/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి Mane Praveen
NLG: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

నల్గొండ జిల్లా, దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. 4వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో, 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌ కు అనుసంధానించే కార్యక్రమాన్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు.

కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు,, ఎంపీలు రఘువీర్ రెడ్డి , చామల కిరణ్ కుమార్ రెడ్డి లతో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా: నేడు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి,  మంత్రులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ తల్లికి పూలు సమర్పించారు.
NLG: సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనం
నల్లగొండ: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభ సందర్భంగా, నల్లగొండకు వచ్చిన నేపథ్యంలో.. సాయంత్రం ఎస్ ఎల్ బి సి మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు, వివిధ గ్రామాల నుండి మండలాల నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులలో, ఇతర ప్రైవేటు వాహనాల్లో జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు.
NLG: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన చింతల హనుమాన్
నల్లగొండ:
డిసెంబర్ 7 -13 వ తేదీ వరకు హర్యానాలో జరగబోయే 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ -19  జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు నల్గొండ జిల్లా చత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ కు చెందిన చింతల హనుమాన్ సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

నవంబర్ నెలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రాచమల్ల పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడని తెలిపారు.

చింతల హనుమాన్ 2023 సంవత్సరంలో సబ్ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో కూడా పాల్గొన్నాడని, ప్రస్తుతం హాలియా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో CEC 2వ సంవత్సరం చదువుతున్నాడు.

సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు పల్లెబోయిన సత్యనారాయణ సహకారంతో 2019 సంవత్సరంలో  చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో  చేరి కబడ్డీ క్రీడలో నిరంతరం తర్ఫీదు పొంది పలు జిల్లాల్లో, రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడని తెలియజేశారు. ఈ సందర్భంగా  స్పోర్ట్స్ ఫౌండేషన్ పక్షాన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుంభం రామ్ రెడ్డి కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కప్ క్రీడలను విజయవంతం చేద్దాం: బొమ్మపాల గిరిబాబు

NLG: గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను వెలికి తీయాలనే గొప్ప సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ క్రీడోత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్రమంలో, ఈరోజు నుండి 21వ తేదీ వరకు జరిగే గ్రామ, మండల, జిల్లా స్థాయి క్రీడోత్సవాలలో గ్రామీణ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ క్రీడా పండుగను విజయవంతం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి మరియు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు పిలుపునిచ్చారు.

యువతి యువకులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంస్థలు ఈ స్పోర్ట్స్ మీట్ కు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన పంచాయతీ కార్యదర్శి
సంగారెడ్డి జిల్లా: బ్యాంక్ లో రుణం పొందడం కోసం ఫిర్యాదుదారునికి నోడ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.15,000/- లంచం తీసుకుంటూ.. శుక్రవారం మహదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
TG: ఎస్‌డీఆర్ఎఫ్ లోగో ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
HYD: విపత్తు సమయాల్లో సుశిక్షితులైన బృందాలు తక్షణం రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా కొత్తరూపు సంతరించుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  విభాగాన్ని సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీలుగా ఆ విభాగానికి కొత్తగా సమకూర్చిన వాహనాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులను ఎదుర్కొనడానికి ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ను సిద్దం చేశారు.

నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ కోసం కొనుగోలు చేసిన అగ్నిమాపక, అత్యవసర అధునాతన వాహనాలను ప్రారంభించారు. ఈ దళానికి పలు పడవలను కూడా సమకూర్చగా. హుస్సేన్‌సాగర్‌ లో ఆ బోట్ల ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అనంతరం హోం శాఖ నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఎస్‌డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
TG: ఎస్‌డీఆర్ఎఫ్ లోగో ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
HYD: విపత్తు సమయాల్లో సుశిక్షితులైన బృందాలు తక్షణం రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా కొత్త రూపు సంతరించుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  విభాగాన్ని సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీలుగా ఆ విభాగానికి కొత్తగా సమకూర్చిన వాహనాలకు,  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులను ఎదుర్కొనడానికి ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ను సిద్దం చేశారు.నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ కోసం కొనుగోలు చేసిన అగ్నిమాపక, అత్యవసర అధునాతన వాహనాలను ప్రారంభించారు. ఈ దళానికి పలు పడవలను కూడా సమకూర్చగా.. హుస్సేన్‌సాగర్‌ లో ఆ బోట్ల ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అనంతరం హోం శాఖ నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఎస్‌డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 68 వ వర్ధంతి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: నేడు బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం  అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారత దేశానికి మహనీయుడు అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దాచేపల్లి నర్సింహా, యువమోర్చ మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్, వడ్లకొండ మల్లయ్య, పొలగోని శ్రీకాంత్ గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
TG: సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన యూపీ ఉపముఖ్యమంత్రి
HYD: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య,  ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ మేరకు 2025 జనవరి లో ప్రారంభం కాబోయే మహా కుంభమేళాలో పాల్గొనాల్సిందిగా సిఎం ను వారు ఆహ్వానించారు.