‘‘మేడమ్ క్యూట్‌గా ఉన్నావ్’’.. మహిళా పోలీస్‌ని వేధించిన ఆకతాయి
పోలీసులతో పెట్టుకుంటే.. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి పట్ల సఖ్యతగా ఉంటే పర్లేదు కానీ, కొంచెం తేడాగా ప్రవర్తిస్తే మాత్రం.. ఇక దబిడిదిబిడే! ఈ భయంతోనే.. ఎవ్వరూ వారి జోలికి వెళ్లరు. కానీ.. ఓ ఆకతాయి మాత్రం అందుకు భిన్నంగా ఓ మహిళా పోలీస్‌ని వేధించాడు. ‘‘మేడమ్.. నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్’’ అంటూ టీజ్ చేశాడు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్టు వాగాడు. అయితే.. అతడు నేరుగా వేధించలేదు. ఒక ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ.. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ మమిళా పోలీస్ వీడియో తీస్తూ, ఇలా వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ వ్యవహారం వివాదాస్పదం అవ్వడంతో.. ఆ ఆకతాయిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
ఆ ఆకతాయి ముంబై లోకల్ ట్రైన్‌లో, ఫుట్‌బోర్డు వద్ద నిల్చొని ప్రయాణిస్తున్నాడు. ఆ ట్రైన్ సరిగ్గా బాంద్రా స్టేషన్‌కి చేరుకున్నప్పుడు.. అతగాడు తన మొబైల్ ఫోన్ బయటకు తీసి, ప్లాట్‌ఫామ్‌లో నిల్చున్న ఇద్దరు మహిళా పోలీసుల వీడియో తీశాడు. ఆ వీడియో రికార్డ్ చేస్తూ.. ‘మేడమ్, నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్’ అంటూ చెప్పాడు. ఆమెతో కంపెనీ మస్తుగా ఉంటుందంటూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వాగాడు. ఈ వీడియో అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వెంటనే వైరల్ అయ్యింది. అందులో మహిళా పోలీస్‌ని టీజ్ చేయడంతో, ఈ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో.. ఈ వీడియోపై ముంబైకి చెందిన ఎన్‌జీఓ జీవధార సంఘ్ సీరియస్ అయింది. ఈ వీడియోని ట్విటర్‌లో షేర్ చేసి.. మహారాష్ట్ర సీఎం కార్యాలయం, ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది.
‘‘ముంబై పోలీసులు 365 రోజుల పాటు 24 గంటలూ ప్రజలకు సేవ అందిస్తుంటారు. అలాంటి మహిళా పోలీసుల పట్ల ఓ వ్యక్తి ‘మస్తాన్ కంపెనీ’ పేరుతో వీడియో పోస్ట్ చేసి, వారిని అవమానిస్తున్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. వీరికి తగిన బుద్ధి చెప్పాలి’’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో.. ఆ ఆకతాయిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ఆకతాయి.. మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాము ఆ వీడియో కంటెంట్‌ని తనిఖీ చేస్తున్నామని, అనుమానుతుడ్ని ట్రాక్ చేస్తున్నామని అని బాంద్రా GRP అధికారి తెలిపారు.
मुंबई पुलिस हमारी सेवा में साल के 365 दिन 24 घंटे रहती है ऐसे में महिला पुलिस के साथ मस्तान कंपनी नाम से सोशल मीडिया पर वीडियो डालकर कुछ लोग बदतिमीजी कर रहे है महिला का अपमान करने वाले और छेड़छाड़ करने वालो को सबक सिखाना चाहिए। pic.twitter.com/YsxRrOVKDw
— जीवनधारा संघ ( NGO ) March 13, 2023
Mar 15 2023, 20:35