వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత మహాసభ లకు తరలి వెళ్లిన జిల్లా ప్రతినిధులు
వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత మహాసభ లకు తరలి వెళ్లిన జిల్లా ప్రతినిధులు
: ఈనెల 15 నుండి 18 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా లో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుండి ప్రతినిధులు నల్గొండ రైల్వే స్టేషన్ నుండి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యురాలు దండంపల్లి సరోజ మాట్లాడుతూ ఈ మహాసభలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఐదువేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న హౌరా లో లక్షలాదిమంది వ్యవసాయ కార్మికులతో భారీ బహిరంగ సభ జరుగుతుందని ,ఈ సభకు ముఖ్యఅతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి .వెంకట్ తదితర నాయకులు హాజరవుతున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ మహాసభలలో ఉపాధి హామీ రక్షణ కోసం చేసే ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు, కంబాలపల్లి ఆనంద్ ,జటావత్ రవి నాయక్, పులుసు సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు గండమల్ల రాములు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ,జిల్లా కమిటీ సభ్యులు లంజాపెళ్లి లక్ష్మయ్య ,పులసరి వెంకట ముత్యం కెవిపిఎస్ జిల్లా నాయకులు దేవరకొండ యాదగిరి, తదితరులు తరలి వెళ్లారు.
జాతీయ మహాసభలకు తరలి వెళ్తున్న వారికి సెండ్ ఆఫ్ చెప్పిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్య బిక్షం తదితరులున్నారు.




బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారు, శ్రీ మిరియాల వెంకటేశం గారిని రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారికి అలాగే నా నియామకానికి సహకరించిన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి, రాష్ట్ర చేనేత కన్వినర్ శ్రీ ఎన్నం శివ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మరియు జిల్లా రాష్ట్ర నాయకుల అందరికి కృతజ్ఞతలుుు తెలియజేశారు. ఈ సందర్భంగాా వెంకటేశం గారుు మాట్లాడుతూ బాధ్యతగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిర్వర్తిస్తూ రాష్ట్రములో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను ఉదృతం చేస్తాననిి తెలియజేశారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ రెట్ లో సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డీ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గార్ల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ యర్ర మాద కృష్ణా రెడ్డి జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ కారుణ్ కుమార్, సైదులు గౌడ్ ,రామ కృష్ణ, యం. వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.
దేశానికి కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివి





నల్లగొండ జిల్లాలోని పెళ్లి కి హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి .రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రవంక చిన్న రామస్వామి. జిల్లా అధ్యక్షులు దుడుకు లక్మి నారాయణ . ఈ సందర్భంగా అల్లంపల్లి రామకోటి మాట్లాడుతు విందువినోదాలు,పెళ్లి మండపాలు,గుడి గోపురాలు,పూజలు పుష్కరాలు ఉద్యమావేదికలుగా మార్చుకోవాలని అప్పుడైతేనే వాదం బలపడుతుంది అన్నారుు.
Feb 14 2023, 10:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.8k