/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు Raghu ram reddy
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ కేబినెట్ భేటీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లు, డ్రోన్ పాలసీ, ఏపీ జీఎస్టీ చట్ట సవరణ సహా పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, కబ్జాలను అరికట్టడానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును ఏపీ ప్రభుత్వం తీసుకువస్తోంది. గతంలో ఉన్న చట్టాన్ని రిపీల్ చేసిన ప్రభుత్వం.. కఠినమైన శిక్షలతో నూతన చట్టం తీసుకురానుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ భేటీ అనంతరం.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. వైసీపీ పాలనలో గత ఐదేళ్ల కాలంలో ఏపీలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయన్న మంత్రి పార్థసారథి.. ఈ నేపథ్యంలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ను రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకు రావడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

పాత చట్టం నగరీకరణ చెందుతున్న ప్రాంతాలకే పరిమితమై ఉండేదన్న మంత్రి.. శిక్షలు కూడా తక్కువగా ఉండేవన్నారు. ఐదేళ్ల నుంచి ఆరేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేదన్న మంత్రి.. కొత్తగా తీసుకు రానున్న చట్టం ప్రకారం భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడితే 10 నుంచీ 14 సంవత్సరాల‌ జైలు పడుతుందని హెచ్చరించారు. కొత్త చట్టం అమలుకు ప్రత్యేక కోర్టులు కూడా వస్తాయన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఏపీ డ్రోన్ పాలసీకి ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీ రూపొందించినట్లు చెప్పారు. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు

ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్.. డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లును తీర్చిదిద్దుతామన్న మంత్రి పార్థసారథి.. ఇందులో భాగంగా 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్అండ్‌డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలు, 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యాసంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్‌ బకాయిల చెల్లింపునకు కూడా ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే ఎక్సైజ్‌ చట్ట సవరణ ముసాయిదాకు ఆమోదం తెలిపారు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యాల సాధనకు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తూ.. పల్నాడు, బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి 154 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయించింది. అలాగే జ్యుడిషియల్‌ అధికారుల రిటైర్‌మెంట్ వయసును 61కి పెంచే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పల నాయుడు

ఏపీలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అధికార కూటమి, విపక్ష పార్టీలు తలమునకలవుతున్నాయి.

ఏపీలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అధికార కూటమి, విపక్ష పార్టీలు తలమునకలవుతున్నాయి. వైసీపీ తరుఫున విజయనగరం స్థానిక సంస్థల అభ్యర్థిగా (YCP MLC Candidate) చిన అప్పల నాయుడును పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ( YS Jagan) అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో చిన అప్పల నాయుడు పేరును ఖరారు చేశారు. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఎన్‌టీ రామారావు పిలుపుమేరకు టీడీపీలో చేరిన చిన అప్పలనాయుడు బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మూడుసార్లు గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రొటెం స్పీకర్‌గా 175 మంది ఎమ్మెల్యేలచే ఆయన ప్రమాణం చేయించారు.

విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు 753 మంది ప్రతినిధులకుగాను వైసీపీకి 592 మంది ప్రతినిధులున్నారు. ఈ స్థానాన్ని కూడా వైసీపీ ఖాతాలో పడే విధంగా వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్‌ జగన్‌ సూచించారు.

ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పోస్టులపై కీలక చర్చ జరిగింది. కూటమి నేతలు, రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చ లేవనెత్తారు. కొంతమంది వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంత మంది అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పరిస్థితి ఇలానే ఉంటే నిందితులను శిక్షించేదేలా అని ఆయన ప్రశ్నించారు. సమస్యలు వచ్చినప్పుడు కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదని ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు. కిందిస్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లపైనా పోస్టులు పెడితే చూస్తూ ఎలా ఊరుకుంటామని అన్నారు. అందుకే తాను రియాక్ట్ అయ్యానని సీఎంకు తెలిపారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని చంద్రబాబు అన్నారు. వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రికి చెప్పారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని సీఎం అన్నారు. ఇకపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు మాటలకు రియాక్టయిన పవన్ కల్యాణ్.. పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొంతమంది అవినీతిపరులూ ఉన్నారని చెప్పారు. కొన్ని కేసులు గురించి సరైన ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వడం లేదని సీఎం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఎస్పీలు సీరియస్‌గా పని చేయడం లేదని మండిపడ్డారు. అందరినీ దారిలోకి తీసుకువస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి సూచించారు. తప్పనిసరిగా మనం ఎప్పటికప్పుడు చర్చించి నెల రోజుల్లో అందరినీ దారిలోకి తీసుకువద్దామని పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు చెప్పారు.

ఏపీ క్యాబినెట్ సమావేశంలో వాడీవేడీ చర్చ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పవన్ కల్యాణ్, టీడీపీ అగ్రనేతలు సహా మహిళలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వారి పని పట్టేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపైనా చర్యలకు దిగుతోంది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అలాంటి అధికారులను గుర్తించారు. ఇవాళ సాయంత్రం లోగా పలువురు పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా అభినందనలు తెలిపారు. యూఎస్, భారత్ దేశాల మధ్య బంధం మరింత దృఢపడాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ట్రంప్‌కు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలుపుతున్నారు.

అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డోనాల్డ్ ట్రాంప్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో అమెరికా మరింత పురోగతి సాధిస్తుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గతంలో అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ హయాంలో భారత్, అమెరికా దేశాల మధ్య భాగస్వామ్య బంధం మరింత దృఢ పడిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

అలాగే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఇరు దేశాలు.. తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ రెండు దేశాలు సహకారాన్ని మరింత పెంపొందించుకుంటాయని తాను విశ్వసిస్తున్నానని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు.

ప్రత్యేక లైసెన్స్ అక్కర్లేదు: సుప్రీం కీలక తీర్పు

డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒకే లైసెన్సుతో రెండు రకాల వాహనాలను నడిపే వెసులుబాటును సమర్థించింది.

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలకతీర్పునిచ్చింది. ఎల్ఎంవి (లైట్ మోటార్ వెహికల్) డ్రైవింగ్ లైసెన్స్ తో 7500 కిలోల లోపు ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చు అని తీర్పులో వెల్లడించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించాయి. 7500 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న రవాణా వాహనాన్ని నడిపేందుకు ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదని తీర్పునిచ్చింది.

లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనం నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణమనే వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన డేటా తమ వద్ద లేదని తెలిపింది. 7,500 కిలోలకు పైగా ఉన్న రవాణా వాహనాలను నడిపేందుకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ మేరకు ల్ఎంవీ కేటగిరీలోని ట్రాన్స్‌పోర్టు వాహనాలను డ్రైవ్ చేసేవారికి ప్రత్యేకంగా ఎలాంటి లైసెన్సు అవసరం లేదు. 7,500 కేజీల లోపు బరువున్న వాహనాలను కూడా ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడపవచ్చు.

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడం కారణమంటూ ఇటీవల వస్తున్న ఆరోపణలను కోర్టు ప్రస్తావించింది. ఈ రెండింటికీ సంబంధం లేదని తెలిపింది. మోటారు వాహనాల చట్టం 1988లో పేర్కొన్న అదనపు అర్హత ప్రమాణాలుదాని కింద రూపొందించిన నియమాల ప్రకారం మధ్యస్థ/భారీ రవాణా వాహనాలు 7,500 కేజీల కంటే ఎక్కువ స్థూల బరువు కలిగిన ప్రయాణికుల వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

హెచ్చరించిన కేటీఆర్

తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డిలు తెలంగాణను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నీటి ప్రాజక్టుల పేరుతో ముఖ్యమంత్రి భారీ స్కాంలకు తెర తీశారని, మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆడించినట్లు ఆడితే ఉన్నతాధికారుల ఉద్యోగాలు (Officers Jobs) ఊడగొడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) హెచ్చరించారు (Warning). తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti), మెగా కృష్ణారెడ్డిలు (Mega Krishna Reddy) తెలంగాణ (Telangana)ను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.. నీటి ప్రాజక్టుల పేరుతో ముఖ్యమంత్రి భారీ స్కాంలకు తెర తీశారని, మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయని విమర్శించారు.

దీనిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. భారీ స్కాంలు జరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. క్యాబినెట్‌లో ఉంటే మంత్రి పొంగులేటి కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తారన్నారు. పొంగులేటి జైలుకు పోవటానికి రెడీగా ఉండాలన్నారు. వాళ్ళు, ఈళ్ళు జైలుకు పోతారని చెప్పటానికి పొంగులేటి ఎవరని ప్రశ్నించారు. పొంగులేటి ఏమైనా హోంమంత్రినా.. అని అన్నారు.

బాంబులు పేల్చుడు కాదు.. ముందు పొంగులేటి జైలు పోవటానికి రెడీగా ఉంటాలని కేటీఆర్ అన్నారు. మూసీ ప్రాజెక్ట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నారని, మూసీ ప్రాజెక్ట్ కాంట్రాక్టు సైతం మెగా కృష్ణారెడ్డికి చెంది‌న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వనున్నారని అన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయని, తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని, పొంగులేటిపై ఈడీ రైడ్స్ జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

అలాగే బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (Social Media) వేదికగా విమర్శలు (Comments) గుప్పించారు. ‘‘గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ - గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు.., గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు - కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు.., ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు - పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు.., నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు - ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడు.., నీ మూసి ముసుగులు కాదు - కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు.., పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు - పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడు.., నీ కాసుల కక్కుర్తి - నీ కేసుల కుట్రలు కాదు - పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడు.., దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి .. సన్నవడ్లకు సున్నం పెడితివి .. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం వైపు చూడు’’ అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.

టెండర్‌‌పై సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ బుధవారం జీవో జారీ అయ్యింది. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం జీవో జారీ చేసింది.

గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ టెండర్ల విషయంలో సర్కార్ (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో ఇచ్చిన కేశవాపురం కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల పేరిట గత ప్రభుత్వం ప్రాజెక్టును డిజైన్ చేసిన విషయం తెలిసిందే. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవాపురం రిజర్వాయర్.. అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అదే ఖర్చుతో గోదావరి ఫేజ్ 2 స్కీమ్‌ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవాపురం చెరువును నింపుతారు. కేశవాపురం చెరువును 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌గా నిర్మించనున్నారు. అక్కడి నుంచి ఘన్‌పూర్ మీదుగా హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగునీటి అవసరాలకు సరఫరా చేసేలా ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే ఆరేండ్లై పనులు ప్రారంభంకానీ పరిస్థితి. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదని రేవంత్ సర్కార్ చెబుతోంది. గత ప్రభుత్వం హయాంలో ఈ టెండర్లను మెఘా కంపెనీ దక్కించుకుంది. అయితే టెండర్లను దర్కించుకున్నప్పటికీ పనులు చేపట్టకుండా మేఘా కంపెనీ వదిలేసింది.

2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని.. 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని మెఘా కంపెనీ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటి వరకు పనులు చేపట్టని కారణంగా మెఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో గ్రేటర్ సిటీకి తాగునీటి సరఫరాతో పాటు ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్ నీటిని నింపేందుకు ఎక్కువ భాగం గ్రావిటీతో వచ్చేలా కొత్త అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్

తొలి దఫా అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి తాజా ఎన్నికల వరకు ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ధృఢంగా పునరుద్ధరించుతానంటూ ప్రచార సమయంలోనే గట్టిగానే చెప్పారు. మరి ట్రంప్ 2.0 ప్రభుత్వం భారత్‌-అమెరికా బంధాలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి.

ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికలు-2024 ఫలితాలు వచ్చేశాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. మరి ట్రంప్ రెండవ దఫా పరిపాలనలో భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?, ప్రతికూలతలు ఏంటి, అవరోధాలు ఏమిటి? ఏయే అంశాలు ప్రభావితం కాబోతున్నాయి? అనే చర్చలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి.

తొలి దఫా అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి తాజా ఎన్నికల వరకు ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ధృఢంగా పునరుద్ధరించుతానంటూ ప్రచార సమయంలోనే గట్టిగానే చెప్పారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య స్నేహబంధం ఉంది. ‘హౌడీ, మోడీ!’, ‘నమోస్తే మోదీ’ వంటి ఈవెంట్‌లలో మోదీతో పాటు ట్రంప్ కూడా స్వయంగా పాల్గొన్నారు. ట్రంప్ గత పాలనలో భారత్-అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయని వీటిని బట్టి చెప్పవచ్చు. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం వంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తన విదేశాంగ విధానం ఉంటుందని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి దఫా పాలనలో పలు కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగారు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో పనిచేసిన ఆయన.. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను నిష్క్రమింపజేశారు. ఇరాన్ అణు ఒప్పందంతో పాటు కీలక అంతర్జాతీయ ఒప్పందాలకు కూడా విలువ ఇవ్వలేదు. మరికొన్ని ముఖ్యమైన ఒప్పందాలను సవరించారు. దీంతో రెండవ ట్రంప్ దఫా పాలనలో విదేశాంగ విధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

ఒప్పందాలు, పొత్తుల విషయంలో ట్రంప్ ప్రతికూల నిర్ణాయలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. భారత్ విషయానికి వస్తే అమెరికాతో వాణిజ్యం బంధం చాలా ముఖ్యమైనది. విదేశీ ఉత్పత్తులపై భారత్ అత్యధిక సుంకాలను విధిస్తోందంటూ గత పాలనలో ట్రంప్ ఆరోపించారు. పరస్పర పన్నును ప్రవేశపెట్టాలని కూడా ఆయన అన్నారు. తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పుడెలా వ్యవహరిస్తారో చూడాలి. ట్యాక్స్‌లు ఏమైనా ప్రవేశపెడతారా అనేది వేచిచూడాలి. ఇక భారత ఐటీ, ఫార్మాస్యూటికల్, టెక్స్‌టైల్స్ రంగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడుతుంటాయి. వీటి విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం భారతీయులకు చాలా కీలకమైనది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై ఆధారపడి అక్కడ పనిచేస్తున్న ఐటీ నిపుణులపై ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ప్రభావం చూపుతుంది. ట్రంప్ తన మొదటి దఫా పాలనలో విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వేతన పరిమితులు పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిణామం భారతీయ ఐటీ నిపుణులు, టెక్ కంపెనీలకు సవాలుగా మారింది. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ నిబంధనలను ప్రవేశపెడితే అమెరికాలోని భారతీయ టెకీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులపై ఆధారపడే ఐటీ కంపెనీలు కూడా ప్రభావితం అవుతాయి.

భారత్-అమెరికా సంబంధాలలో రక్షణ, సైనిక సహకారం అంశాలు గత కొన్నేళ్లుగా మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (iCET), జెట్ ఇంజిన్‌ల తయారీకి జీఈ-హెచ్ఏఎల్ (GE-HAL) వంటి కీలకమైన రక్షణ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరిగాయి. ఇక ట్రంప్ తదుపరి పాలన విషయానికి వస్తే.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్-అమెరికా సైనిక సహకారాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

ఇక అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న ‘క్వాడ్’ను ట్రంప్ హయాంలో మరింత బలోపేతం చేసే అవకాశాలున్నాయి. చైనాకు కౌంటర్‌గా క్వాడ్ బలోపేతం జరుగుతోంది. సభ్య దేశాల మధ్య ఆయుధ విక్రయాలు, సాంకేతికత బదిలీలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు వంటి మరింత రక్షణ సహకారాన్ని ట్రంప్ 2.0 హయాంలో ఆశింవచ్చు. ఇక ఉగ్రవాద నిరోధం విషయంలో కూడా భారత లక్ష్యాలకు అనుకూలంగా ట్రంప్ ప్రభుత్వం పనిచేసే అవకాశాలు ఉన్నాయి.

విజేత ఎవరనేది ఎప్పటికి తెలుస్తుంది

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. పోటాపోటీగా జరిగిన ఈసారి ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి చాలా సమయం పట్టొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నువ్వా-నేనా అన్నట్టుగా తలపడ్డారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి చాలా సమయం పట్టొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజుల సమయం కూడా పట్టొచ్చని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన పార్టీ శ్రేణులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు సమయాల్లో (కాలమానాలను బట్టి) ఓట్ల లెక్కింపు జరుగుతుండడం ఈ ఆలస్యానికి ఒక కారణం కానుంది. అందుకే ముగింపు ఫలితం చాలా ఆలస్యంగా వెలువడనుందని తెలుస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ఓట్లను లెక్కిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు వేచి ఉంటారు. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్లు సమర్పించిన వెంటనే కౌంటింగ్ మొదలుపెడతారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల ప్రకటనలు వేర్వేరు సమయాల్లో వెలువడుతుంటాయి. మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా కాకుండా అమెరికాలో రాష్ట్రాల ఎన్నికల సంఘాలే ఓట్లను లెక్కిస్తాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య (భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 -సాయంత్రం 4.30) విస్కాన్సిన్, మిచిగాన్‌ల రాష్ట్రాల్లో చాలా ఫలితాలు వెలువడనున్నాయి. ఇక పెన్సిల్వేనియా, అరిజోనా, నెవాడాల్లో అప్పటికి కొన్ని ఫలితాలు మాత్రమే వస్తాయి.

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రతి ఓటు కోసం ప్రచారం చేశారు. ప్రత్యేకించి ఎన్నికల రణక్షేత్రాలుగా భావించిన అరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా స్వింగ్ రాష్ట్రాల్లో హోరాహోరీగా పోరాడారు. దీంతో ఓట్ల లెక్కింపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అధికార డెమోక్రాటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ వందలాది మంది న్యాయవాదులు, వేలకొద్దీ వాలంటీర్లను ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మోహరించాయి. అవసరమైతే న్యాయ పోరాటాలు చేయడానికి న్యాయవాదులను సిద్దంగా ఉంచుతారు.

కాబట్టి ఎన్నికల ఫలితాలు చాలా రోజుల వరకు తెలియకపోవచ్చని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన పరిశీలకులు డిల్లాన్ పేర్కొన్నారు. పూర్తి ఫలితాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాలని అన్నారు. బుధవారం రోజు తర్వాత అన్ని రాష్ట్రాల ఫలితాలు ఆశించవచ్చని డిల్లాన్ అన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అప్రమత్తం చేశారు. పెన్సిల్వేనియా, అరిజోనా, నెవాడా, మిచిగాన్, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో బుధవారం తర్వాత కూడా కొన్ని ఫలితాలు రావొచ్చని పేర్కొన్నారు. ‘‘నెవాడాలో నవంబర్ 9 వరకు బ్యాలెట్‌లు వస్తాయి’’ అని పేర్కొన్నారు.

అయ్యా నాది ఏ రాష్ట్రం

తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్లపాటు ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నాడు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలో చదివాడు.

తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్లపాటు ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నాడు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలో చదివాడు. ఆ విద్యార్థి ఇప్పుడు ఏ రాష్ట్రానికి చెందినవాడవుతాడు? వైద్య విద్యార్థి ధూరెడ్డి పృథ్వీరెడ్డికి ఇప్పుడు ఇదే సమస్య ఎదురైంది. పీజీ వైద్య విద్యకు అర్హత పరీక్షలో సీటు సాధించి కౌన్సెలింగ్‌కు సిద్ధమైన పృథ్వీరెడ్డిని తెలంగాణ అధికారులు ఏపీకి వెళ్లమంటున్నారు. ఏపీకి వెళితే.. అక్కడి అధికారులు తెలంగాణకు వెళ్లమంటున్నారు. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారి.. ఎంతో కష్టపడి సాధించిన పీజీ సీటుకు దూరమయ్యే ప్రమాదంలో ఉన్నాడు. మెడికల్‌ పీజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో జారీ చేసిన 148 జీవోనే ఇందుకు కారణమైంది.

ఈ జీవో ప్రకారం.. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతోపాటు ఎంబీబీఎస్‌ కూడా ఇక్కడే పూర్తి చేసినవారికి ఇక్కడి స్థానికత కల్పిస్తారు. అయితే పృథ్వీరెడ్డి.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందినవాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న విజయనగరం జిల్లా పరిధిలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్లో 6వ తరగతిలో సీటు రావడంతో 12వ తరగతి వరకు అదే పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించాడు. అనంతరం నీట్‌ పరీక్షలో 1830 ర్యాంకు సాధించి గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎ్‌సలో చేరి వైద్య విద్యను పూర్తి చేశారు.

ఇటీవల జరిగిన నీట్‌ మెడికల్‌ పీజీ ఎంట్రెన్స్‌లో పృథ్వీరెడ్డి 11,362 ర్యాంకు సాధించి కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ నెల 7 నుంచి జరగనున్న కౌన్సెలింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించగా.. ఆయన దరఖాస్తును ఆన్‌లైన్‌ స్వీకరించలేదు. దీంతో ఆందోళనకు గురైన పృథ్వీరెడ్డి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీకి వెళ్లి సంప్రదించా రు. వైస్‌ చాన్స్‌లర్‌ ఈయన సర్టిఫికెట్లను పరిశీలించి.. 12వ తరగతి వరకు విద్యాభ్యాసం ఏపీలో ఉన్నందున జీవో 148 ప్రకారం తెలంగాణ స్థానికత లేదని తెలిపారు. దీనిపై వైద్య ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖలో విచారించగా.. అక్కడా ఇదే విషయం చెప్పారు.

తాను తెలంగాణలో పుట్టానని, ప్రాథమిక విద్యను ఇక్కడే చదివానని, ఎంబీబీఎస్‌ కూడా ఇక్కడే పూర్తి చేశానని, ఏపీలోని సైనిక్‌ స్కూల్లో చదివింది కూడా ఉమ్మడి రాష్ట్రంలోనేనని, తన తండ్రి తెలంగాణలో పోలీస్‌ శాఖలో పని చేస్తున్నారని పృథ్వీరెడ్డి చెప్పినా కుదరదన్నారు. తనకు న్యాయం చేయాలం టూ రాష్ట్రఉన్నతాధికారులతోపాటు, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టియానాను కలిసినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఏపీకి వెళితే.. ఎంబీబీఎస్‌ తెలంగాణలో చదివినందున పీజీకి తమ రాష్ట్ర స్థానికత ఇవ్వలేమని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన 2014కు ముందు తాను ఏపీలో చదివానని, తనలాంటి వారంతా తెలంగాణ స్థానికత కోల్పోవాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు మరోరోజు మాత్రమే గడువు ఉన్నందున ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.