/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మూసీలో రసాయన వ్యర్థాలుముగ్గురిపై కేసు నమోదు Raghu ram reddy
మూసీలో రసాయన వ్యర్థాలుముగ్గురిపై కేసు నమోదు

హైదర్‌గూడ(Bapughat - Hyderguda) సంగమం వద్ద మూసీలోకి రసాయన వ్యర్థాలను వదిలిన ముగ్గురిపై రాజేంద్రనగర్‌ పోలీసులు(Rajendranagar Police) కేసు నమోదు చేశారు. ఆ స్థలం లీజుకు తీసుకుని నడుపుతున్న చంద్రశేఖర్‌, కెమికల్‌ ట్యాంకర్‌ యజమాని వెంకటేశ్‌, డ్రైవర్‌ దేవదాసుపై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ భానుమతి(Rajendranagar SI Bhanumathi) తెలిపారు.

బాపూఘాట్‌ - హైదర్‌గూడ(Bapughat - Hyderguda) సంగమం వద్ద మూసీలోకి రసాయన వ్యర్థాలను వదిలిన ముగ్గురిపై రాజేంద్రనగర్‌ పోలీసులు(Rajendranagar Police) కేసు నమోదు చేశారు. ఆ స్థలం లీజుకు తీసుకుని నడుపుతున్న చంద్రశేఖర్‌, కెమికల్‌ ట్యాంకర్‌ యజమాని వెంకటేశ్‌, డ్రైవర్‌ దేవదాసుపై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ భానుమతి(Rajendranagar SI Bhanumathi) తెలిపారు.

మూసీలోకి రసాయన వ్యర్థాలను వదులుతుండటాన్ని గమనించిన లంగర్‌హౌజ్‌(Langerhouse)కు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు ఇంద్రసేనారెడ్డి తదితరులు మంగళవారం రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రసాయన వ్యర్థాల ట్యాంకర్‌ను పీసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

సెకీ ఒప్పందంపై జగన్ రియాక్షన్

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సెకీ లేఖపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. ఏపీ చరిత్రలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ అందించేందుకు సెకీ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. అంత మంచి ఆఫర్‌ను ఎలా తిరస్కరిస్తారని చెప్పిన వైఎస్ జగన్.. ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.

నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కూటమి సర్కారు పాలనలో ప్రతి వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోపించిన వైఎస్ జగన్.. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడితే సంపద సృష్టి అంటారన్న వైఎస్ జగన్.. రాష్ట్రానికి అదనపు ఆదాయం తీసుకొచ్చేలా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను సంపద సృష్టి అంటారని చెప్పారు. వైసీపీ హయాంలో సంపద సృష్టి జరిగిందన్న జగన్.. ఏపీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అడుగులు పడ్డాయని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ప్రతి అడుగూ వేశామన్న వైఎస్ జగన్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివక్ష లేకుండా అమలు చేశామన్నారు

రైతులకు ఉచిత కరెంట్ అందించడమేది ఒక కల అని చెప్పిన వైఎస్ జగన్.. చంద్రబాబు పాలనలో డిస్కం‌లు దెబ్బతిన్నాయన్నారు. చంద్రబాబు రాకముందు డిస్కంలకు రూ.29 వేలకోట్లు బకాయిలు ఉంటే.. చంద్రబాబు దిగిపోయేనాటికి ఈ బకాయిలు, అప్పులు రూ.86 వేలకోట్లకు చేరినట్లు ఆరోపించారు. డిస్కంల మీద, ప్రభుత్వం మీద భారం పడకుండా, రైతులకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం సోలార్ పార్కుల ఏర్పాటు కోసం టెండర్లు పిలిచిందని వైఎస్ జగన్ చెప్పారు. 2020 నవంబర్‌లో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచామని.. ఆ టెండర్లలో రూ. 2.49 పైసలు నుంచి రూ.2.58 పైసలకు చొప్పున సరఫరా చేసేందుకు సుమారు 24 బిడ్ల వరకూ దాఖలయ్యాయని వివరించారు. అయితే చంద్రబాబు దానికి అడ్డుపడ్డారని వైఎస్ జగన్ ఆరోపించారు.

ఈ క్రమంలోనే 2021 సెప్టెంబర్‌ 15న తీపి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం సెకీ నుంచి లేఖ వచ్చిందన్న వైఎస్ జగన్.. యూనిట్‌ రూ.2.49 పైసలు చొప్పున 9 వేల మెగావాట్ల పవర్ అందిస్తామని సెకీ లేఖ రాసిందన్నారు. 2024 సెప్టెంబర్ నాటికి 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని చెప్పారన్న వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తక్కువ ధరకు వచ్చిన ఆఫర్ ఇది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇంటర్ స్టేట్ ట్రాన్సిమిషన్ ఛార్జీలు కూడా లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా అవుతాయన్న వైఎస్ జగన్.. పాతికేళ్లలో లక్ష కోట్ల వరకూ ఆదా అయ్యేవని చెప్పారు.

ఈ లేఖలో మూడో పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన వైఎస్ జగన్.. చంద్రబాబు చేసుకున్న పీపీఏల వలన 2 వేలకోట్లు అదనపు భారం పడితే.. తమ ప్రభుత్వ నిర్ణయం వలన ఆదా అయ్యిందని చెప్పారు. యూనిట్ విద్యుత్‌కు రూ.5.90 పైసలకు ఒప్పందం చేసుకున్న చంద్రబాబు మంచోడా.. యూనిట్ రూ.2.49 చొప్పున ఒప్పందం చేసుకున్న నేను మంచివాడినా అని ప్రశ్నించారు. ఈ ఒప్పందం గురించి కూడా మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామన్న వైఎస్ జగన్.. ఏపీ చరిత్రలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ ఒప్పందం జరిగితే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వైఎస్ జగన్.. పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు.

బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే 134 వ వర్ధంతి

మహాత్మ జ్యోతిబాపూలే 134 వ వర్ధంతిని పురస్కరించుకుని బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 

 ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిభా పూలే అణగారిన వర్గాల అసమానతలను రూపుమాపేందుకు అది కేవలం విద్య ద్వారానే సాద్యం అని భావించి అక్షరాలను ఆయుధంగా చేసుకుని వారికి విద్యనేర్పిన గొప్ప మహనీయుడని కొనియాడారు. విద్య ద్వారానే సమాజాన్ని మార్చాలని నిర్ణయుంచుకుని అణిచివేయబడుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షరజ్యోతులు వెలిగించిన చైతన్య మహానీయుడు అని అన్నారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా అన్నివర్గాల ప్రజలం అడుగులు వేసి సాధించుకొనే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. అంతేకాకుండా మహిళలకు విద్య ద్వారానే విముక్తి కలుగుతుందని భావించి తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా మహిళా పాఠశాలలు ఏర్పాటు చేయించి ఎంతో మంది మహిళలకు విద్యనేర్పిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిభా పూలే అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫూలే జయంతి రోజున అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కులగణనకు ప్రతి ఒక్కరు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన వివరాలను గ్రామాల వారీగా ఆన్లైన్లో నమోదు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమగ్ర కులగణన అనంతరం బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, జిల్లా నాయకులు నారబోయిన శ్రీనివాస్, బోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అజ్మీర్‌ దర్గా కింద శివాలయం

రాజస్థాన్‌లోని అజ్మీరులో ఉన్న సూఫీ సెయింట్‌ మొయినుద్దీన్‌ ఛిస్తీ దర్గా కింద శివాలయం ఉందని అజ్మీరు కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది.

ఈ శివాలయంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ, తమ పిటిషన్‌పై కోర్టు స్పందించిందని చెప్పారు.

రాజస్థాన్‌లోని అజ్మీరులో ఉన్న సూఫీ సెయింట్‌ మొయినుద్దీన్‌ ఛిస్తీ దర్గా కింద శివాలయం ఉందని అజ్మీరు కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ శివాలయంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

పిటిషనర్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ, తమ పిటిషన్‌పై కోర్టు స్పందించిందని చెప్పారు. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ), అజ్మీరు దర్గా కమిటీ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

అమరావతిలోనే రిపబ్లిక్‌ వేడుకలు

రిపబ్లిక్‌ డే(జనవరి 26) వేడుకలను ఈసారి రాజధాని అమరావతిలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

రిపబ్లిక్‌ డే(జనవరి 26) వేడుకలను ఈసారి రాజధాని అమరావతిలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మేరకు రాయపూడి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టవర్ల సమీపంలో ఎన్‌ఆర్టీ టవర్స్‌కు వెళ్లే మార్గంలో ఉన్న స్థలాన్ని సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ముఖ్యమంత్రి కార్యాలయ(జీఏడీ) అధికారి సురేశ్‌కుమార్‌ ఏఎస్పీ ఏటీవీ రవి, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బుధవారం పరిశీలించారు.

బంగ్లాదేశ్‌లో చిన్మయ్ దాస్ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో తెలుసా

బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ ఆలయానికి సంబంధించిన చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత పరిస్థితి మరింత దిగజారుతోంది. చిన్మోయ్ దాస్ జైలుకు వెళ్లారనే వార్త వచ్చినప్పటి నుంచి ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి హింసాత్మక నిరసనలు చేపట్టారు. హిందువులు మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేస్తూ పొరుగుదేశంలో భారత్‌లో కూడా స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

హిందూ మత గురువు, ఇస్కాన్ ప్రధాన పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించారు. చిన్మయ్ ప్రభు అరెస్టును కలిసి ఖండిద్దాం అని అన్నారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మేము కోరుతున్నాము.

కళ్యాణ్ చారిత్రక సందర్భాన్ని హైలైట్ చేస్తూ బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో భారత సైన్యం చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సైనిక సిబ్బంది జీవితాలను, దేశ నిర్మాణానికి వెచ్చించిన వనరులను ప్రస్తావించిన ఆయన బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను తక్షణమే ఆపాలని కోరారు. ఈ విషయం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మహ్మద్ యూనస్ దృష్టిని కూడా ఆకర్షించింది, అతను హిందూ సమాజంపై హింసను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాడు. సంఘీభావం కోసం కళ్యాణ్ పిలుపు ఈ ప్రాంతంలోని మైనారిటీ వర్గాల పట్ల పెరుగుతున్న ఆందోళనలను ప్రతిబింబిస్తుంది.

భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది

ఈ విషయంపై భారత ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 26) స్పందించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, 'బంగ్లాదేశ్ సమిత్ సనాతన్ జాగరణ్ జోట్' ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేయడం మరియు బెయిల్ నిరాకరించడం పట్ల మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. బంగ్లాదేశ్‌లో హిందువులు మరియు ఇతర మైనారిటీలపై తీవ్రవాద శక్తులు జరిపిన దాడుల శ్రేణిని అనుసరించి ఈ సంఘటన జరిగింది. మైనారిటీ గృహాలు మరియు వ్యాపార సంస్థలను కాల్చడం మరియు దోపిడీ చేయడంతో పాటు దొంగతనం, విధ్వంసం, దేవతలను మరియు దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి అనేక కేసులు నమోదయ్యాయి.

శాంతియుతంగా సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్లను అందించిన మత నాయకుడిపై ఆరోపణలు వస్తున్నప్పటికీ ఈ ఘటనలకు పాల్పడినవారు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతుండడం దురదృష్టకరమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మైనారిటీలపై దాడులు జరగడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. "హిందువులు మరియు మైనారిటీలందరికీ శాంతియుతంగా సమావేశమయ్యే మరియు భావవ్యక్తీకరణ హక్కుతో సహా భద్రత కల్పించాలని మేము బంగ్లాదేశ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

చంద్రబాబు, జగన్లపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో బ్యాలెట్ ఓటింగ్కు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మీరు గెలిస్తే ఈవీఎం లు బాగా పనిచేసినట్టు. ఓడిపోతే ట్యాంపర్ చేసినట్టా? గతంలో చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవిఎం లను ట్యాంపర్ చేయవచ్చన్నారు.

ఇప్పుడు జగన్ ఓడిపోవడంతో వాటిని ట్యాంపర్ చేయవచ్చని ఆయనా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి' అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్స్ కొట్టేసింది...

మేడిగడ్డ కుంగడానికి ముందే బుంగలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాకు చాలా ప్రమాదకరమని కాళేశ్వరం విచారణ కమిషన్‌ వ్యాఖ్యానించింది. బ్యారేజీలపై విచారణ సందర్భంగా సోమవారం చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)లతో పాటు 18 మంది ఇంజనీర్లను కమిషన్‌ ప్రశ్నించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాకు చాలా ప్రమాదకరమని కాళేశ్వరం విచారణ కమిషన్‌ వ్యాఖ్యానించింది. బ్యారేజీలపై విచారణ సందర్భంగా సోమవారం చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)లతో పాటు 18 మంది ఇంజనీర్లను కమిషన్‌ ప్రశ్నించింది. బ్యారేజీ కుంగడానికి గల కారణాలేంటని డీఈఈ ఎల్‌.భీమరాజును అడగ్గా.. కారణాలు తెలియవని, విశ్లేషణ జరుగుతోందని గుర్తుచేశారు. మేడిగడ్డలోని ఏడో బ్లాకు కుంగడానికి ముందే బుంగలు ఏర్పడినట్లు గుర్తించామని, వెంటనే ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ)కి లేఖ రాశామని భీమరాజు తెలిపారు. నాలుగు సార్లు లేఖలు రాసినట్లు నివేదించారు. ఏడో బ్లాకు కుంగడానికి ముందు బుంగలు ఏర్పడడంతో వెంటనే ఈఈకి లేఖ రాశానని, తర్వాత తొలి వరదలకు సీసీ బ్లాకులు చెల్లాచెదురయ్యాక కూడా లేఖ రాశానని, మొత్తం నాలుగు లేఖలు రాసి, అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. నిర్మాణ సంస్థకు లేఖ రాశారా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. రాయలేదని బదులిచ్చారు. ఈ సందర్భంగా ఏడో బ్లాకు చాలా ప్రమాదకరమని కమిషన్‌ వ్యాఖ్యానించింది. విచారణకు హాజరైన 18 మందిఅధికారులను అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలన్నీ వాస్తవాలేనా? అని ప్రశ్నించింది.

ఒక్క సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) సీఈ ఓరుగంటి మోహన్‌కుమార్‌ మాత్రం తాను దాఖలు చేసిన అఫిడవిట్‌లో చిన్న పొరపాటు జరిగిందన్నారు. గోదావరి నదిలో ఇంద్రావతి కలిసే చోట నీటి లభ్యత అని రాశానని, అక్కడ గోదావరిలో ప్రాణహిత కలిసే చోటగా మార్పులు చేయాలని నివేదించారు. ఏఈఈ రూపాని విజయ్‌ని అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలేనా అని అడగ్గా.. అదనంగా మరిన్ని వివరాలు చెప్పబోయారు. స్పందించిన కమిషన్‌.. ‘అడిగిన దానికే జవాబు చెప్పాలి. అడగని వాటికి కాదు’ అని మండిపడింది. రూ.2591 కోట్ల వ్యయంతో మేడిగడ్డ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చిందెవరు? అని ప్రశ్నించగా.. నీటిపారుదల శాఖ కార్యదర్శి అని బదులిచ్చారు. మరో ఏఈఈ ఎం.ప్రసాద్‌ను ప్రశ్నిస్తూ.. ప్లేస్‌మెంట్‌ రిజిస్టర్‌లో సంతకాలు మీరే చేశారా? ఆ సమయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారా? అని ప్రశ్నించగా.. తానే చేశానని, తన వెంట తోటి సిబ్బంది తప్ప ఎవరూ లేరని చెప్పారు. ఏ రోజు నిర్మాణ వివరాలను ఆ రోజే రిజిస్టర్‌లో నమోదు చేశారా? లేదా? అని ఏఈఈ రవికాంత్‌ను ప్రశ్నించగా.. ఏ రోజు వివరాలు ఆ రోజే నమోదు చేశారని బదులిచ్చారు.

బ్యారేజీతో ముడిపడిన డిజైన్లు ఏమైనా సిద్ధం చేశారా? అని సీడీవో ఈఈ ఎం.రామసుబ్బారెడ్డిని ప్రశ్నించగా.. డిజైన్లు తాను ఇవ్వలేదని, బ్యారేజీతో ముడిపడిన పనుల్లో తన పాత్ర లేదని, బ్యారేజీ కుంగిన తర్వాత 3డీ మోడల్‌ స్టడీ్‌సలో తాను పాల్గొన్నానని చెప్పారు. డిజైన్ల తయారీలో మీ పాత్ర ఉందా? అని మాజీ సీఈ టి.శ్రీనివా్‌సను ప్రశ్నించగా.. తన పాత్ర లేదన్నారు. బ్యారేజీ అనుబంధ పనుల డిజైన్లలోనే తన పాత్ర ఉందని తెలిపారు.

ప్లేస్‌మెంట్‌ రిజిస్టర్లపై విచారణకు హాజరైన, ఆయా రిజిస్టర్లలో వివరాలు నమోదు చేసిన ఏఈఈ, డీఈఈల సంతకాలు తీసుకున్న కమిషన్‌.. ఆ రిజిస్టర్లను స్వాధీనం చేసుకుంది. ఎవరు నిర్మాణబాధ్యతలు చూ శారో నిర్ధారించుకోవడానికే సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం 15 మంది ఇంజనీర్లను కమిషన్‌ విచారించనుంది. సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన అఽధికారులను ప్రశ్నించనుంది.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు లోకేష్ శుభాకాంక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు (75th Constitution, Day celebrations) ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt.,) నిర్ణయించింది. 1949 నవంబరు 26వ తేదీన కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను అడాప్ట్ చేసుకుంది. 1950 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం (Constitution of India) అమలులోకి వచ్చింది. అమలులోకి వచ్చి నవంబర్ 26వ తేదికి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే 'రాజ్యాంగ దినోత్సవం' సందర్భంగా ప్రజలకు నా శుభాకాంక్షలు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో మనం రూపొందించుకున్న భారత రాజ్యాంగం, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అనడంలో సందేహం లేదు. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగం గొప్పతనమే. అంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ అంబేద్కర్ మనకు ప్రాత:స్మరణీయుడు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళి అర్పిస్తున్నాను. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వస్తారు.11.30 గంటలకు సచివాలయంలోని 5వ బ్లాక్‌లో రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొంటారు.12.30 గంటలకు ఐటీ పాలసీపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు జీ.ఎస్.డబ్ల్యూ.ఎస్ డిపార్ట్ మెంట్‌పై సమీక్ష జరుపుతారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వమని, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగందే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పుస్తకం రూపొందించి అందించబోతున్నామని చెప్పారు. ప్రాథమిక హక్కులు, ఇతర అంశాల గురించి విద్యార్థి దశ నుండే సులభంగా అర్ధం అయ్యేలా చెయ్యడమే ఈ పుస్తకం లక్ష్యమని మంత్రి లోకేష్ వెల్లడించారు.

ఒకే నేరంపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు

ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఎందుకు? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.

ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఎందుకు? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో భూసేకరణ విచారణకు వచ్చిన కలెక్టర్‌, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు అదనంగా మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఈ కేసులో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ.. ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు, ఈ హైకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని తెలిపారు. పిటిషనర్‌ సహా ఇతర నిందితులను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రజినీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. లగచర్ల గ్రామంలోనే వేర్వేరు చోట్ల జరిగిన నేరాలని, ఫిర్యాదుదారులు, బాధిత అధికారులు సైతం వేర్వేరని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. మూడు ఫిర్యాదులను పరిశీలించింది. మూడు ఫిర్యాదులు వేర్వేరు వ్యక్తులు ఇచ్చినప్పటికీ పోలీ్‌సస్టేషన్‌లో ఉన్న రైటర్‌.. ఫిర్యాదుదారుల పేర్లు మార్చి ఒక్కటే ఫిర్యాదును మూడింటికీ కాపీ చేశారని పేర్కొంది. ప్రభుత్వ అధికారులైన ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదు తాము కూడా రాసుకోలేరా? అని ప్రశ్నించింది. ఈ మేరకు తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు లగచర్ల ఘటనకు ముందు దుద్యాల మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిపై దాడి ఘటనలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సదరు ఎఫ్‌ఐఆర్‌లో నరేందర్‌రెడ్డి నిందితుడిగా లేకపోయినప్పటికీ.. ముందస్తు బెయిల్‌ కోరారు.

పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై తీర్పు ప్రకటన మరోసారి వాయిదా పడింది. లగచర్ల ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నరేందర్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కొడంగల్‌ జే ఎఫ్‌ఎంసీలో పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు తీర్పు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. సోమవారం మరోసారి ఈ పిటిషన్‌ కోర్టు ముందుకు రాగా, తీర్పును డిసెంబరు 2కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. వికారాబాద్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి తరపున దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌.. జడ్జి సెలవులో ఉన్న కారణంగా అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణకు రాగా, ఈనెల 27వ తేదీకి వాయిదా వేశారు.

వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్‌ 79 (1)లో పేర్కొన్న విధంగా స్వతంత్ర రాష్ట్ర కమిషనర్‌ను నియమించాలని పేర్కొంటూ ఆలిండియా కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ది బ్లైండ్‌ (ఏఐసీబీ), డెవల్‌పమెంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బ్లైండ్‌ (డీడబ్ల్యూఏబీ) సంస్థలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టి న జస్టిస్‌ సూరేపల్లి నంద ధర్మాసనం.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. విచారణ డిసెంబరు 2కు వాయిదా పడింది.