NLG: గురుకుల పాఠశాల నూతన భవన సముదాయం ను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గం:
సంస్థాన్ నారాయణపూర్ మండలం, సర్వేల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవన సముదాయం ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ ప్రారంభించారు. ఈ మేరకు గురుకుల పాఠశాల సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గురుకుల పాఠశాల స్థలదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహంతో పాటు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం విగ్రహాల కు పూలమాల లు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, 18.61 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, 1 కోటి రూపాయల వ్యయం తో ఫర్నిచర్ తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు పాటించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దేశంలోనే సర్వేలు పాఠశాలకు ఉన్నతమైన ఘన చరిత్ర ఉంది.మద్ది నారాయణరెడ్డి తన 44 ఎకరాల స్థలం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు.
డబ్బు తో గౌరవం రాదు, విద్యతోనే వస్తుంది. చదువుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. రాజకీయ నాయకులు,కలెక్టర్లు,డాక్టర్లు, శాస్త్రవేత్తలు కావచ్చని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం కృషి చేస్తుందని,
ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపనలో భాగంగా మునుగోడు వద్ద 300 కోట్ల రూపాయల తో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.
మునుగోడు నియోజకవర్గంలో మండలానికి 5 పాఠశాలల చొప్పున 30 స్కూల్ లను నిర్మించేలా కృషి చేస్తానని అన్నారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం విషయంలో తేడా రావొద్దని పాఠశాల సిబ్బంది కి సూచించారు.
కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పలువురు నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
Nov 27 2024, 18:46