అర్హత కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి-------- సిఐటియు
అర్హత కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి-------- సిఐటియు
జీవనోపాధి కోసం పట్టణానికి వలస వచ్చి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ అర్హత కలిగిన కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఆదివారం తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు ) నల్లగొండ పట్టణ కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని నిర్ణయించినందున అందులో అర్హత కలిగిన కమ్మరి ,వడ్రంగి కార్మికులందరూ మార్చి 3న తాసిల్దార్ కి దరఖాస్తు చేసుకున్నారని వారికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో వేలాదిమంది అర్హత కలిగిన పేదలు ఉన్నారని వారికి భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి 120 గజాల చొప్పున పంపిణీ చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్పెంటర్ వర్కర్ల కూలి రేట్లు పెరగాల్సి ఉందని అందుకోసం మార్చి 1న కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ పట్టణ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు
యూనియన్ పట్టణ అధ్యక్షుడు సెలవు సైదాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి దాసోజు ప్రభు చారి, సోమయాచారి, జనార్ధన చారి, సురేష్, శ్రీనివాసచారి , ఆంజనేయులు, వెంకన్న, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.
Feb 19 2023, 17:43