ఆయుధాల కొనుగోలుకు రూ.70 వేల కోట్ల రక్షణశాఖ డీల్
ఆయుధ సామాగ్రి కొనుగోలుకు కేంద్ర రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు వివిధ ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసేందుకు రూ.70 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) ఆమోదించినట్లు అధికారులు తెలిపారు.
భారత నౌకా దళానికి 60 మేడ్ -ఇన్-ఇండియా యుటిలిటీ హెలికాప్టర్లు మెరైన్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు (BrahMos missiles), భారత సైన్యం కోసం 307 ATAGS హోవిట్జర్లు, 9 ALH ధృవ్ ఛాపర్‌ల (Dhruv choppers)ను కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh ) నేతృత్వంలోని మండలి సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ డీల్‌లో హెచ్‌ఏఎల్ నుంచి 60 యూహెచ్ మెరైన్ చాపర్‌లను కొనుగోలు చేసేందుకు భారత నావికాదళానికి రూ.32 వేల కోట్ల మెగా ఆర్డర్ కూడా ఉందని అధికారులు తెలిపారు. భారత నౌకాదళానికి రూ. 56 వేల కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులు, శక్తి ఈడబ్ల్యూ సిస్టమ్స్, యూటీలిటీ హెలికాప్టర్లు- మారీమ్ అనుమతి లభించింది.
Mar 17 2023, 13:45