వినియోగదారుడా మేలుకో నీ హక్కులు తెలుసుకో: వినియోదారుల హక్కుల జోనల్ కార్యదర్శి ఎం డి సాధిక్ పాష
వినియోగదారుడా మేలుకో
నీ హక్కులు తెలుసుకో
తేదీ: 15/03/2023 నాడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త, మరియు వినియోగదారుల హక్కుల జోనల్ కార్యదర్శి శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు మాట్లాడుతూ సమాజంలో ప్రతిదీ కల్తీ జరుగుతున్న నేపధ్యంలో వినియోగదారుడు చాలా అప్రమత్తంగా ఉండాలని వస్తువు కొనే ముందు తయారీ తేదీ మరియు గడువు తేదీ, నాణ్యత చూసి కొనాలని కొన్న ప్రతి వస్తువుకు తప్పని సరిగా బిల్లు తీసుకోవటం మరిపోవద్దని వస్తువు యొక్క నాణ్యత విషయంలో లోపం ఉంటే వ్యాపారిని నిలదీసే హక్కును వినియోగదారుల హక్కుల చట్టం వినియోగదారునికి కల్పించిందని ఒకవేళ వినియోగదారుడు నష్ట పరిహారం కోరుకుంటే జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ ను సంప్రదించి స్వయంగా కేసు వేసి తన కేసును తానే వాదించుకునే అవకాశం వినియోగదారునికి ఉన్నది కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి వినియోగదారుల హక్కుల చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాలని అలాగే ప్రభుత్వం మరియు వినియోగదారుల సంఘాలు కూడా తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, డి.ఎస్.ఓ,జిల్లా వినియోగదారుల హక్కుల కమీషన్ చైర్మన్, లీగల్ మెట్రాలజి,ఆర్.టి.ఏ. మరియు వివిధ శాఖ అధికారులు పలు వినియోగదారుల సంఘాలు పాల్గొన్నాయి.
Mar 16 2023, 06:50