నల్గొండ పట్టణ ప్రజలు గత ఆరు నెలల నుండి దూళి, దుముకు అనారోగ్యానికి గురి అవుతున్నారు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
నల్గొండ పట్టణ ప్రజలు గత ఆరు నెలల నుండి దూళి, దుముకు అనారోగ్యానికి గురి అవుతున్నారు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
నల్లగొండ పట్టణములొ రోడ్ల మరమ్మతులు గత ఆరు నెలల నుండి కొనసాగడం వలన పట్టణ ప్రజలు ధూళి, దుముకు గురి అయి అనారోగ్యం పాలవుతున్నారు. మరమతులను త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినారు. తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంల నేడు జరిగినది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడినారు. ప్రస్తుతం యాసంగి సీజన్ ముగిసిన నల్గొండ జిల్లాలో కొంతమంది రైతులకు పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం ఇంకా అందలేదని ప్రభుత్వం స్పందించి వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లా కమిటీ కొన్ని తీర్మానాలను చేయడం జరిగింది. ధరణి పోర్టల్ లో తవ్వే కొద్ది సమస్యలు వెలుగు చూస్తున్నాయి భూవిస్తీర్ణములో మార్పులకు అవకాశం లేకపోవడం, కొత్త పహాని అందుబాటులో ఉండడం లేదని ధరణి లోని సమస్యలనువెంటనే పరిష్కరించాలని తీర్మానించనైనది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా 24 గంటలు రైతులకు కరెంటు సరఫరా చేయడం లేదు, దానితో పంటలు ఎండి పోయే పరిస్థితి కనిపిస్తుంది కావున ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 24 గంటలు కరెంటును సరఫరా చేయాలని తీర్మానించనైనది. వచ్చే సాధారణ ఎన్నికలలో నల్గొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాలని జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రేపు తేదీ17-2-2023 న హైదరాబాదులో జరగబోయే రాష్ట్ర కమిటీ సమావేశానికి పంపడం. జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మారే బోయిన శ్రీధర్ ఉపాధ్యక్షులు సాతీరు యాదయ్య, కార్యదర్శి పులి పాపయ్య, వై పాపిరెడ్డి, కిరణ్ కుమార్ విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Feb 17 2023, 19:56