/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఎస్బీఐ ఏటీఎంలో నమ్మించి మోసం చేసి నాలుగు వేలు డ్రా చేసుకుని పారిపోయిన దుండగుడు Miryala Kiran Kumar
ఎస్బీఐ ఏటీఎంలో నమ్మించి మోసం చేసి నాలుగు వేలు డ్రా చేసుకుని పారిపోయిన దుండగుడు

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా//

ఎస్బీఐ ఏటీఎంలో నమ్మించి మోసం చేసి నాలుగు వేలు డ్రా చేసుకుని పారిపోయిన దుండగుడు

సిర్పూర్

స్తానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాదితుడు

సీసీ ఫూటేజి ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు

పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లను సవరించాలి,స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం:ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లను సవరించాలి

 స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం

 ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

      ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు 

      దొడ్డి కొమరయ్య భవన్లో బుధవారం సిపిఎం నల్గొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సబ్సిడీలు ఇవ్వకుండా కార్పొరేటీకరణ చేయడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. పేదలు, వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టానికి 60 శాతం నిధులు తగ్గిస్తూ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ను సవరించి ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రానికి రావడానికి ఉన్న పంచాయతీరాజ్ ,ఆర్ అండ్ బి రోడ్లను డబల్ రోడ్లుగా మార్చాలని, దెబ్బతిని గుంతలతో అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మత్తులు చేయాలని పాదయాత్రలు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని అన్నారు. పట్టణంలో ప్రధాన రహదారులు మినహా శివారు ప్రాంతాల అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, తదితర సమస్యలపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

       *ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశమ్ ,పాలడుగు ప్రభావతి, నల్లగొండ పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, నన్నూరి వెంకటరమణారెడ్డి, తుమ్మల పద్మ, నల్లగొండ ,తిప్పర్తి, కనగల్లు మండల కార్యదర్శిలు నలపరాజు సైదులు, మన్నె బిక్షం, కందుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.

మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావ్

మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హిందూ స్మశాన వాటికను మహాప్రస్థానంగా పునరుద్ధరించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 3 కోట్ల 59 లక్షలతో నిర్మిస్తున్న మహాప్రస్థానం నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి. రామానుజులరెడ్డిని పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహాప్రస్థానం మొత్తం కలియతిరిగి పనులను పరిశీలించిన కలెక్టర్ నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణ పనులు చేపట్టాలని, మార్చి నెలాఖరు వరకు మహాప్రస్థానం పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ కు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మునిసిపల్ కమిషనర్ పి రామానుజులరెడ్డి ఈఈ జికేడి ప్రసాద్, ఏఈ సుమంత్, మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

మునుగోడు మండలంలో ఎమ్మార్వో గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన SHVS క్యాలెండర్.

సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను మునుగొడు మండలంలోని mro కృష్ణా రెడ్డి dt నరేష్ ,mpdo జానాయ్య ,పంచాయతీ రాజ్ ae రామకృష్ణ గార్ల చే క్యాలెండర్ ఆవిష్కరణ చెయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ జిల్లా కార్యదర్శి p సైదులు గౌడ్,మునుగొడు నియోజకవర్గం అధ్యక్షులు అద్దంకి రామ లింగయ్య ప్రదాన కార్యదర్శి సురిగి శ్రీశైలం,సహదేవు తదితరలు పాల్గొన్నారుు

కడప అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి

వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాల నాయకులతో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనగా 15 2 2023 తేదీన 11 గంటలకు నిరసన కార్యక్రమం జరపడమైనది విషయం ఏమనగా విజయవాడ తాడేపల్లి లోని అంధురాలైన రాణి అనే యువతి మీద రాజు అనే కిరాచకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపబడమైనది దీనిని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖండిస్తూ రాజు అనే వానిని వెంటనే ఉరితీయాలని అందురాలైన రాణి కి ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మానసిక వికలాంగుల పైన మరియు వికలాంగుల పైన మహిళల పైన దాడులు అత్యాచారం చేసి చంపడం జరుగుతుంది మొన్న ఒంగోలు నిన్న కడప భాకరాపేట ఇప్పుడు సీఎం ఇంటి సమీపాన తాడేపల్లి లో రాణి అనే అందురాలైన మహిళ పైన అత్యాచారాలు హత్యలు జరిగినవి అలాగే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బి సుబ్బారావు రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య సంఘ సేవకులు సల్లావుద్దీన్ ఆర్ సి పి రవి శంకర్ రెడ్డి ఎం ఎస్ పి నాయకులు మాతయ్య వికలాంగుల హక్కుల పోరాట సమితి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి దాది శ్రీను మరియు నగర అధ్యక్షుడు ప్రసాద్ విద్యార్థి రాష్ట్ర నాయకులు వర్ధన్ సుబ్బరాయుడు మరియు ఎం ఆర్ పిఎస్ నాయకులు గంగులయ్య ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రెడ్డి మరియు వికలాంగులు జిల్లా కార్యదర్శి అంజి బి ఓబయ్య ఆరిపుల్ల రా చెయ్య రాజు తదితరులు వికలాంగుల పాల్గొన్నారుు.

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

జగిత్యాల జిల్లా : 

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.,

ఆర్టీసీ బస్సు.. లారీ ఢీకొని 

కండక్టర్‌ మృతి చెందగా 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు.. 

వారిని హుటాహుటిన 

జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. 

జగిత్యాల నుంచి వరంగల్‌ 

వెళుతున్న బస్సు ప్రమాదానికి గురికాగా బస్సులో 8 మంది ప్రయాణికులున్నట్లు ఆర్టీసీ 

అధికారులు తెలిపారు... 

ఈ రోజు సీఎం కేసీఆర్‌ కొండగట్టు పర్యటన ఉండగా కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం 

చోటు చేసుకుంది..

మృతి చెందిన కండక్టర్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి కు చెందిన బొల్లం సత్యం గా గుర్తింపు.

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

ఈనెల 19వ తేదీన హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించబోయే హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి బైక్ ర్యాలీని పురస్కరించుకొని ఈరోజు రామగిరి రామాలయంలో వాల్ పోస్టల్ ఆవిష్కరించడం జరిగింది.

 హిందూ వాహిని ఉమ్మడి జిల్లా ప్రముఖ్ సంగపాక రాంబాబు గారు మాట్లాడుతూ ఈ ఆదివారం 19వ తేది సాయంత్రం 4.00 గంటలకు స్థానిక రామగిరి రామాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభం అయితుందని, ఈ ర్యాలీలో సంఘ వివిధ క్షేత్ర ప్రముఖులు పెద్దలు ,కార్యకర్తలు మరియు హిందూ బంధువులందరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన రామకృష్ణ, ఉపాధ్యక్షుడు గండికోట రాజు, ఉపాధ్యక్షుడు తారల నరేష్, జిల్లా కమిటీ మెంబర్ దొండ నరేందర్, ఉపాధ్యక్షుడు పందిరి మాధు, గురు, సతీష్ ,హరి ,తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ 14వ వార్డులో మన ఊరు.. మన బడి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు

నల్లగొండ: మన ఊరు.. మన బడి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

నల్లగొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడ ప్రభుత్వ పాఠశాలలో రూ. 26 లక్షల వ్యయంతో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. వారి వెంట DMHO కొండల్ రావు, కౌన్సిలర్లు ఊట్కూరు వెంకట్ రెడ్డి, బొజ్జ శంకర్, వడ్డే సుధాకర్ రెడ్డి, వెంకన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల రద్దీ తాకిడి తగ్గట్టుగా సదుపాయాలు ఏర్పాటు చేయండి: కంచర్ల భూపాల్ రెడ్డి

నేడు నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో.. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

 ఛాయా సోమేశ్వరాలయం రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువవుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని... ముఖ్యంగా బార్కేడింగ్ సానిటరింగ్, ట్రాఫిక్ అదుపు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లపై ఎవరికి వారి బాధ్యతలు అప్పగించి నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు...

 123 కోట్ల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభం కాబోతున్న ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, పచ్చల చాయా వెంకటేశ్వర ఆలయాల అభివృద్ధి శిల్పారామం, తీగల వంతెన, లతో ఈ ప్రాంతమంతా అత్యద్భుతంగా రూపుదిద్దుకోబోతుందని.. రానున్న రోజుల్లో ఛాయా సోమేశ్వరాలయం పూర్వ వైభవం సంతరించుకొన ఉందని కంచర్ల తెలియజేశారు...

 ఈ సంవత్సరం నుండి.. పచ్చల, ఛాయా సోమేశ్వర నగరోత్సవం నిర్వహించుకోవాలని సూచించారు..

 ఇందుకు ఈనెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి రామగిరి రామాలయం నుండి ఛాయా సోమేశ్వరాలయం వరకు విధ వివిధ కళా రీతులను ప్రదర్శిస్తూ... బ్రహ్మాండంగా నగరోత్సవాన్ని నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు .. ఇందుకు అయ్యే ఖర్చు తానే స్వయంగా భరిస్తానని వారు

 తెలియచేశారు.

ఈ సమావేశంలో.. నల్గొండ ఆర్డీవో, డి.ఎస్.పి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కేవీ రమణాచారి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ ఆలయ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి.. వివిధ శాఖలకు చెందిన అధికారులు.. సింగిల్ విండో చైర్మన్ నాగరత్నం రాజు,కౌన్సిలర్లు,ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్, ఊట్కూరు వెంకటరెడ్డి,వట్టిపల్లి శ్రీనివాస్, యామా దయాకర్, పున్నా గణేష్ మారగోని గణేష్, నాయకులు.. బకరం వెంకన్న భువనగిరి దేవేందర్ సంధినేని జనార్దన్ రావు సూర మహేష్, చెన్నుగూడెం సర్పంచ్ జంగయ్య భక్తులు పాల్గొన్నారు.

సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకట లక్ష్మీ మోటార్స్ షో రూమ్ నందు హీరో జూమ్ స్కూటర్ ను విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకట లక్ష్మీ మోటార్స్ షో రూమ్ నందు హీరో జూమ్ స్కూటర్ ను విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకట లక్ష్మి మోటార్స్ నందు హీరో బైక్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన 110CC స్కూటర్,Hero XOOM మోడల్ బైక్ ను రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మార్కెట్లోకి విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ, 

ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భారతదేశాన్ని ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి మార్చడంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా సామర్థ్యంతో తెలంగాణ దేశంలోనే మొబిలిటీలో ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా అవతరించాలని సీఎం కేసీఆర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. 

హీరో కంపెనీ సరికొత్త టెక్నాలజీతో మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ 110CC స్కూటర్,Hero XOOM యువతను ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు.

ఆటోమొబైల్ రంగంలో విశేష అనుభవం ఉన్న వెంకటలక్ష్మి మోటార్స్ అధినేత రాచర్ల కమలాకర్ ఎప్పటికప్పుడు సూర్యాపేట జిల్లా ప్రజలకు నూతన మోడల్ బైక్స్ ను పరిచయం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అదే విధంగా బైక్ వినియోగదారులకు సర్వీస్ విషయంలో ఉత్తమ సేవలు అందజేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో షోరూం అధినేత రాచర్ల లక్ష్మి కమలాకర్ , మేనేజర్ సుధీర్ , షోరూమ్ ఉద్యోగస్తులు రాజు, జైపాల్, సూర్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.