు, సబ్ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి. మిగతా నిర్మాణాలన్నీ పెద్దపెద్ద పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్ భూగర్భంలోనే ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతులో నిర్మితమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్టు యావత్తు ఓ భూగర్భ అద్భుతం.
ఒక్కో సర్జ్‌పూల్ సగటు లోతు 75 మీటర్లు కావడం విశేషం. ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్ ద్వారా సగటున కిలో మీటర్ వరకు ప్రయాణించాల్సి ఉంది.
మొత్తం 11 ప్రధాన సొరంగాలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధాన నీటి తరలింపు నెట్‌వర్క్ పొడవు 112.06 కిలోమీటర్లు కాగా, అందులో ప్రధాన ఓపెన్ కాలువ 50.49 కిలో మీటర్లు.. కాగా మిగిలిన 61.08 కిలోమీటర్ల మార్గమంతా సొరంగమే కావడం విశేషం.
అదీగాక ప్రాజెక్టుకు నీటిని తీసుకునే ఇన్‌టేక్ పాయింట్ నుంచే సొరంగ నిర్మాణాలు ప్రారంభం కావడం మరో విశేషం. నీటిని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి తొలుత ఓపెన్ అప్రోచ్ కెనాల్ ద్వారా నార్లాపూర్ హెడ్‌రెగ్యులేటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్ సర్జ్‌పూల్‌కు తీసుకెళ్తారు........
Sep 10 2023, 15:19