/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz సీఎం కప్ హాకీ జట్టు ఎంపిక పోటీలు ప్రారంభం Mane Praveen
సీఎం కప్ హాకీ జట్టు ఎంపిక పోటీలు ప్రారంభం
నల్లగొండ: సీఎం కప్ లో భాగంగా ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలను, శనివారం టిపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల అభ్యున్నతి కొరకే రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు.ప్రతి పాఠశాలకు క్రీడా పరికరాలకు,క్రీడా బడ్జెట్ విడుదలకు కృషి చేస్తామన్నారు. హౌసింగ్ శాఖ పిడి రాజకుమార్, DYSO నర్సిరెడ్డి, SGF కార్యదర్శి దగ్గుపాటి విమల, హాకీ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మ పాల గిరిబాబు, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పుల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు మెర్సీ ప్రభావతి, రవీందర్, శ్రీనివాస్, కవిత,బాలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: గణితం తో లాజికల్ థింకింగ్ అభివృద్ధి
నల్లగొండ: గణితం తో లాజికల్ థింకింగ్ అభివృద్ధి చెందుతుందని ఎం.జి యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగాధిపతి డా. పసుపుల మద్దిలేటి అన్నారు. శనివారం ఎన్జీ కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, గణితశాస్త్ర మేధావి రామానుజన్ జన్మదినం సందర్బంగా జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మద్దిలేటి మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు  గణితశాస్త్రం యెడల మక్కువను పెంచుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు.

శ్రీనివాస రామానుజన్  అనేక కష్టనష్టాలకు  ఓర్చి ఆనాటి పరిస్థితులను ఎదుర్కొని  పంచవ్యాప్తంగా ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులుగా పేరుపొందారని వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా  వృద్ధిలోకి రావాలని సూచించారు.

కార్యక్రమంలో  స్వయంగా గణిత అధ్యాపకులైన  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ పాల్గొని పుస్తక పఠనం ద్వారా గణిత శాస్త్రాన్ని లోతుగా అభ్యసించాలని తెలియజేశారు. పరీక్ష సమయంలోనే కాకుండా ప్రతి నిత్యము అభ్యసనం చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి స్థానాన్ని పొంది మంచి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవచ్చని తెలియజేశారు.

కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి బత్తిని నాగరాజు, IQAC కోఆర్డినేటర్ వైవిఆర్ ప్రసన్న కుమార్, గణితశాస్త్ర విభాగం ఇంచార్జీ అధ్యక్షులు ఎం. వెంకట్ రెడ్డి, అధ్యాపకులు డి. మధుకర్, సి.కె. రజని, కె. కనకయ్య, మహేష్, విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: ధర్మ సమాజ్ పార్టీ దీక్ష కు కేవీపీయస్ మద్దతు
నల్లగొండ: నిరుపేదలకు భూమి,ఇండ్లు, విద్యా, వైద్యం, ఉపాధి కొరకు నల్గొండలో ఆమరణ నిరహార దీక్షకు దిగిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తలారి రాంబాబు, శ్రీను లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. శనివారం పట్టణంలోని పూలే విగ్రహం ముందు జరుగుతున్న 2వ రోజు దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడుతూ.. పాలకులు మారిన ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. విద్యా, వైద్యం కార్పొరేట్ పెద్దల చేతుల్లోకి పోవడం వలన విద్య అందని ద్రాక్షలా మారిపోయిందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు పేదలను దోచుకుంటున్నాయని, ప్రభుత్వ దవఖానాలలో మందులు, వసతుల కొరత తీవ్రంగా ఉందని, బడ్జెట్ కేటాయించి మెరుగయిన వైద్యం అందించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో కేవీపీస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్, వెంకటేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
నల్లగొండ: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, శుక్రవారం పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా  రూ. 2 లక్షల నగదు బహుమతి
నల్లగొండ: కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ  ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా గెలిచిన జట్టుకు శుక్రవారం, కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ట్రోపీ ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

అదేవిధంగా రన్నర్ గా నిలిచిన జట్టుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరుపున లక్ష రూపాయల నగదు మరియు ట్రోపీ ని అందజేశారు.

పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయాలని వినతి పత్రం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయాలని, స్థానిక తహసిల్దార్  కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు, తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

ఈ మేరకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన  హామీ ప్రకారం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వికలాంగుల వృద్ధాప్య, వితంతు, చేనేత గీత కార్మికుల పెన్షన్లు ఇవ్వాలని అన్నారు.

గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించాలని అన్నారు. భూమిలేని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీ చేయాలని  ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ప్రజా పాలనలో ఏ విధంగానైతే ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారో, అదేవిధంగా పేదలను గుర్తించి, భూమిలేని నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు కొట్టం యాదయ్య, నీలకంఠం రాములు, దామెర లక్ష్మి, రామలింగాచారి, చింతపల్లి యాదయ్య, మాడుగుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో ఇద్దరిపై దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
బ్రేకింగ్: నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ చర్చ్ దగ్గర్లో, ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. మద్యం మత్తులో.. టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిపై  లారీ దూసుకెళ్లింది.

గణేష్ అనే యువకుడు మృతి, ఇంకొక మహిళా సురక్షితం. ప్రమాదానికి గురి అయిన వారు నల్లగొండ వీటి కాలనీ వాసులుగా గుర్తింపు.లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
నారాయణపురం మండలం, సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్  వెంకటేశం సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సర్వేలు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశం పర్యవేక్షణ లోపం ఉండడం వలన  ఆయన పై చర్యలు చేపట్టారు.

బుధవారం 8 వ తరగతి బాలుడిని వంట పనులకు వినియోగించుకున్న క్రమంలో బాలుడి  పై వేడి రాగి జావ కాళ్ల మీద పడి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.

గురువారం విషయం తెలుసుకున్న  ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ధర్నా
NLG: నారాయణపురం మండలం, సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సర్వేల్ గురుకుల పాఠశాల ముందు గురువారం ధర్నా నిర్వహించారు.

కాగా ప్రమాదవశాత్తు బుధవారం సర్వేలు గురుకుల పాఠశాల విద్యార్థి కాళ్ళ మీద రాగి జావ పడి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే.
అందుబాటులోకి ఇందిరమ్మ ఇండ్ల.. ట్రోల్ ఫ్రీ నెంబర్: జిల్లా కలెక్టర్
NLG: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-4251-442కు ఫోన్ చేయాలని, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు, అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సర్వే టీమ్ లను కలెక్టర్ ఆదేశించారు.