73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతన జీవోలు సవరించాలి, ఏప్రిల్ 5 న చలో ఢిల్లీ జయప్రదం చేయండి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్.
ప్రెస్ నోట్ 10-02-2023
73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతన జీవోలు సవరించాలి
ఏప్రిల్ 5 చలో ఢిల్లీ
కార్మికుల పోరాట ద్వారా సాధించుకున్న చట్టాలను మార్పు చేసి తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని జరుగుతున్న ఏప్రిల్ 5 చలో ఢిల్లీ జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ డిమాండ్ చేశారు
శుక్రవారం నల్గొండ మండలం దీపకుంట గ్రామంలో ని పద్మావతి ఫంక్షన్ హాల్ లో సిఐటియు జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది ముఖ్యఅతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ మతోన్మాద చర్యలతో కార్మిక వర్గంలో చీలికలు తెచ్చి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి బడా పారిశ్రామికవేత్తలకు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారని అన్నారు. దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలజీవోలను సవరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు వలస కార్మికుల సమస్యలపై సిఐటియు ఫిబ్రవరి నెలంతా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపారు .
సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుండి 17 వరకు పారిశ్రామిక రంగంలో ఉన్న అన్ని కంపెనీలను రైస్ కాటన్ మిల్లులలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై సర్వేలు నిర్వహించి 18 19 సమీక్ష చేసి ప్రణాళికల రూపొందించడం జరుగుతుందని తెలిపారు వివిధ కంపెనీల దగ్గర కార్మికుల సమస్యలపై సంతకాల సేకరణ సెమినార్లు సదస్సులు నిర్వహించి మార్చి 1న కార్మిక శాఖ కార్యాలయం ముందు ఒకరోజు దీక్ష చేస్తామని తెలిపారు అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికుల సంక్షేమానికి అసంఘటిత రంగం హమాలీ ట్రాన్స్పోర్ట్ రంగాల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు కార్మిక హక్కుల కనీస వేతనాలు పని భద్రత తదితర చట్టబద్ధహక్కుల రక్షణకై సిఐటియు చేస్తున్న పోరాటాల లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు
*సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికారు మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు బి ప్రమీల, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, అవుత సైదులు, నారబోయిన శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య,కానుగు లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్ రెడ్డి, తిరుపతి రామ్మూర్తి, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, కరీమ్మునిసా, రామచంద్రం, వినోద్, దయానంద్,బాబు నాయక్, శంకర్, సైదాచారి, సుదీర్ , ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
Feb 12 2023, 15:40