మర్రిగూడ మండలంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మండలకేంద్రంలో అంబేద్కర్ వాది నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ మేరకు నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక,ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన మరియు భావ ప్రకటన, విశ్వాసం, సమానత్వాన్ని చేకూర్చుకోవడానికి వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను సౌబ్రాతృత్వాన్ని పెంపొందించడానికి,1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ లో ఎంపిక చేసుకొని శాసనం గా రూపొందించారని భారత రాజ్యాంగ పీఠిక ను గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో పందుల రాములు గౌడ్,కొడిచెర్ల శేఖర్, పగడాల రఘు, అభి సందేశ్, వంపు చరణ్,కోరే అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Nov 26 2024, 16:58