/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి Raghu ram reddy
కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రం బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ వెళ్లనున్నారు.

కర్ణాటక (Karnataka) రాష్ట్రం బెలగావి (Belagavi)కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లనున్నారు. ఇవాళ(గురువారం) ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరనున్నారు. బెలగావిలో రెండ్రోజులపాటు సీడబ్ల్యూసీ (CWC) సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో సీఎం పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్ రెడ్డి వెళ్లనున్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెలగావికి చేరుకోనున్నారు.

మహాత్మాగాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 26, 27 తేదీల్లో ప్రత్యేక సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. బెలగావిలోనే గాంధీజీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అందుకే అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు "నవ సత్యాగ్రహ భైఠక్‌" అని కాంగ్రెస్ అధిష్ఠానం నామకరణం చేసింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు సహా దాదాపు 200 మంది కీలక నేతలకు ఆహ్వానం పంపింది. ఈ మేరకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున వెళ్లనున్నారు.

అయితే బెలగావికి వెళ్లడానికి ముందే టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు సమావేశం నిర్వహించనున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత టాలీవుడ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు పెట్టేందుకు నిర్ణయించింది. ప్రీమియర్, బెనిఫిట్ షోలు వంటివి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశం కానున్నారు. హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, శివబాలాజీ.. దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ.. నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలవనున్నట్లు తెలుస్తోంది.

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు పోలీ్‌సస్టేషన్‌ ఎస్సై సాయికుమార్‌ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు.

కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు పోలీ్‌సస్టేషన్‌ ఎస్సై సాయికుమార్‌ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు. అదే సమయంలో బీబీపేట పోలీ్‌సస్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ శృతి, అదే గ్రామానికి చెందిన నిఖిల్‌ అనే వ్యక్తి కూడా అదృశ్యం కాగా.. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే అదే చెరువు వద్ద ఎస్సైకి చెందిన కారు, చెప్పులు లభ్యం కావడంతో ఆయన కూడా చెరువులో దూకారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం డ్యూటీ అయిపోయాక రాత్రి అయినా శృతి ఇంటికి రాకపోవడంతో.. ఆమె తల్లి తాడ్వాయిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి స్నేహితురాలికి ఫోన్‌ చేశారు. తన కూతురు ఇంకా ఇంటికి రాలేదని ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వస్తుందని తెలిపారు.

ఆమె సూచన మేరకు విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శృతి ఫోన్‌ను ట్రేస్‌ చేశారు. 44వ జాతీయ రహదారి పక్కన గల అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఫోన్‌ సిగ్నల్స్‌ ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు అక్కడి వెళ్లి చూడగా శృతి ఫోన్‌తోపాటు భిక్కనూరు ఎస్సై కారు, చెప్పులు, అలాగే బీబీపేటకు చెందిన నిఖిల్‌ అనే వ్యక్తి చెప్పులు, ఫోన్‌ కూడా కనిపించాయి. దీంతో ఎస్సై సాయికుమార్‌కు ఫోన్‌ చేయగా.. స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. పోలీసులు వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. ఎస్పీ సింధు శర్మ.. సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చీకట్లోనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. కానిస్టేబుల్‌ శృతి, నిఖిల్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. ఇంతకీ చెరువు వద్దకు వీరు ఎందుకు వెళ్లారు? ఇద్దరి మృతదేహాలు చెరువులో ఎందుకున్నాయన్నది మిస్టరీగా మారింది.

ఎస్సై సాయికుమార్‌కు కానిస్టేబుల్‌ శృతితో గతంలోనే పరిచయం ఉంది. సాయికుమార్‌ రెండేళ్ల క్రితం బీబీపేట ఎస్సైగా పని చేసిన సమయంలో శృతి అక్కడే పనిచేసేవారు. ఆమెకు అప్పటికే వివాహమై.. భర్తతో విడాకులు కూడా అయ్యాయి. దీంతో సాయికుమార్‌, శృతి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందన్న ఆరోపణలున్నాయి. వీరి మధ్య బీబీపేట సింగిల్‌ విండో సొసైటీలో ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్‌ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత సాయికుమార్‌ భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలిసింది.

రేవంత్ కు చిరంజీవి ఫోన్ భేటీకి దూరం

రేవంత్ తో టాలీవుడ్ భేటీ ఆసక్తిని పెంచుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సంక్రాంతి సినిమా ల భవిష్యత్ రేవంత్ నిర్ణయం పై ఆధారపడి ఉంది. సంధ్యా థియేటర్ ఘటనతో పాటుగా సినీ పరిశ్రమ సమస్యల పైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు సమావేశం జరిగే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉన్నారు. దీంతో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

సీఎం రేవంత్ తో సమావేశానికి సర్వం సిద్దమైంది. సినీ ప్రముఖులు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, దిల్ రాజు, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, శివ బాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కిరణ్ అబ్బవరం, ఎలమంచిలి రవి, నాగార్జున ఇప్పటికే సమావేశం కోసం వచ్చారు. కాగా, ఈ సమావేశం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన చిరంజీవి మాత్రం రాలేదు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ హాజరయ్యారు. అల్లు అరవింద్ దిల్ రాజు ఈ టీం ను లీడ్ చేస్తున్నారు. అయితే చిరంజీవి గైర్హాజరు వెనుక పలు కారణాల పైన చర్చ జరుగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని ఏర్పాటు చేయించిన మెగాస్టార్ చిరంజీవి ఈ సమావే శానికి హాజరు కావడం లేదు. అయితే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన మాట్లాడారని తెలు స్తోంది. రేవంత్ తో భేటీ అయ్యే టీం ను డిసైడ్ చేయటంలో చిరంజీవి కీలక పాత్ర పోషించారు. చిరు సూచన మేరకు సినిమా ఇండస్ట్రీలోని అన్ని విభాగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ఇక, హీరో నాగార్జున ఈ భేటీలో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అయితే, అల్లు అర్జున్ వివాదంలో మెగా హీరోల ప్రతీ అడుగు చర్చగానే నిలిచింది. అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత చిరంజీవి, నాగబాబు ఇద్దరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. జైలు నుంచి వచ్చిన తరువాత అదే విధంగా అల్లు అర్జున్ వారిద్దరి ఇళ్లకు వెళ్లారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాత్రం తొలి నుంచి ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. అయితే ఈ సంక్రాంతికి రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సైతం విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫట్ షోలు.. టికెట్ ధరల పెంపు పైన నిర్ణయం వెనక్కు తీసుకోకుంటే నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. దీంతో, రేవంత్ ను ఒప్పించి.. ఆ నిర్ణయంలో సడలింపు కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భేటీ ఏర్పాటు చేసారు. అయితే, ఈ భేటీ ఏర్పాటుకు తొలి నుంచి పూర్తి ప్రయత్నాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని తెలుస్తుంది. అయితే, రేవంత్ తో ఫోన్ లో మాట్లాడిన సమయంలోనే కీలక అంశాలను ప్రస్తావన చేసినట్లు సమాచారం.

అమరావతిలో మరో కార్యక్రమానికి శ్రీకారం జనవరి నుంచి పనులు ప్రారంభం

రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి సర్కార్‌ తిరిగి జీవం పోస్తుంది. వైఎస్సార్సీపీ సర్కార్‌ కక్షపూరిత ధోరణితో పునాదుల దశలోనే నిలిచిపోయిన ఐకానిక్‌ భవనాల పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్‌ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు అమరావతి ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌ ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

రాజధాని అమరావతి పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే సీఆర్డీఏ భవనం పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. ఇప్పుడు ఐకానిక్‌ భవనాల నిర్మాణంపై దృష్టి సారించింది. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగమైన జీఏడీ టవర్స్‌, హెచ్ఓడీ టవర్స్‌, హైకోర్టు, అసెంబ్లీ భవనాల ర్యాప్ట్‌ ఫౌండేషన్లు గతంలోనే పూర్తయ్యాయి. అయితే గత ఐదేళ్లుగా వీటిని జగన్‌ సర్కార్‌ గాలికొదిలేయడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకాన్ని తలపిస్తోంది.

దీంతో వీటి పటిష్ఠతపై ఇప్పటికే మద్రాస్‌, హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఫౌండేషన్‌కి ఎటువంటి ఢోకా లేదని తేల్చింది. దీంతో ఫౌండేషన్‌ వద్ద నీటిని తోడేస్తున్నారు. రెండు ట్రాక్టర్‌లకు భారీ మోటార్లు బిగించి పైప్‌లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి తరలిస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణా నదిలోకి పంపిస్తున్నారు.

జీఏడీ టవర్స్‌ బేస్‌మెంట్‌, గ్రౌండ్‌తో పాటు 47 అంతస్థులు, టెర్రస్‌, హెలీప్యాడ్‌తో సహా నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఓడీ టవర్స్‌ బేస్‌మెంట్‌, గ్రౌండ్‌, 39 అంతస్థులు, టెర్రస్‌లతో నిర్మించనున్నారు. అసెంబ్లీ భవనం 250 మీటర్ల టవర్‌ ఎత్తుతో 103 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించారు. హైకోర్టు నిర్మాణంలో బేస్‌మెంట్‌, గ్రౌండ్‌, 7 అంతస్థులతో 55 మీటర్లు ఎత్తు ఉండేలా నిర్మించనున్నారు. ఇప్పటికే వీటన్నింటికీ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పూర్తికాగా, జనవరి నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుని ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై ఎన్హెచ్ఏఐ, ఆర్ అండ్‌ బీ, సీఆర్డీఏ అధికారులతో సమీక్షించిన సీఎం పలు మార్పులు సూచించారు. ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌కి సీఆర్డీఏ ఇప్పటికే ఎన్ఓసీ జారీ చేసింది. ఆర్ అండ్‌ బీ శాఖ కూడా ఎన్ఓసీ జారీ చేస్తే, ఆ ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.అలైన్‌మెంట్‌ ఖరారైతే భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నాయి. మరోవైపు ఓఆర్ఆర్ నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఓఆర్ఆర్ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీనిని ఏడు జాతీయ రహదారులతో అనుసంధానించనున్నారు. అనంతపురం జిల్లా కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు.

27న విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసన జయప్రదం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి

కూటమి సర్కార్ విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27న తలపెట్టిన ర్యాలీలు, వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేయడం దుర్మార్గమన్నారు. పెంచిన చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించి వినతి పత్రాలను సమర్పించాలన్నారు. అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. 

రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ పోరుబాట పోస్టర్ల ఆవిష్కరణలు నిర్వహించారన్నారు. వైసీపీ చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోందని సజ్జల అన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. 

విద్యుత్ చార్జీల పెంపు భారం అన్ని వర్గాలపై పడుతోందన్నారు. దీంతో ఆయా వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. వీరంతా వైసీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ క్రమంలో ప్రజా సంఘాలు, సంస్థలను కలుపుకుని నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

మోదీ యోగిపై కుంభమేళాలో దాడి చేస్తాం: పన్నూ

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇందుకుతన ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే) కుంభమేళా సందర్భంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్నాడు.

నకిలీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సిక్కు యువతను చంపినట్టు ఆ వీడియోలో పన్నూ ఆరోపించాడు. చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు హామీ ఇచ్చాడు. కుంభమేళాలలో భాగంగా షాహి స్నానాలకు శుభప్రదమైన జనవరి 14, 29, ఫిబ్రవరి 3వ తేదీల్లో దాడులు చేయనున్నట్టు చెప్పాడు. ఆ రోజుల్లో ప్రధాని మోదీ, సీఎం యోగిలు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారని నొక్కిచెప్పాడు.

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు...సాయంత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై ప్రధానితో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

రాజధాని అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారు. దీనిని వేగవంతం చేయాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందించడంతోపాటు వరద సెస్‌కు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చేపట్టే నూతన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. దాదాపు గంటకు పైగా ప్రధానితో చంద్రబాబు భేటీ అయ్యారు. మరోవైపు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో బుధవారం ఉదయం ఎన్డీయే నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్‌లో చేలరేగిన దుమారం, పలు రాజకీయ అంశాలపై ఎన్డీయే నేతలు ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. వాజ్‌పేయ్ శత జయంతి వేళ సుపరిపాలన అంశాలపై సమాలోచనలు జరిపారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును జేపీసీకి పంపించడంతో..ఆ అంశంపై చర్చించినట్టు తెలిసింది. మిత్రపక్షాల మధ్య సమన్వయం, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించారు.

ఎన్డీయే సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. ఆ తర్వాత నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చించారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ను కలిసిన సీఎం చంద్రబాబు... రైల్వే జోన్‌ సహా, వివిధ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

శ్రీతేజ్‌ కోసం వేణు స్వామి సంచలన నిర్ణయం

అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

శ్రీతేజ్‌ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. కొద్దిసేపటి కిందటే ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ బాలుడి తండ్రి భాస్కర్‌తో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. శ్రీతేజ్‌కు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లు, అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వేణు స్వామి విలేకరులతో మాట్లాడారు. ఆ బాలుడి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తంతో కూడిన చెక్‌ను భాస్కర్‌కు ఇచ్చారు. భాస్కర్ కుమార్తె కోసం ఈ మొత్తాన్ని ఇచ్చానని వివరించారు. 1,000 సినిమాల వరకు తాను ముహూర్తాలను పెట్టానని, సినిమా సొమ్మును తిన్నానని, అందుకే ఆ మొత్తంలో కొంత భాస్కర్‌కు ఇచ్చానని పేర్కొన్నారు.

శ్రీతేజ్ ఆరోగ్యం గురించి విలేకరులు ప్రశ్నించగా.. 90 శాతం వరకు మెరుగుపడిందని అన్నారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే చికిత్స తీసుకుంటోన్నాడని చెప్పారు. శ్రీతేజ్ మృత్యువు బారిన పడకుండా తనవంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు వేణు స్వామి తెలిపారు. అపమృత్యు దోషం తొలగిపోవడం కోసం మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని చెప్పారు.

శ్రీతేజ్ కోసం ఏం చెస్తే బాగుంటుందని తాను కొంతమందితో మాట్లాడానని మృత్యుంజయ హోమం చేయాలని కొందరు సలహా ఇస్తోన్నారని అన్నారు. తన సొంత ఖర్చుతో మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని, ఈ విషయాన్ని శ్రీతేజ్ తండ్రికి కూడా తెలియజేశానని వేణు స్వామి చెప్పారు.

తెలంగాణను ఫాలో అవ్వండి చంద్రబాబుకు సీపీఐ లీడర్ లేఖ

రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ రేట్ల పెంపు లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తారనే కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ.. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. అయితే సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్న రామకృష్ణ.. తెలంగాణ మాదిరిగానే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబును కోరారు.

నూతన సంవత్సరం సమీపిస్తోంది. ఆ వెంటనే ఓ పదిరోజులకే సంక్రాంతి పండుగ రానుంది. ఇక పెద్ద పండుగ అంటే హడావిడి మామూలుగా ఉండదుగా. కోళ్లపందేలు, సంక్రాంతి సంబరాలు ఒకెత్తయితే.. సినిమాల కోలాహలం మరో ఎత్తు. సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటే.. ఆ మూడు రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలకానున్నాయి. సంక్రాంతి సెలవులు కావటంతో థియేటర్ల వద్ద కోలాహలం ఏర్పడనుంది. దీంతో సంక్రాంతి పండుగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు సినిమా నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపుతో ఆరంభంలోనే కలెక్షన్లు రాబట్టుకోవాలని ప్రయత్ని్స్తుంటారు. అయితే పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వొద్దంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది.

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఈ మేరకు.. సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకుండా ఆదేశించాలని సీఎం నారా చంద్రబాబునాయుడును రామకృష్ణ కోరారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇస్తారనే ధైర్యంతో నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నాయని.. ఆ తర్వాత ప్రేక్షకుల జేబుల నుంచి కొల్లగొడుతున్నారంటూ రామకృష్ణ ఆరోపించారు. సినీ ఇండస్ట్రీ ఒత్తిడికి తలొగ్గి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు..టికెట్ల ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ రకంగా దేశంలో ఎక్కడా లేదని రామకృష్ణ విమర్శించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మేల్కొందన్న సీపీఐ రామకృష్ణ.. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అభినందనీయమని లేఖలో ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని ప్రకటించాలని సీఎం నారా చంద్రబాబునాయుడిని రామకృష్ణ కోరారు. ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మరి ఈ విజ్ఞప్తి ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేదీ చూడాలి.

మెదక్ చర్చితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్

వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.

క్రిస్మస్ పర్వదాన్ని పురస్కరించుకుని మెదక్ సీఎస్‌ఐ చర్చ్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి వస్తానని ఆనాడు మాట ఇచ్చానని గుర్తుచేసుకున్నారు.

శతాబ్ది ఉత్సవాలు, భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలనే ఇక్కడకు వచ్చానని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని.. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో దళితులు, గిరిజనులకు మేలు జరుగుతోందన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పాల్గొన్నారు.

మెదక్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు వన దుర్గాదేవిని దర్శించుకున్నారు.

ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మెదక్ చేరుకున్న సీఎం రేవంత్.. అక్కడ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ చర్చికి చేరుకున్నారు. అక్కడ చర్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆపై అక్కడ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.