/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టి.టి.డి. నిర్ణయం హర్షణీయం Andrapradesh
తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టి.టి.డి. నిర్ణయం హర్షణీయం

తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టిటిడి పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని హామీ ఇచ్చాను. నగర ప్రజల ఆకాంక్షను టిటిడి ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించాను. టిటిడి పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు ఛైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకు, ఈవో శ్రీ శ్యామలరావు గారికి అభినందనలు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. #టీటీడీ #TTDevasthanams #TTD
AP : ఫీజు రీయింబర్స్మెంట్ సర్కారు కీలక నిర్ణయం...

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై నేడు కేబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.

AP : శ్రీశైలంలో ఈ రోజు నుండి కార్తీక మాసోత్సవాలు...

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ రోజు నుండి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. 

భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు.

 ఉత్సవాల ప్రారంభ సూచికగా ఆలయ ప్రాంగణంలో నేడు అర్చకులు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు.

AP : ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని ప్రారంభించిన సీఎం

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

 ఇది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకమే అయినా ముందుగా డబ్బు చెల్లిస్తేనే సిలిండర్ బుక్ అవుతుంది. అయితే డబ్బులు ముందుగా కట్టకుండానే సిలిండర్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అదే జరిగితే లబ్దిదారులకు భారీ ఊరట కాబోతోంది.

AP : వచ్చే నెల 1వ తేదీ నుండి కరెంట్‌ చార్జీల పెంపు !

ఏపీలో నవంబర్‌ 1వ తేదీ నుంచే కరెంట్‌ చార్జీల పెంచేందుకు రెడీ అయ్యారని చంద్రబాబు సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

ఎన్నికలకు ముందు 5 సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం ఓట్లు కోసం ప్రజల వద్దకు వెళ్లిందని తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి విద్యుత్ చార్జీలు పెంచనున్నారన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, ఇప్పుడు ఇంకో మాట, ఇది చంద్రబాబు నైజం అని తెలిపారు.

ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచితే వైసిపి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయాలని సంకల్పిస్తిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఆసన్నమైంది. లేదంటే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబు కు షాక్ ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారని తెలిపారు.

మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారని తెలిపారు. దీపావళి నుండి గ్యాస్ ధరలు తగ్గింపు అని సంవత్సరానికి 4250 కోట్లు ఖర్చు అయితే, అదే డబ్బు విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

కార్తీక మాసములో చేయకూడని పనులు

ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు.

పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను.

ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు, చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను.

కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు.

ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |

నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను.

ఈ రోజు నుండి విశాఖ - విజయవాడ మధ్య విమాన సర్వీసులు...

ఈ రోజు నుంచి విజయవాడ - విశాఖ మధ్య మరో ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ రోజు సా.7.15 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకోనుంది ఫ్లైట్.. తిరిగి 8.45 గంటలకు బయల్దేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడకు రానుంది విమానం. 

ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఇది ఇలా ఉండగా.. .విశాఖ భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం!

ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ కనిపించడం లేదంటూ అతని భార్య పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. రెండు రోజులుగా తన భర్త ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే కలుస్తలేదని నరేష్ భార్య సరోజిని పడమట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

సెప్టెంబర్ 26న నరేష్ హైదరాబాద్ వెళ్లాడని, 28న తనకు కాల్ చేసి తనకు రావల్సిన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంక్ స్కాం కేసులో అటు బెజవాడ పోలీసులు గాలిస్తుండగా.. హైదరాబాద్‌లో సీఐడీ పోలీసులు వెతుకుతున్నారు.

ఇదిలాఉండగా, కస్టమర్లకు చెందిన రూ.28కోట్ల డిపాజిట్లను 72 ఖాతాల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ బృందం దారి మళ్లించాయి. ఆ డబ్బులను నెక్సస్ గ్రోత్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు.ప్రస్తుతం ఆ సంస్థ ఓనర్ ప్రభు కిషోర్ పరారీలో ఉండగా.. నరేష్ సైతం కనిపించకుండా పోయాడు.

4 నెలల తర్వాత పాపికొండలు విహారయాత్రలు పునః ప్రారంభం

విహార యాత్రలు వెళ్లే వారికి శుభవార్త అందింది. తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి.

 నాలుగు నెలల విరామం తర్వాత పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టూరిజం శాఖ.

దీంతో తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలకు బయలుదేరి వెళుతున్నారు పర్యాటకులు. ఈ తరునంలోనే.. దేవీపట్నం మండలం పోసమ్మ గండి నుండి బయలుదేరనున్నారు బోట్లు. దీంతో దేవీపట్నం మండలం పోసమ్మ గండి పర్యాటకులతో సందడిగా మారింది. 

వర్షా కాలం తగ్గడం.. చలి కాలంలో ప్రారంభం కానున్న తరునంలోనే.. తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

వాడిని మీరు చంపుతారా.. మమ్మల్ని చంపమంటారా: తల్లి ఆవేదన

AP. ప్రేమోన్మాది దాడిలో కడప జిల్లాలోని బద్వేల్లో ఇంటర్ విద్యార్థిని మృతిచెందిన విషయం తెలిసిందే. కడప రిమ్స్ పోస్ట్ మార్టం రూం వద్ద బద్వేల్ విద్యార్థిని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడ్ని మీరు చంపుతారా..? నన్ను చంపమంటారా.. నడిరోడ్డుపై ఉరి తీస్తారా అంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.