ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ
ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ 3 నెలలు.. రూ.50,910 కోట్లు
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది.
వినూత్న సంసరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది.
ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ
బడ్జెట్ అంచనాల్లో 20% రాబడి
నిరుడు కంటే 7,360 కోట్లు అధికం
పన్నుల రూపంలోనే 31 వేల కోట్లు
జీఎస్టీ ద్వారా 11 వేల కోట్ల రాక
స్టాంపులు, రిజిస్ట్రేషన్లతో 3 వేల కోట్లు
కాగ్ త్రైమాసిక నివేదికలో వెల్లడి
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంసరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో రాష్ర్టానికి రూ.2,59,861.91 కోట్లు సమకూరుతుందని బడ్జెట్‌లో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో అంటే.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి మొత్తం రూ.50,910.11 కోట్లు ఖజనాకు చేరాయి. అంటే.. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇప్పటికే సుమారు 20 శాతం ఆదాయం సమకూరినట్టే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,256.61 కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌లో అంచనా వేయగా, నిరుడు జూన్ వరకు రూ.43,550.51 కోట్లు వచ్చా యి. అంటే.. అప్పటి బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వచ్చింది 18 శాతం. అయితే… గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రూ.7,359.6 కోట్లు అధిక ఆదాయం సమకూరింది. శనివారం కాగ్ మొదటి త్రైమాసిక నివేదికను వెల్లడించింది. అందులో తెలంగాణ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్న తీరును వర్ణించింది. కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థికంగా అణగదొక్కాలని చూస్తున్నా… తెలంగాణ మాత్రం ఆర్థికంగా ఏటికేడు బలపడుతూనే ఉన్నది. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులివ్వకుండా కొర్రీలు పెడుతున్నా… సీఎం కేసీఆర్ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
జీఎస్టీదే అగ్రస్థానం
రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో జీఎస్టీ రాబడే అగ్రస్థానంలో ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి జీఎస్టీ రూపంలో రూ.50,942.49 కోట్లు వస్తుందని ఆర్థిక అంచనా వేయగా, మొదటి త్రైమాసికానికి రూ.11,418.47 కోట్లు వసూలైంది. బడ్జెట్ అంచనాల్లో ఇది 22 శాతం. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపం లో రూ.42,189.47 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా.. మొదటి త్రైమాసికానికి రూ. 9,645.14 కోట్లు వచ్చింది. అంటే నిరుడితో పోలిస్తే ఈ సారి రూ.1,773.33 కోట్లు అధిక రాబడి వచ్చిం ది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.18,500 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా, జూన్ నాటికి రూ. 3,510.63 రాబడి సమకూరింది. అమ్మకం పన్ను రూపంలో రూ.7,532.96 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ.2,988.88 కోట్లు, పన్నేతర రాబడి రూ.1,488.10 కోట్లు రాబడి వచ్చింది. ప్రధాన వ్యయాలను పరిశీలిస్తే రెవెన్యూ ఖాతా ఖర్చు రూ.15,406.89 కోట్లు ఉన్నది. వేతనాల కోసం రాష్ట్రం వెచ్చించింది రూ.9,796.83 కోట్లు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు పింఛన్ల రూపంలో రూ.4,158.57 కోట్లు వెచ్చించింది. ఇలా.. జూన్ నెల వరకు రాష్ర్టానికి రూ.50,910.11 కోట్లు సమకూరగా, అన్నింటికీ కలిపి రూ.47,290.64 కోట్లను రాష్ట్రం ఖర్చు చేసింది. రాబడిలో ఎక్కువ మొత్తం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే రాష్ట్రం వెచ్చిస్తున్నది. పటిష్ట ప్రణాళికతో ఏటికేడు ఆర్థిక వనరులను పెంచుకొంటున్నది.
Jul 31 2023, 21:30