శివుడి వేషంలో పెళ్లిచేసుకున్న భక్తుడు.. ఒళ్లంత విభూతితో కల్యాణ మండపానికి.. నోరెళ్లబెట్టిన గ్రామస్తులు..
దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్ల హడావుడితో కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. దీంతో ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడే కనిపిస్తుంది. ఇకపోతే, పెళ్లంటే బంధువుల హడావుడి.. స్నేహితుల అల్లర్లతో సరదాగా సాగిపోతూ ఉంటుంది. బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా జరుగుతుంటాయి వివాహాలు. నేటి రోజుల్లో పెళ్లిళ్లను కలకాలం గుర్తుండిపోయేలా చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌ల ట్రెండ్ కూడా పెరుగుతోంది. మరోవైపు పెళ్లిళ్లలో కూడా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య గోద్రాకు చెందిన ఓ శివ భక్తుడు అపూర్వంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
కాచివాడ్ ప్రాంతానికి చెందిన రిషబ్ పటేల్ అనే యువకుడు శివుడి వేషధారణలో పెళ్లి చేసుకున్నాడు. రిషబ్ పటేల్ శివ భక్తుడు కావడంతో ఆ శివయ్య వేషంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శివుడి వేషధారణతో రిషబ్ పటేల్ వధువు మెడలో మూడుముళ్లు వేశాడు. పెళ్లి అనంతరం నగరంలోని ప్రధాన రహదారిపై డీజే, ధోల్ నగారా బీట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిన గోద్రాలోని అంకలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. అఘోరీ సాధు, సాధువులు కూడా రిషబ్ పటేల్ వివాహ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రస్తుతం రిషబ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
Feb 21 2023, 14:05