పైలట్లు ఇద్దరు ఒకే రకమైన ఆహారం తీసుకోరు..ఎందుకో తెలుసా
ఇటీవల హోలీ పండగ రోజు ఓ ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఇద్దరు పైలట్లు కాక్ పిట్ లో ఆహారం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విచారణ చేపట్టిన విమానయాన సంస్థ ఆ ఫైలట్లను రోజువారి విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ విమాన పైలట్ల ఆహార నియమావళి గురించి చర్చనీయాంశమైంది. అయితే పైలట్లు కాక్ పీట్ లో ఆహారం తీసుకోవచ్చా.. విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే విధమైన ఆహారం ఎందుకు తీసుకోరు అనే విషయాలపై ఇప్పడు తెలుసుకుందాం. కొన్ని విమాన సంస్థల నిబంధనల ప్రకారం పైలట్లు కాక్ పీట్ లో ఆహారం తీసుకోకూడదు.
కానీ మరికొన్ని విమానయాన సంస్థల పైలట్లు కాక్ పీట్ లో ఆహారం తీసుకోవచ్చు.అయితే ఇద్దరు పైలట్లు ఒకేసారి ఆహారం తీసుకోకూడదు అనేదు నిబంధన. కొన్ని విమానాల్లో కాక్‌పిట్‌లో పైలట్లు ఆహారం తీసుకునేందుకు ట్రే ఉంటే, మరికొన్ని విమానాల్లో ప్రయాణికులతోపాటు సీటులో కూర్చొని తినాల్సిందే. సాధారణంగా విమానం ఆటో పైలట్ మోడ్‌లో ఉన్నప్పుడు పైలట్లు ఆహారం తీసుకుంటారు.
వాస్తవానికి ఇద్దరు పైలట్లు ఒకే విధమైన ఆహారం తీసుకోకూడదు అనే దానికి సంబంధించి డీజీసీఏ, ఎఫ్‌ఏఏ ఎలాంటి నిబంధనలు రూపొందించలేదు. కానీ, ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదు అనే సంప్రదాయాన్ని విమానయాన రంగంలో ఎన్నో ఏళ్లుగా పైలట్లు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఇద్దరు తిన్న ఆహారంతో వారికి అసౌకర్యం కలిగితే విమానం అదుపు తప్పుతుంది. అందుకే వేర్వేరు ఆహారం తీసుకోవాలనే సంప్రదాయాన్ని ప్రతి పైలట్ పాటిస్తుంటారు. కొన్ని విమానయాన సంస్థల్లో పైలట్లు ఇద్దరు ఒకే రకమైన ఆహారం కావాలని కోరితే.. విమాన సిబ్బంది వారి అభ్యర్థనను తిరస్కరించవచ్చు. ఒకవేళ తప్పనిసరై తినాల్సి వస్తే.. పరిమిత మోతాదులో మాత్రమే వారికి ఆహారం అందజేస్తారు.
Mar 21 2023, 15:12