/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నక్రేకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో పాటు పాల్గొని శంకుస్థాపన చేసిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ Miryala Kiran Kumar
నక్రేకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో పాటు పాల్గొని శంకుస్థాపన చేసిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

నక్రేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలోని కొండకిందిగూడెం గ్రామంలో రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారితో కలిసి శంకుస్థాపన చేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు.

ఈ సందర్భంగా ఎంపి బడుగుల మాట్లాడుతూ..

కేసీఅర్ తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుంది.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి.

ఢిల్లీ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం..

కెసిఆర్ సారథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నాయకత్వంలోనే మీ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు.

నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు చిరుమర్తి లింగయ్య

పేద ప్రజల కోసం నకిరేకల్ లో వంద పడకల ఆసుపత్రిని సాధించిన ఘనత చిరుమర్తి లింగయ్యకే దక్కుతుంది..

కేసీఆర్ పాలనలో ప్రతీ సంక్షేమ పథకం పేద ప్రజలకు వరంలా ఉన్నాయి..

రాష్ట్రంలో ప్రతీ వర్గాన్ని ఆదుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుంది..

దేశానికి అన్నంపెట్టే రైతు అవస్థలు పడొద్దనే ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుభీమా పథకాలు ఉద్భవించాయి.

తెలంగాణలో జరుగుతున్న సంక్షేమాన్ని ఓర్వలేకే బిజెపి ప్రభుత్వానికి కండ్లమంట..

ప్రతిదాంట్లో తెలంగాణ రాష్ట్రంపై బిజెపి వివక్ష చూపుతుంది.

అనంతరం వివిధ కుటుంబాలకు చెందిన 200 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.

నల్లగొండ జిల్లాలోని పెళ్లి కి హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి

నల్లగొండ జిల్లాలోని పెళ్లి కి హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి .రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రవంక చిన్న రామస్వామి. జిల్లా అధ్యక్షులు దుడుకు లక్మి నారాయణ . ఈ సందర్భంగా అల్లంపల్లి రామకోటి మాట్లాడుతు విందువినోదాలు,పెళ్లి మండపాలు,గుడి గోపురాలు,పూజలు పుష్కరాలు ఉద్యమావేదికలుగా మార్చుకోవాలని అప్పుడైతేనే వాదం బలపడుతుంది అన్నారుు.

తదుపరి జిల్లాలోని TTD  కళ్యాణమండపంలోన మౌనిక పని నూతనదంపతులను ఆశీర్వదించారు. సమావేశములో దాసరాజు సతీష్ . సింహాద్రి జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

ఈనెల 13న జరుగు జాతీయ రహదారి దిగ్బంధం కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు.

ఈనెల 13న జరుగు జాతీయ రహదారి దిగ్బంధం కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు.

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ విజయవాడ రహదారిని దిగ్భంధం విజయవంతం చేయాలని శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు. 

ఈ కార్యక్రమంలో నకరికల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్ మాదిగ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ ఎరసాని గోపాల్ బొజ్జ చిన్న దుబ్బ రామకృష్ణ బొజ్జ దేవయ్య, మాసారం వెంకన్న, పోకల కరుణాకర్, మేడి గోవర్ధన్, బీపంగి అర్జున్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతన జీవోలు సవరించాలి, ఏప్రిల్ 5 న చలో ఢిల్లీ జయప్రదం చేయండి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్.

ప్రెస్ నోట్ 10-02-2023

73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతన జీవోలు సవరించాలి

ఏప్రిల్ 5 చలో ఢిల్లీ

    కార్మికుల పోరాట ద్వారా సాధించుకున్న చట్టాలను మార్పు చేసి తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని జరుగుతున్న ఏప్రిల్ 5 చలో ఢిల్లీ జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ డిమాండ్ చేశారు

         శుక్రవారం నల్గొండ మండలం దీపకుంట గ్రామంలో ని పద్మావతి ఫంక్షన్ హాల్ లో సిఐటియు జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది ముఖ్యఅతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ మతోన్మాద చర్యలతో కార్మిక వర్గంలో చీలికలు తెచ్చి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి బడా పారిశ్రామికవేత్తలకు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారని అన్నారు. దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలజీవోలను సవరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు వలస కార్మికుల సమస్యలపై సిఐటియు ఫిబ్రవరి నెలంతా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపారు .

     సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుండి 17 వరకు పారిశ్రామిక రంగంలో ఉన్న అన్ని కంపెనీలను రైస్ కాటన్ మిల్లులలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై సర్వేలు నిర్వహించి 18 19 సమీక్ష చేసి ప్రణాళికల రూపొందించడం జరుగుతుందని తెలిపారు వివిధ కంపెనీల దగ్గర కార్మికుల సమస్యలపై సంతకాల సేకరణ సెమినార్లు సదస్సులు నిర్వహించి మార్చి 1న కార్మిక శాఖ కార్యాలయం ముందు ఒకరోజు దీక్ష చేస్తామని తెలిపారు అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికుల సంక్షేమానికి అసంఘటిత రంగం హమాలీ ట్రాన్స్పోర్ట్ రంగాల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు కార్మిక హక్కుల కనీస వేతనాలు పని భద్రత తదితర చట్టబద్ధహక్కుల రక్షణకై సిఐటియు చేస్తున్న పోరాటాల లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

          *సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికారు మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు బి ప్రమీల, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, అవుత సైదులు, నారబోయిన శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య,కానుగు లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్ రెడ్డి, తిరుపతి రామ్మూర్తి, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, కరీమ్మునిసా, రామచంద్రం, వినోద్, దయానంద్,బాబు నాయక్, శంకర్, సైదాచారి, సుదీర్ , ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేసిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు

నల్గొండ జిల్లా నకిరేకల్ 

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు బహుజన్ సమాజ్ పార్టీ, NSUI విద్యార్థి సంఘాల నాయకులు..

నకిరేకల్ మైనార్టీ స్కూల్ ను కట్టంగూర్ కు తరలించొద్దని ఆ పాఠశాల అద్దె భవనంలో మగ్గుతోందని వెంటనే సొంత భవనం నిర్మించాలని.. డిగ్రీ.బీసీ గురుకుల.మైనార్టీ గురుకుల పాలిటెక్ని, ఐటిఐ కళాశాలను నకరేకల్ లో నిర్మించాలని సందర్భంగా డిమాండ్ చేశారు బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని... లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ లోని విద్యారంగా సమస్యలు ఏం పరిష్కరించిండు నకిరేకల్. ఏం డెవలప్ చేసిండు కనిపించట్లేవా అని ప్రశ్నించారు.. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

కోట్ల రూపాయల భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులు

కోట్ల రూపాయల భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులు

హెచ్చరిక బోర్డులు తోలగిస్తే కేసులు నమోదు చేస్తాం !

అనుకున్నదోక్కటి అయినదోక్కటి

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న భూ రాజకీయ పరిణామాల కు 

రెవెన్యూ అధికారులు చెక్ పెట్టారు. ఎకంగా సుమారు కోటి రూపాయల విలువ గల ప్రభుత్వ భూమిని కాపాడారు . 

సాక్షి ,ఈనాడు కధనాలకు స్పందించిన మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ 

శుక్రవారం రోజున రెచిని రైల్వే స్టేషన్,హైవే పక్కన ఉన్న 612 సర్వే నంబర్ లోని ప్రభుత్వ స్ధలాన్ని పరిశీలించారు.

అనంతరం తహశీల్దార్ కవిత ,ఆర్ ఐ ఎజాజోద్దిన్ ,తాండూర్ ఈఓ తపాస్ లను వివరాలు అడిగి రికార్డు లను పరిశీలించి ఫోల్స్ ,నిర్మాణాలను నోటిస్ ఇచ్చి క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అక్కడున్న ఫోల్స్ తోలగించి ట్రాక్టర్ లో రెవెన్యూ కార్యాలయానికి ఫోల్స్ తరలించి హెచ్చరిక బోర్డు ఎర్పాటు చేశారు. బోర్డు తోలగిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్కడయినా ప్రభుత్వం ఇండ్ల స్ధలం ఎవరికి ఇచ్చిన కాల వ్యవధి ఉంటుందని ఆ కాల వ్యవధి లోపు నిర్మాణం చేపట్టక పోతే తిరిగి ఆ యోక్క భూములను స్వాధీనం చేసుకునే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంటుంది .ప్రభుత్వ భూములకు ఈ నాయకుల

 కోట్లాట చూసి మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Breaking:- ఫిబ్రవరి 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్ధుకు సంబందించి నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి కె.సి.ఆర్.!

Breaking:- ఫిబ్రవరి 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్ధుకు సంబందించి నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి కె.సి.ఆర్.!

ముందస్తు ఎన్నికలకు వెళ్ళే యోచనలో సిఎం కె.సి.ఆర్.. ఈ నెల 12వ తేదీ కల్లా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముగించుకొని,ఈ నెల 18వ తేదీన కొత్త సచివాలయ భవనాన్ని లాంచనంగా ప్రారంభించబోతున్నారు. అనంతరం ముందస్తు ఎన్నికల ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి:ప్రియదర్శిని మేడి

మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి

 - ప్రియదర్శిని మేడి

నకిరేకల్ పట్టణ కేంద్రంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా అందుబాటులో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ ను తరలించడం ప్రభుత్వ అసమర్థ చర్య అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపల్ మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి స్వలాభం కోసం స్కూలు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయి అధికారులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకొని పాఠశాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రియదర్శిని మేడి జిల్లా స్థాయి అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించగా హాస్టల్ ని ఎక్కడికి మార్చడం లేదని చెప్పడం గమనార్హం. పార్టీ మారానని చెప్పుకునే ఎమ్మెల్యే సిసి రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపనలకు, దళిత బంధు ఆశ చూపే పనికి మాత్రమే పరిమితమయ్యారన్నారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రభుత్వ హాస్టల్ ను ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల ఎమ్మెల్యే స్పందించకపోవడం ఆయనకు పేద విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి సొంత భవనాలు నిర్మించలేని అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకుడు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత,నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్,విద్యార్థి సంఘం నాయకులు అంజన్ కుమార్ యాదవ్,జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 13న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయండి.

ఈనెల 13న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయండి.

-బకరం శ్రీనివాస్ మాదిగ. 

కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాన మంత్రి మోదీ హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు వర్గీకరణ జరగలేదు. ప్రధాని ఈనెల 13న హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా.. వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని ఎంఎస్పి నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి శంకర్ మాదిగ డిమాండ్ చేశారు.

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.... 

ఫిబ్రవరి 13న హైదరాబాద్-విజయవాడ రహదారిని దిగ్బంధం చేస్తున్నామని వారు గురువారం చిట్యాల మండల కేంద్రంలోని చౌరస్తాలో వాల్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడారు. 

వర్గీకరణ చేయకపోవడంతో ఎస్సీలు విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. 

బీజేపీ మాదిగలకు ప్రత్యక్ష పోరాటం తప్పదన్నారు. వర్గీకరణ అంశం తేల్చకుండా బీజేపీ నేతలు ఎవరు వచ్చినా ఎమ్మార్పీఎస్ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు ఈనెల 13న రానున్న ప్రధాన మంత్రి మోడీకి మాదిగల నిరసన సెగలు తగలాలన్నారు. అనంతరం. హైదరాబాద్- విజయవాడ రహదారి దిగ్భంధానికి సంబంధించి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. 

--------------------------------------------------

ఈ సమావేశంలో ఏరసాని గోపాల్, నోముల పురుషోత్తం, బొజ్జ చిన్న ముదిగొండ వెంకటేశ్వర్లు, ఎరసాని సోమయ్య, పెరిక లింగస్వామి, పోకల అశోక్, పోకల యేసు తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్మన్:

నల్గొండ పట్టణంలో విహహ శుభకార్యాలకు హాజరతూ అటుగా వెళ్తున్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి గారు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఆకస్మాత్తుగా కింద పడటం చూసి హుటా హుటిన దగ్గరికి వెళ్లి గాయపడ్డ వ్యక్తికి తీవ్రమైన రక్త స్రావం జరుగుతుండడంతో 108 అంబులెన్స్ కి కాల్ చేసి జిల్లా ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మాట్లాడి అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. అంబులెన్స్ రావటానికి ముందే వెంటనే అటుగా వెళ్తున్న ఆటో లో గాయపడిన వ్యక్తిని తరలించడం జరిగింది..