*ఈ రోజు కర్ణాటకలో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభించునున్న ప్రధాని మోడీ*
1. నేషనల్ హైవేపై అథారిటీ చే నిర్మించబడ్డ
118 కి.మీ పది-లేన్ యాక్సెస్-నియంత్రిత బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే. ఇది కర్ణాటక రాజధాని బెంగళూరు మరియు రాష్ట్ర సాంస్కృతిక రాజధాని మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని ప్రస్తుతం ఉన్న మూడు గంటల నుండి 75-90 నిమిషాలకు తగ్గిస్తుంది. 8,480 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రహదారిని నిర్మించిన ఈ ప్రాజెక్ట్ యొక్క పునాది రాయిని మార్చి 2018లో వేశారు. ఇది అక్టోబర్ 2022 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే, కోవిడ్-19 ఇతర కారణాల వల్ల కాస్త ఆలస్యం అయింది
ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల బెంగళూరు వాసులు ఊటీ, వాయనాడ్, కోజికోడ్, కూర్గ్ మరియు కన్నూర్ వంటి ప్రాంతాలకు వారాంతపు సెలవుల కోసం వెళ్లే వారి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం కర్నాటకలోనే కాకుండా తమిళనాడు మరియు కేరళలో కూడా పర్యాటకాన్ని పెంచుతుంది.
2. కర్నాటక ధార్వాడ్ లో ఐఐటీ కట్టాలి అని 1996-98మధ్య యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకున్నారు. చివరకు మోడీ ప్రభుత్వం వచ్చాక 2016లో తాత్కాలిక భవనాల్లో ఐఐటీ ప్రారంభించారు.
ఈ రోజు మోడీ ₹852 కోట్ల ఖర్చుతో నిర్మించిన నూతన శాశ్వత భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ భవనం దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ మరియు పర్యావరణ సముదాయంగా తీర్చిదిద్దబడింది.ఇప్పటికే ఈ ఐఐటీ నుండి రెండు బాచ్ ల విద్యార్థులు బయటకు వెళ్లారు. ప్రస్తుతం 700 మంది విద్యార్థులు చదువుతున్నారు
3. కర్ణాటకలో బాగా బిజీగా ఉండే హోస్పెట రైల్వే స్టేషన్ ని కర్ణాటక సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ₹22కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు.
కొత్తగా రిటైరింగ్ రూమ్స్, ఫుడ్ ప్లాజాలు ప్రయాణీకులకు మరెన్నో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.. దీనిని ఈ రోజు మోడీ ప్రారంభిస్తారు.
Mar 12 2023, 09:41