ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు ?
- మరికొద్దినెలల్లో రాష్ట్రంలో ఎన్నికల జంక్ సైరన్ !
- అసెంబ్లీలో చర్చలపై ఉత్కంఠ
- రైతు రుణమాఫీ పై సర్కార్ నిర్ణయం
- ఆర్టీసి సంస్థఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం పై గైడ్ లైన్స్
- ప్రత్యేక నూతన పథకాల అమలు పై చర్చలు
తెలంగాణ(Telangana) వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings)మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి..ఏ ఏ అంశాలపై చర్చించాలనే విషయాన్ని ఈరోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న(Cantonment MLA Sayanna) మృతిపై సభలో సీఎం కేసీఆర్ (KCR)సంతాప తీర్మనం ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మాజీ ఎమ్మెల్సీ వేదెల వెంకట నర్సింహచారి(Vedela Venkata Narsimhachari) మృతికి సంతాపం ప్రకటిస్తారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ (BRS)పార్టీ అందుకు తగినట్లుగానే టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను(RTC Employees) ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత నెల 31న జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
దీన్ని ఆమోదించి అనంతరం దీనిని గవర్నర్ ఆమోదం కోసం పంపించనుంది. దీంతో పాటు గతంలో గవర్నర్ వివరణ కోరిన మూడు కీలక బిల్లులను ప్రభుత్వం శాసన సభలో చర్చకు పెట్టి మళ్లీ ఆమోదింపజేసుకోనుంది. అలాగే వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టంపై కూడా సభలో చర్చించనుంది. అదే విధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పుఅంశంపై కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వనమా హాజరుతారా లేక జలగం అటెండ్ అవుతారా అనే విషయంపై క్లారిటీ రానుది.
బహుశా ఇవే చివరి సమావేశాలా..?
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలవతున్నాయి. ఈసారి సమావేశాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చివరి సమావేశాలు కావడంతో ఎన్ని రోజులు నిర్వహించాలి..? ఏ ఏ అంశాలపై చర్చించాలి..? ఏ బిల్లులను ఆమోదించాలనే ..? విషయంపై సాయంత్రం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవలే మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న, మాజీ ఎమ్మెల్సీ వేదెల వెంకట నర్సింహచారికి సంతాపం ప్రకటించనుంది. అటుపై ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంపై చర్చ..ఆ బిల్లును ఆమోదించుకొని గవర్నర్‌కు పంపనుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనపై కేసు గెలిచిన జలగం వెంకట్రావు(Jalagam Venkat Rao) ప్రమాణ స్వీకారం చేయలేదు. దీనిపై వారం రోజులుగా ఈసీ క్లారిటీ ఇవ్వలేదు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సెషన్స్ కు ఎవరు హాజరవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Aug 04 2023, 09:24