అమెరికా నిఘా డ్రోన్ విమానాన్ని ఢీకొట్టిన రష్యా
రష్యా – —ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే.. నల్ల సముద్రంలో తిరుగుతున్న అమెరికా నిఘా డ్రోన్ ను కూల్చేసింది రష్యా.
నల్ల సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో నిఘా కోసం అమెరికా ఈ డ్రోన్ విమానాన్ని ప్రయోగించింది. దీన్ని గుర్తించిన రష్యా యుద్ధ విమానాలు.. దాన్ని వెంబడించాయి. రష్యా సుఖోయ్ యుద్ధ విమానాల నుంచి రసాయనాలు చల్లాయి. అప్పటికీ అమెరికా డ్రోన్ విమానం జలాల నుంచి వెనక్కి వెళ్లలేదు. ఈ క్రమంలోనే రష్యా యుద్ధ విమానం.. అమెరికా నిఘా డ్రోన్ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ముందు భాగం దెబ్బతిన్నది.
ఈ డ్రోన్ విమానాన్ని పూర్తిగా పేల్చివేయాలని భావించింది రష్యా.. అందుకు తగ్గట్టుగానే రాకెట్ల ద్వారా పేల్చివేయాలని నిర్ణయించాయి. దీన్ని పసిగట్టిన అమెరికా మిలటరీ.. డ్రోన్ విమానాన్ని నల్ల సముద్రంలోని జలాల్లో పడిపోయే విధంగా కూల్చేయాల్సి వచ్చిందని ప్రకటించింది అమెరికా. దీన్ని రష్యా ఖండించింది. మా సుఖోయ్ యుద్ధ విమానాలు అమెరికా నిఘా డ్రోన్ విమానాన్ని పేల్చిసినట్లు చెబుతున్నాయి. ఏ దేశానికి ఆ దేశం విరుద్ధంగా ప్రకటనలు చేస్తుంది.
ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం క్రమంలో.. అమెరికా .. రష్యా మధ్య పరోక్ష వార్ నడుస్తుంది. ఇప్పుడు ఏకంగా నల్ల సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా డ్రోన్ విమానాన్ని కూల్చేయటంతో.. రష్యాపై ఆ దేశం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Mar 15 2023, 15:38