/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్యకు కారణమైన హరిహరను, విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి... Miryala Kiran Kumar
బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్యకు కారణమైన హరిహరను, విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి...

ప్రచురణార్థం

ఫిబ్రవరి 25 2023

నల్లగొండ క్లాక్ టవర్

------------

నిందితులను ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి...

వి.సి,రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్..

జిల్లా ఎస్పీ కి వినతిపత్రం ఇవ్వడానికి వెలుతున్న క్రమంలో నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..

---------------------

హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లా పూర్ మెట్టు సమీపంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసిన హరిహరను, కాకతీయ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు పాలడుగు నాగార్జున(కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి) పందుల సైదులు(విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు) బకరం శ్రీనివాస్(ఎం.ఎస్పి) 

కట్టెల శివకుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు.

శనివారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో కాకతీయ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన సైఫ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను ప్రేమ వ్యవహారంలో హత్య చేసిన హరిహర ల కిరాతకాలను నిరసిస్తూ ఐక్య విద్యార్థి యువజన సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.అనంతరం జిల్లా ఎస్పీ ని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి నేతలు వెలుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.ఈ క్రమంలో నాయకుల ను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్టేషన్ కు తరలించడం జ‌రిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని సైఫ్ వెంటాడిన విధానం,వేధించిన వేధింపులు, బిటెక్ విద్యార్థి నవీన్ ను హత్య చేసిన విధానం అమానవీయంగా ఉన్నాయని ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన నిందితులను ఫాస్ట్రాక్ ఏర్పాటు చేసి 45 రోజుల లోపు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను సరిగ్గా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని వారన్నారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కి కొంతమంది విద్యార్థులు మత్తు పానీయాలను గంజాయి గుట్కాల ను సేవిస్తున్నా యూనివర్సిటీ విసీ కి గాని,రిజిస్టార్ కు గాని పట్టింపు ఉండదన్నారు. మహాత్మగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లకు బాధ్యత వహిస్తున్న వార్డెన్స్ ఏనాడు కూడా ఇలాంటి విద్యార్థులను నియంత్రించిన దాఖలాలు లేవన్నారు. యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై అధ్యాపకులు వేధింపులకు పాల్పడినా విద్యార్థినిలపై విద్యార్థులు ఆకృత్యాలకు పాల్పడినా వీసీకి రిజిస్టార్లకు ఫిర్యాదులు చేసినా ఏనాడూ చర్యలు తీసుకోలేదు అన్నారు. యూనివర్సిటీ విసీ రిజిస్టార్ల నిర్లక్ష్యమే నేడు నవీన్ బలయ్యాడని వారన్నారు. కాకతీయ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ప్రీతి ఆత్మహత్యకు కారణం అయిందన్నారు.దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు ప్రేమోన్మాదుల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వాలు ఈ ఉన్మాదులను కట్టడి చేయడంలో విఫలమయ్యాయని వారన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,టి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా వినయ్,కెవిపిఎస్ జిల్లా సహయ కార్యదర్శి గాదే నర్సింహ్మ,బొల్లు రవీందర్, కొంపల్లి రాము,బొల్లెపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.

నార్కెట్ పల్లి లో ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్, ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి

నార్కెట్ పల్లి మండలం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సొంత గ్రామం బ్రహ్మణ వెళ్ళాంల శక్తి కేంద్ర ఇంచార్జ్ చిరుమర్ధి వెంకన్న గారి ఆధ్వర్యంలో ;(బూతులు 159,160,161,162) శక్తి కేంద్ర కార్నర్ సమావేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డా"నాగం వర్షిత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాగానే కుర్చీ ఏసుకొని బ్రహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చిన కేసీఆర్ గారికి 9 ఏండ్ల పొద్దయితున్న ఇప్పడిదాక సార్ కి కుర్చీ దోర్కట్లేద అని ప్రశ్నించినారు స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పక్కన పెట్టి సొంత వ్యాపారాలు చేసుకొని అక్రమ సంపాదన పై ఎక్కువ మక్కువ పెంచుకున్నారని ఎద్దేవ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శేపూరి రవిందర్ గారు, సీనియర్ సిటిజన్ పాల్వాయి భాస్కర్ రావు గారు,మండల అధ్యక్షుడు కొరివి శంకర్, మాస శ్రీను,శేపూరి రాజు, ముకుంట్ల గణేష్,బుతూ అధ్యక్షులు మంద చంటి,చిరుమర్తి రవి,గేల్లే రాజు,గంజి వెంకటేశ్వర్లు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

హైదరాబాద్: రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.

యువకుడిని కానిస్టేబుల్‌ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు.

 సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు. రాజశేఖర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్ శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసనాయుడు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలపై రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

పద్మశాలి బీద కుటుంబానికి నల్లగొండ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

పద్మశాలి బీద కుటుంబానికి చెందిన నల్ల ధనమ్మ కొర్లపాడు గ్రామం ఈమెకు భర్త లేడు ఈమెకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అని మా దృష్టికి వచ్చింది. పిల్లల ఫీజు నిమిత్తం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో Rs10000.00 పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ పొట్ట బత్తుల సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి కార్యదర్శి రాపోలు సతీష్ గారు రాపోలు శరభయ్య గారు గంజి రామలింగం గారు మిరియాల స్వామి గారు మిరియాల శ్రీనివాస్ గారు మిర్యాల వెంకటేశం గారు చిలుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఖాళీగా ఉన్న లక్ష 80 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, ప్రెస్ మీట్ లో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ డిమాండ్

నేడు నల్గొండ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న లక్ష 80 వేల ఉద్యోగాలు నింపాలని పేద బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందే ప్రభుత్వ అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నింపాలని విద్యార్థులు మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కావున గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేక విద్యార్థులు పరిస్థితి చాలా దయనీయమైనది కావున వెంటనే బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల పక్షాన 1,80,000 ఉద్యోగాలు నింపాలని లేనియెడల బహుజన విద్యార్థుల సమస్యలపై పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పక్షాన పోరాడుతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అల్లంపల్లి కొండల్ వంగూరి సునీల్ ఎర్ర ప్రశాంత్ శివ చౌహన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టిన కారణంగా భార్యాభర్తలిద్దరికీ 14 రోజులు జైలు శిక్ష విధించిన సబ్ కలెక్టర్

నరసాపురం: భార్యాభర్తలిద్దరికీ 14 రోజులు జైలు శిక్ష విధించిన సబ్ కలెక్టర్

నరసాపురం జాయింట్ కలెక్టర్ సూర్య తేజ ఓ వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సిటిజన్ ట్రిబ్యూనల్ కోర్టును మంగళవారం నిర్వహించారు. వృద్ధురాలుని పట్టించుకోని కొడుకు, కోడలికి 14 జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ మాట్లాడుతూ.. నవ మాసాలు మోసి.. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వయోవృద్ధుల సమయంలో పక్కన పెట్టి హింస పెడితే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నల్లగొండ 35వ వార్డు సీనియర్ నాయకులు

గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నల్గొండ 35వ వార్డు బిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ నాయకులుు గంజి రాజేందర్, 35 వ వార్డు అధ్యక్షులు తలారిిి యాదగిరిి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రవర్తి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారుు మాట్లాడుతూూ ఎమ్మెల్యే గారు మరెన్నో పెళ్లిరోజులుు జరుపుకోవాలనిి. సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.

కార్యదర్శిపై విచారణ చేపట్టిన డీపీఓ

కార్యదర్శిపై విచారణ చేపట్టిన డీపీఓ

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, సింగిల్ విండో చైర్మన్ సుబ్బా దత్తుమూర్తి స్వంత ఇంటి వద్ద వ్యవసాయ క్షేత్రంలో పంచాయతీ ట్రాక్టర్, పంచాయతీ కార్మికులతో పనులు చేపిస్తున్నాడని రేచిని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా పంచాయతీ అధికారి రేచిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం విచారణ రిపోర్ట్ కు కలెక్టర్ కు అందజేస్తానని తెలిపారు. వీరితో పాటు మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, రేచిని సర్పంచ్ దుర్గుబాయి గ్రామస్తులు పాల్గొన్నారు.

నల్గొండ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి నల్గొండ జిల్లా గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం లో ముఖ్య అతిధులుగా హాజరైన ZP చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు... ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు: నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు..

మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పక్కగా వస్తాయని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు..

 మంగళవారం ఆయన పట్టణంలోని ఆర్జాలబావిలో 13,14,15,16,17 వార్డులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు.

దీనిలో భాగంగా డబుల్ బెడ్ రూం ల నిర్మాణ ప్రక్రియ పూర్తి చేశారన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

దరఖాస్తులను ఈనెల 26వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని అన్నారు . దరఖాస్తు దారులు దరఖాస్తులు ఇచ్చే క్రమంలో ఆందోళన చెందోదని సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, నాయకులు దోనాల నాగార్జున్ రెడ్డి, మెండు చంద్ర శేఖర్ రెడ్డి, గోపు జలందర్ రెడ్డి, అన్వర్, ఆర్పీలు సిబ్బంది తదితరులు ఉన్నారు.