/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు 11 గంటలకు రాజ్‌భవన్‌ ముట్టడి: టీఎంయూ Yadagiri Goud
నేడు 11 గంటలకు రాజ్‌భవన్‌ ముట్టడి: టీఎంయూ

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్‌ తమిళసై తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా విజయవంతంగా ముగిసింది.

ఉదయం 6 గంటల నుంచే డిపోల ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన తెలిపారు.

దీంతోబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

కార్మికుల ధర్నాతో ఉదయం 6 నుంచి 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కాగా, శనివారం నాడు రాజ్‌భవన్‌ ముట్టడికి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది...

మరో కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ - 3

చంద్రయాన్ - 3 మరో కీలక ఘట్టానికి చేరుకుంది. నేడు జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రవేశించనుంది.

శనివారం రాత్రి 7 గంటలకు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రవేశించనుంది.

ప్రస్తుతం ట్రాన్స్ లూనార్ మార్గంలో చంద్రయాన్ -3 పయనిస్తోంది.

జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు చంద్రయాన్ - 3ని ఇస్రో అంతరిక్షంలోకి పంపింది.

ఈ నెల 23న సాయంత్రం జాబిల్లిపై చంద్రయాన్ - 3 ల్యాండర్ దిగనుంది...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమల:ఆగస్టు 05

తిరుమల కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్తీ సాధారణంగా ఉంది.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శుక్రవారం శ్రీవారిని 69270 మంది భక్తులు దర్శించుకున్నారు.

అలాగే 28755 మంది భక్తులు తలనీలాలు సమర్పించినారు.

ఇదిలా ఉండగా టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు.

Pawan Kalyan: ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయి: పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి: ఎన్నికల ఏడాదిలో అడుగు పెడుతున్నాం.. ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన క్రియాశీలక నేతలతో పవన్‌ సమావేశమయ్యారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజా పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు రావొచ్చనిపిస్తోందన్నారు.

''డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదు. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైకాపా భావిస్తోంది. వైకాపా దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత జవాబుదారీతనం ఉండాలి.

జనాల్ని దోచుకునే నేతలు కాదు, తమ సొమ్మును పంచే నేతలు కావాలి. డబ్బుతో ఓట్లు కొనమని నేను చెప్పడం లేదు. కానీ, నాయకులు కావాలంటే ఖర్చు పెట్టి తీరాలి.. తప్పదు. రూపాయి ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరు.

వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలి. భావితరం గురించి ఆలోచించే నేతలు వేరే పార్టీల నుంచి వస్తే ఆహ్వానిస్తాం. మంచి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. అలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు'' అని పార్టీ నేతలకు పవన్‌ దిశానిర్దేశం చేశారు..

Chandrayaan 3: మూడింట రెండొంతుల ప్రయాణం పూర్తి.. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి!

బెంగళూరు: చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) మిషన్‌.. మరో కీలక ఘట్టానికి చేరువైంది..

ఇప్పటికే భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని జాబిల్లివైపు దూసుకెళ్తోన్న ఈ వ్యౌమనౌక.. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. 'చంద్రయాన్‌-3'ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Injection)ను

ఇస్రో శాస్త్రవేత్తలు ఈ నెల 5న (శనివారం) రాత్రి 7 గంటల సమయంలో చేపట్టనున్నారు. మరోవైపు.. ఈ వ్యోమనౌక తన ప్రయాణంలో ఇప్పటివరకు మూడింట రెండొంతులు పూర్తి చేసుకున్నట్లు 'ఇస్రో' వెల్లడించింది..

'చంద్రయాన్‌-3'ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు.

అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. ఆగస్టు 1న 'ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య'లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో ఆ వ్యౌమనౌక ప్రస్తుతం చంద్రుడి దిశగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అనుకున్నట్లుగానే అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టనుంది..

Chandrababu: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

పుంగనూరు: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు విశ్వప్రయత్నం చేస్తున్నాయి.

రహదారికి అడ్డంగా లారీని అడ్డు పెట్టరు. లారీ అడ్డు తొలగించాలని ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపినట్టు సమాచారం. పోలీసులు లాఠీ ఛార్జిలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి.

వైకాపా దాడిలో 20కార్లు ద్వంసం..

పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద ప్రధాన రహదారిపై కంటైనర్‌ లారీ, వాహనాలను పోలీసులు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వైపు అంగళ్లు నుంచి చంద్రబాబు కాన్వాయ్‌ వెంట వెళ్తున్న తెదేపా నేతల వాహనాలపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కార్ల అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

అంగళ్లులో రెచ్చిపోయిన వైకాపా..

అధికారమే అండగా అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్లులో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తెదేపా శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైకాపా కార్యకర్తలు చించేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి. వైకాపా రాళ్ల దాడిలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నించారు. రాళ్లదాడి చేస్తున్న వైకాపా కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని తెదేపా శ్రేణులు ఆరోపించారు. గాయపడిన కార్యకర్తలకు వెంటనే చికిత్స చేయించాలి పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు.

ధైర్యం ఉంటే రండి.. చూసుకుందాం: చంద్రబాబు

''తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. డీఎస్పీ తన యూనిఫామ్‌ తీసేయాలి. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా? ధైర్యం ఉంటే రండి చూసుకుందాం. పులివెందులకే వెళ్లాను ఇక్కడికి రాకూడదా? నేనూ చిత్తూరు జిల్లాలోనే పుట్టా. పోలీసుల అండతోనే వైకాపా నేతలు రాజకీయం చేస్తున్నారు. ఎవరి జోలికీ మేము పోము.. మా జోలికి వస్తే ఊరుకోము. పుంగనూరు వెళ్తున్నా.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తా. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు. అతనికి ట్యాగ్‌ ఎమ్మెల్యే. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలి. ఇక్కడ జరిగిన ఘటనలో పోలీసుల వైఫ్యలం ఉంది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలి. రాబోయే రోజుల్లో వైకాపాను తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారు. ప్రజలు భూస్థాపితం చేస్తారనే భయంతోనే ఇలా చేస్తున్నారు'' అని చంద్రబాబు మండిపడ్డారు..

Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్‌

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నర్‌ తమిళిసైకు పంపి రెండు రోజులు గడిచినప్పటికీ..

ఆమె ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావించింది.

అయితే ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు పంపించింది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం బిల్లు రూపొందించింది..

SB NEWS

SB NEWS

Central Jail: సెంట్రల్ జైలులో మత్తు పదార్థాల కలకలం.. ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు అరెస్ట్

visakha Central Jail: గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి..

ఎంతలా అంటే.. ఏకంగా సెంట్రల్‌ జైలులో అమ్మకాలు జరిగేంతగా పెరిగిపోయాయి. విశాఖపట్నంలోని సెంట్రల్‌ జైలులో మత్తు పదార్థాలు కలకలం సృష్టించాయి. గంజాయి, గుట్కాలు గుట్టు చప్పుడు కాకుండా ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. చాలా కాలంగా ఖైదీలకు మత్తు పదార్థాలు చేరవేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు..

సెంట్రల్‌ జైలులో ఖైదీలకు మత్తు పదార్థాలను చేరవేస్తున్న మైలపల్లి ఎల్లాజీని సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మత్తు పదార్థాలను బాల్స్‌లాగా చుట్టి జైలు గోడ మీద నుంచి విసరడం ద్వారా ఖైదీలకు నిందుతుడు చేరవేస్తున్నాడు.

చాలా కాలంగా నిందితులను పట్టుకోవాలని వేచిచూస్తున్న పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని పట్టుకోవడం కోసం నిఘా పెట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. ఆరిలోవ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి 14 రోజులు రిమాండ్ విధించారు.

ఈ నేపథ్యంలో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబమని పోలీసులు హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు..

రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీలు

రైతు రుణమాఫీ సహా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు గురువారం శాసనమండలి

లో తీర్మానాలను ప్రవేశపెట్టారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల అభినందిస్తూ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, శాసనమండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు మరో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని వారన్నారు.

రైతులకు రూ. 19వేల కోట్ల రుణాలను మాఫీచేస్తామని ప్రకటించి గురువారం నుంచే రుణాలను మాఫీ చేయడం ప్రారంభించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. టీఎస్‌ ఆర్టీసీ సంస్థను విలీనం చేయడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 43,373 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని వెల్లడించారు.

సంస్థ పరిరక్షణతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు....

వీకెండ్ వచ్చేసింది.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 04

వీకెండ్ వచ్చేసింది. వీకెండ్‌లో సర్వసాధారణంగా భక్తుల రద్దీ పెరుగుతుందన్న విషయం తెలిసిందే.

శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 59,898 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 26,936 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....