NLG: సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:
యరగండ్లపల్లి గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, బుధవారం మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్ పంపిణీ చేశారు. ముదం పద్మమ్మ భర్త వెంకటయ్య కు 54,000 రూపాయల చెక్కును, వల్లముల నర్సమ్మ కు 20,000 రూపాయల చెక్కు ను పంపిణి చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు వరం లాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద వినియోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాకులవరం అశోక్ రెడ్డి, పులిమామిడి నరసింహారెడ్డి, ఏడుదోడ్ల కృష్ణ రెడ్డి, జమ్ముల వెంకటేష్ గౌడ్, ఎం.డీ.ఇబ్రయీమ్, వనపర్తి యాదయ్య, మామిడి అంజయ్య, సీత వెంకటయ్య, ఆకారపు శీను, కుక్కడపు ముత్యాలు, కాకులవరం పృద్విశ్ రెడ్డి, బొమ్మిడి సుదర్శన్,నక్కరగోని కొండల్,కుక్కడుపు అంజయ్య, ముద్దం వెంకటయ్య, గోడ్డేటి వెంకటయ్య, మైలారం అంజయ్య, గజ్జి యాదయ్య, సిలివేరి యాదయ్య, పొలగోని అబ్బయ్య, పోలగొని యాదయ్య, ఏర్కలి రాములు, నక్కరగోని స్వామి, తోడేటి నాగరాజు, రాముని సంతోష్, పొలాగోని శేఖర్, సురగొని శ్రీను, వల్లాముల శ్రీశైలం, బచ్చనగోని లింగం, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Nov 08 2024, 08:24