రూ.75 లక్షలు గెలుచుకున్న కూలీ.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగు
అదృష్టం అంటే ఇతడితే ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి కూలీగా పనిచేసేందుకు కేరళకు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 75 లక్షల లాటరీని గెలుచుకున్నారు. బెంగాల్ కు చెందిన ఎస్కే బాదేశ్ కేరళ ప్రభుత్వ స్త్రీ శక్తి లాటరీలో టికెట్ కొనుగోలు చేశాడు. అయితే అదృష్టవశాత్తు బాదేశ్ ను లాటరీ తగిలింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తనకు మళయాళం రాదు, రాష్ట్రం కానీ రాష్ట్రం, తనను మోసగించి ఎవరైనా లాటరీ టికెట్ లాగేసుకుంటారని భయపడని బాదేశ్ ఏకంగా పోలీసులనే రక్షణ కోరాడు.
లాటరీ గెలుపొందిన వెంటనే తనకు రక్షణ కల్పించాలంటూ మంగళవారం అర్థరాత్రి మువట్టపుజ పోలీస్ స్టేషన్ కు పరుగు తీశాడు. తనకు లాటరీ విధివిధానాలు తెలియవని, తనకు, తన ఫ్రైజ్ మనీకి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. తన టికెట్ ఎవరైనా లాక్కుంటారనే భయంతో పోలీసులను ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. మువట్టుపుజ పోలీసులు ఆయనకు విధివిధానాలు అర్థమయ్యేలా చేసి అన్ని రకాల భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో కూడా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు బాదేశ్. అయితే తనకు ఎప్పుడూ కూడా విజయం వరించలేదని, ఈ సారి మాత్రం అదృష్టలక్ష్మీ తనను కరుణించిందని బాదేశ్ తెగ సంబరపడిపోతున్నాడు. ఎర్నాకులంలోని చొట్టానికరలో ఎస్‌కే బాదేశ్ రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై టికెట్ కొనుగోలు చేశారు. కేరళకు వెళ్లి ఏడాది కూడా కాలేదు, తనకు మళయాళం తెలియకపోవడంతో తన స్నేహితుడు కుమార్ సాయాన్ని కోరాడు. డబ్బు రాగానే బెంగాల్ లోని తన ఇంటికి తిరిగి వెళ్తా అని, కేరళ కేరళ తనకు తెచ్చిన అదృష్టంతో తన ఇంటిని పునరుద్ధరించుకోవాలని, వ్యవసాయాన్ని విస్తరించాలని అతను చెబుతున్నాడు.
Mar 17 2023, 21:16