/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న :మంత్రి హరీష్ రావు దంపతులు Yadagiri Goud
తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న :మంత్రి హరీష్ రావు దంపతులు

తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు.

ఇవాళ‌ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న రాత్రి కాలినడకన తిరుమల‌ చేరుకున్న హ‌రీశ్‌రావుకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

సోమవారం ఉదయం ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమ‌ల వచ్చినట్లు తెలిపారు.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ..!

Rahul Gandhi: పరువు నష్టం కేసుతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి.. తిరిగి సభ్యత్వం దక్కుతుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది..

స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.

అయితే రాహుల్ న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. శిక్ష అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

దీంతో రాహుల్ గాంధీ సభ్యత్వ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. అయితే సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా..? మరింత సమయం తీసుకుంటారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

Jammu and Kashmir : పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం.ఉగ్రవాది హతం

Jammu and Kashmir : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు చేసిన యత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు..

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

(Army foils infiltration bid in Poonch) సోమవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఓ పాక్ ఉగ్రవాది హతం అయ్యాడు..

పూంచ్ జిల్లాలోని దేగ్వార్ సెక్టార్‌లో అప్రమత్తమైన భద్రతా బలగాలు సోమవారం తెల్లవారుజామున చీకటి ముసుగులో ఇటువైపుకి చొరబడేందుకు ప్రయత్నించిన కొందరు ఉగ్రవాదుల కదలికలను గమనించి ఎదురుకాల్పులు జరిపారు.

పాకిస్థాన్ వైపు నుంచి నియంత్రణ రేఖలోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత సైనికులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఎదురుకాల్పులు జరిపారు..

హుజూర్‌నగర్‌లో 5 కొత్త గ్రామ పంచాయతీల ఎంపిక

సూర్యాపేట జిల్లా:ఆగస్టు 07

హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొత్తగా ఐదు గ్రామపంచాయతీలను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలంలోని గానుగ బండ గ్రామపంచాయతీ నుండి కొండాయి గూడెం,

నేరేడుచర్ల మండలం నుంచి పత్తేపురం గ్రామపంచాయతీలో కొనసాగిన జానల దిన్న , కల్లూరు గ్రామపంచాయతీలో కొనసాగిన లాల్ లక్ష్మీపురం మేళ్లచెరువు మండలంలోని కప్పల కుంట గ్రామపంచాయతీలో కొనసాగిన దుబ్బ తండా ,

అలాగే హేమ్ల తండా గ్రామపంచాయతీలో కొనసాగిన జగ్గు తండాలో ఇక నుండి గ్రామపంచాయతీలుగా కొనసాగనున్నాయి.

ఈ గ్రామ పంచాయతీలో ఏర్పాటు కృషి చేసిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజల కృతజ్ఞతలు తెలుపుకున్నారు....

గద్దర్ అంత్యక్రియల విషయంలో చెలరేగిన వివాదం

హైదరాబాద్:ఆగస్టు 07

ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది.

గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం (ATF) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గద్దర్‌కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ మావోయిజం వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేనని ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ పేర్కొన్నారు.

గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని తెలిపారు . ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగాగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందన్నారు. నక్సలిజం సాధారణ పౌరులతో పాటు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని శశిధర్ వెల్లడించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో.. శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను.. ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు...

త్వరలోనే పీఆర్సీ.. ఆలోగా ఐఆర్‌పై నిర్ణయం

హైదరాబాద్ :ఆగస్టు 07

అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్‌ PRCను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు.

ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్‌)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వనరులు సమకూరగానే దేశం ఆశ్చర్యపోయేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్నారని గుర్తుచేశారు. ఉద్యోగస్తులంతా తమ పిల్లలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ సాధన- సాధించిన ప్రగతి’పై జరిగిన లఘుచర్చలో ఆయన మాట్లాడారు.

సింగరేణి ఉద్యోగుల కు దసరా కానుకగా రూ.1000 కోట్ల బోనస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసరా పింఛన్లను కూడా అవసరాన్ని బట్టి పెంచుతామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఇటీవల ఖమ్మం సభలో పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామందని, వారు 4 వేలు ఇస్తే మేం రూ.5 వేలు అనలేమా? అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల మేనిఫెస్టో లో గంపెడు అస్త్రాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తామని చెప్పారు. అవసరమైతే పెన్షన్లు పెంచుతామని, తాము చేయగలిందే చెబుతామని అన్నారు. కాళేశ్వరం పై కాంగ్రెస్‌ అడ్డగోలుగా మాట్లాడుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం తెచ్చి, భుజాన వేసుకొని అభివృద్ధి చేసినందుకే నాకు పిండ ప్రదానం చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు.

ప్రజలే తగిన తీర్పు చెబుతారు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం లేకపోతే తుంగతుర్తికి నీళ్లు వచ్చేవా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నుంచి కోదాడ దాకా నీళ్లు పారుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు చలవేనన్నారు. రైతుల బతుకు విలువ కాంగ్రె్‌సకు తెలియదని.. కాళేశ్వరం వల్లే గోదావరి సజీవంగా మారిందని చెప్పారు.

250 కిలోమీటర్ల పొడవున్న గోదావరిలో 9 ఏళ్ల క్రితం వరకు దుమ్ము రేగితే నేడు 100 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయన్నారు. కాళేశ్వరంపై ఓ వెకిలి, పిచ్చి పేపరు వాడు రాస్తాడని, నిలువెల్లా విషం చిమ్ముతున్నారని మీడియాపై తన అక్కసు వెళ్లగక్కారు.

కాళేశ్వరం దండగ అని మన రాష్ట్రం కాని వాడు చెబుతాడని పరోక్షంగా జేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా కాళేశ్వరమేనన్నారు. ఎస్పారెస్పీని నీల్గబెట్టింది బంగారు కాంగ్రెస్సేనని.. ప్రస్తుతం ఎస్పారెస్పీకీ కాళేశ్వరం నీళ్లతో పునరుజ్జీవం తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రాంతంలో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే ప్రస్తుతం 3 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ వస్తే రైతుబంద్‌కు రాంరాం, కరెంట్‌ గోల్‌మాల్‌, దళితబంధు బంద్‌ అవుతుందని చెప్పారు. పస్తుతం భూ రికార్డులను మార్చడం సీఎం చేత కూడా కాదని చెప్పారు...

మద్యం మత్తులో యువతిని వివస్త్రను చేసిన యువకుడు..

జవహర్‌నగర్‌: మద్యం మత్తులో ఓ దుర్మార్గుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేశాడు..

చుట్టుపక్కల ఉన్నవారు ఈ దుశ్చర్యను అడ్డుకోవాల్సింది పోయి ఫొటోలు, వీడియోలు తీస్తూ చిత్రం చూశారు. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి బాలాజీనగర్‌లో ఈ దారుణం జరిగింది. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య(30) కూలీ. మద్యానికి బానిసయ్యాడు.

ఆదివారం రాత్రి 8.30కు తల్లితో కలిసి బాలాజీనగర్‌ బస్టాండ్‌ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో స్థానిక యువతి (28) దుకాణం నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూసిన మారయ్య ఆమెపై చెయ్యివేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కోప్పడిన యువతి దూరంగా నెట్టేసింది..

దీంతో విచక్షణ కోల్పోయిన మారయ్య.. ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బలవంతంగా ఆమె దుస్తులను చించి లాగేశాడు. పక్కన ఉన్న మారయ్య తల్లి కనీసం అడ్డుకోలేదు.

అటు నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఆమెపైనా దాడికి ప్రయత్నించాడు. దాదాపు 15 నిముషాల పాటు ఆ యువతి నగ్నంగా రోడ్డుపైనే రోదిస్తూ కూర్చున్నా చుట్టుపక్కలవారు స్పందించ లేదు. అతను వెళ్లాక కొందరు వచ్చి ఆమెను కవర్లతో కప్పేసి జవహర్‌నగర్‌ పోలీసులకు సమాచారమిచ్చారు..

మలహార్ మండలంలో ఇద్దరమ్మాయిలు ఎస్సైగా ఎంపిక

భూపాలపల్లి జిల్లా:ఆగస్టు 07

సివిల్ ఎస్సై ఫలితాల్లో తాడిచర్ల మల్హర్ మండలంలోని, ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన బానోత్ గీత, చిన్నతూoడ్ల గ్రామానికి చెందిన నారా రుచిత్ర, అనే ఇద్దరు అమ్మాయిలు

ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సైగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఈ ఇద్దరు అమ్మాయిలు ఆణిముత్యాలుగా నిలిచారు.

బానోత్ గీత తల్లిదండ్రులు సమ్మయ్య లలిత వ్యవసాయ కుటుంబం, నారా సుచిత్ర తల్లిదండ్రులు రామయ్య వీఆర్ఏ గా చేస్తూ భార్య లక్ష్మి

వ్యవసాయ పనులకు వెళ్తూ అమ్మాయిలను పై చదువులు చదివించి ఎస్సై ఉద్యోగంలో ఎంపికయ్య విధంగా ప్రోత్సహించారు.

ఇద్దరమ్మాయిలు ఎస్సైలుగా ఎంపిక కావడం తల్లిదండ్రుల కన్న కలలను సాకారం చేశారు.దీంతో వారి తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతూ బిడ్డలను హత్తుకున్నారు లక్ష్యాన్ని నెరవేర్చారని అభినందించారు...

Road Accident: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ కెమెరాల్లో రికార్డు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మావల-గుడిహత్నూర్‌ మండలాల మధ్య 44వ జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది.

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ వాఘపూర్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది..

ఈ ఘటనలో లారీలోని డ్రైవర్స్‌తో సహా ద్విచక్రవాహనదారుడికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

రోడ్డుపై లారీ బోల్తా పడడంతో రవాణాకు కాసేపు అంతరాయం ఏర్పడింది. దీంతో క్రేన్‌ సాయంతో లారీని పక్కకు తొలగించారు..

సీఎం జగన్, చంద్రబాబు ఒకే చోట - ప్రతిష్ఠాత్మకం, ఉత్కంఠ..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. ఈ సమయంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో పర్యటనకు ఒకే రోజున రానున్నారు..

ఇద్దరూ ఒకే ప్రాంతంలో బస చేయనున్నారు. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరి నేతల పర్యటనల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు రాజమహేంద్రవరం వేదిక కానుంది..

పోలవరంలో ఇద్దరు నేతలు:సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు (సోమవారం) పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజమహేంద్ర వరంలో బస చేయనున్నారు.

'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరిట కొద్ది రోజులుగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఆయన ఆదివారం రాత్రికి ఏలూరు చేరుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం(అల్లూరి సీతారామరాజు జిల్లా)లో సీఎం.. చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు.

సోమవారం ఉదయం పది గంటలకు చింతలపూడి చేరుకుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30కు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు..