/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz శ్రీశైలం, సాగర్‌ను ఖాళీ చెయ్యొద్దు Raghu ram reddy
శ్రీశైలం, సాగర్‌ను ఖాళీ చెయ్యొద్దు

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే వాడాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే వాడాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది. 2025 వానాకాలం దాకా రిజర్వాయర్లలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, జలవిద్యుత్‌ ఉత్పాదన చివరి ప్రాధాన్యంగా ఉండాలని సూచించింది. కేఆర్‌ఎంబీ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.శంకువ ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలకు వేర్వేరుగా లేఖలు పంపారు

. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అవసరమున్నా లేకున్నా పోతిరెడ్డిపాడు నుంచి ఇరువైపులా జలవిద్యుత్‌ ఉత్పాదనతో నీటిని దిగువకు వదులుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, సాగర్‌లో ప్రధాన కేంద్రంతో పాటు కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల్లో జల విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నారని తెలిపారు.

ఇలా పోటీ పడి తెలుగు రాష్ట్రాలు నీటి నిల్వలను దిగువకు వదులుతుండడంపై కేఆర్‌ఎంబీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే జలవిద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలని, అవసరం లేకుండా ఇతర కాంపోనెంట్ల ద్వారా నీటి తరలింపును ఆపాలని కోరింది.

నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ లోనూ పూర్తి స్థాయి నిల్వలు ఉండడంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇలా నీరు వృథా అవుతున్న నేపథ్యంలో కేఆర్‌ఎంబీ తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

అమల్లోకి కొత్త రూల్స్

హైదరాబాద్‌ నగరంలోని వాహనదారులకు షాకింగ్ న్యూస్ వినిపించారు ట్రాఫిక్ పోలీసులు. మంగళవారం (నవంబర్ 05) రోజు నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. అయితే.. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు.. జరిమానాలు భారీగా పెంచేయటమే కాకుండా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక నుంచి హెల్మెట్ పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా వాహనదారులకు జేబులు గుల్ల కావటం గ్యారెంటీ.

హైదరాబాద్‌లోని వాహనదారులకు బిగ్ అలెర్ట్. ఇక నుంచి హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా.. అర్జెంట్ పనుందనో, ఇక్కడే కదా అనో రాంగ్ రూట్‌లో వెళ్లినా.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం (నవంబర్ 05) నుంచి నగరంలో భారీ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల నగరాల్లో గత 3 రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒక మహిళతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డట్టుగా అడిషినల్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ వివరించారు. ఈ ప్రమాదాల్లోని మూడింటిలో.. బాధితులు ఐఎస్‌ఐ స్టాండర్డ్ హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేటి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు చేస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానాను పెంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు వాహన జరిమానా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలో రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్ట్‌ సీరియస్‌ అయిన నేపథ్యంలో.. ట్రాఫిక్ పోలీసులు ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది ఇప్పటివరకు 215 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. అందులో 100 మంది బాధితులు ద్విచక్ర వాహనదారులేనని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇది మొత్తం మరణాల్లో 46 శాతమని పోలీసులు పేర్కొన్నారు. అందులోనూ వారు హెల్మెట్ ధరించకపోవడం వల్లే మరణించినట్టుగా తేలినట్టు వివరించారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయమయ్యే ప్రమాదాన్ని 70 శాతం, మరణాల ప్రమాదాన్ని 40 శాతం తగ్గిస్తుందని విశ్వప్రసాద్ తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు 3 రెట్లు పెరుగుతాయని వివరించారు.

మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం హెల్మెట్ ధరించని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉల్లంఘనలకు సెక్షన్లు, జరిమానాలు ఇవే..:

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం MV చట్టంలోని సెక్షన్ 129/177 ప్రకారం ఉల్లంఘన

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినవారికి రూ.200 జరిమానా

MV చట్టంలోని సెక్షన్ 119/177 , 184 ప్రకారం రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్ చేయడం శిక్షార్హం

రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినవారికి రూ.2000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్

రాహుల్ గాంధీకి దమ్ముంటే ఇప్పుడు తెలంగాణ యాత్ర చేయాలి

గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని... ఆయనకు దమ్ముంటే ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ యాత్ర చేయాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాకే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు.

హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు.

వాటిని అమలు చేయకుండా ఈ రోజు తెలంగాణకు వస్తున్నారని... అందుకే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ నేతలు అయినా...

ఈ దేశంలో తిరిగే హక్కు ఉందని... కానీ హామీలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రాహుల్ గాంధీపై ఉందన్నారు.

జేసీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా.. హైలెట్ అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సైతం ఇప్పుడు ప్రధాన వార్తల్లో నిలిచాయి. కొంత మంది మహిళలతో మాట్లాడిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా.. హైలెట్ అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సైతం ఇప్పుడు ప్రధాన వార్తల్లో నిలిచాయి. కొంత మంది మహిళలతో మాట్లాడిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు. మరి ఆయన ఎందుకలా అన్నారు? కలెక్టర్ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ కథనంలో..

తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి.. మహిళలతో మాట్లాడారు. మండలానికి గోకులం షెడ్లు వచ్చాయని, వాటిని తమకు ఇప్పించండి అని పలు గ్రామాల నుంచి మహిళలు వచ్చి ఆయనకు విన్నవించారు. దీంతో ‘మీరు అభివృద్ధి చెందుతామంటే కలెక్టర్ కాళ్లు పట్టుకుని అయినా ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు గోకులం షెడ్లు మంజూరు చేయాలని కోరతా’ అని ప్రభాకర్ రెడ్డి వారితో అన్నారు. పది ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా తన వద్దకు వస్తున్నారని, తమ పిల్లలకు అల్ట్రాటెక్, అర్దాస్ ప్యాక్టరీల్లో ఉద్యోగం ఇప్పించాలని కోరడం బాధ అనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం పరిశ్రమల్లో రూ.10వేల నుంచి 15 వేలు మాత్రమే ఇస్తున్నారని, కానీ పది ఎకరాల భూమి ఉండి పండించుకోలేక పిల్లలను తల్లిదండ్రులు ఎందుకు చిన్న జీతాలకు పంపుతున్నారో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సరే.. కష్టపడి పనిచేసి ఆర్థికంగా ఎదగాలని ఆయన అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమైందని జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు లా అండ్ ఆర్డర్‌ను గాలికి వదిలేశారని, ఇది కేవలం రాజకీయం, ధనప్రభావం వల్లే జరిగిందని ఆరోపించారు.

ఐఏఎస్, ఐపీఎస్, న్యాయాధికారులు, న్యాయవాదులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయాన్ని కాపాడేవిధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి వాహన లైఫ్ ట్యాక్స్ కట్టించుకుంటే రోడ్డు ప్రమాదాల్లో తగిన భద్రత ఉంటుందని, కనీసం ఐదారేళ్లకు ఒకసారి అయినా రోడ్డుటాక్స్ కట్టించుకోవాలని హోంశాఖ, రవాణాశాఖ మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.

ఆటోలో ప్రయాణించిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా ప్రాంతానికి ఆయన ఆటోలో చేరుకున్నారు. కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. ఆయన ఆటోలో కూర్చొని వెళుతుండగా కొంతమంది కార్యకర్తలు, అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి పోటీపడ్డారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు.

మహాలక్ష్మి స్కీంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిని వెంటనే అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. యాప్‌లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ వీలర్లను నిషేధించాలని కోరుతున్నారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

జెత్వానీ కేసు.. సుప్రీంను ఆశ్రయించిన విద్యాసాగర్

ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.

ముంబై నటి కాదంబరి జెత్వానీ (Mumbai Actress Jethwani) వ్యవహారంలో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. తన అరెస్టును సమర్ధిస్తూ... ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గత నెల 10న ఇచ్చిన తీర్పును సుప్రీంలో విద్యాసాగర్ సవాల్ చేశారు. విద్యాసాగర్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. ట్రయల్‌ కోర్టులో ఇప్పటికే బెయిల్‌ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టుకు విద్యాసాగర్‌ తరపు న్యాయవాదులు చెప్పారు. బెయిల్‌ అప్లికేషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని విద్యాసాగర్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. మూడు వారాల్లో బెయిల్‌ అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని లోయర్‌ కోర్టుకు ధర్మాసనం మార్గదర్శకాలు ఇచ్చింది. అలాగే ప్రతివాదులకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను గతంలో హైకోర్టులో విద్యాసాగర్ సవాల్ చేయగా.. అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ‘‘పిటిషనర్‌ అరెస్టు విషయంలో చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదు.. అరెస్టుకు కారణాలను ఆయనకు వివరించలేదు. బంధువులకు తెలియజేయలేదు. అరెస్టుకు కారణాలను రిమాండ్‌కు ముందు ఆయనకు అందజేశారు. రిమాండ్‌ ఆర్డర్‌లో కూడా వీటి ప్రస్తావన లేదు.. అందుచేత రిమాండ్‌ ఉత్తర్వులు చెల్లుబాటు కావని, వాటిని కొట్టివేయాలి’’ అంటూ విద్యాసాగర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అరెస్టు చేసేటప్పుడు నిందితుడిపై ఎవరు ఫిర్యాదు చేశారు.. ఏ కారణంతో అరెస్టు చేస్తున్నామో వారు వివరించారని.. అరెస్టు చేస్తున్న విషయాన్ని ఆయన స్నేహితుడికి కూడా తెలియపరిచారని వివరించారు. అరెస్టుకు కారణాలు చెప్పలేదని, పోలీసులు చట్టనిబంధనలు అనుసరించనందున రిమాండ్‌ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్న విద్యాసాగర్‌ వాదనలో అర్థం లేదని ఏజీ తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం విద్యాసాగర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

మరోవైపు నటి జెత్వానీ కేసులో సీఐడీ విచారణకు కూడా ప్రారంభమైంది. ఈకేసును సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో డీజీపీ, ఐజీ, డీఐజీ ర్యాంక్ అధికారులు ఉన్న నేపథ్యంలో వీరందరినీ విచారించాలంటే సీఐడీ అప్పగించడమే సమంజసమని సర్కార్ భావించింది. దీంతో సీఐడీ అధికారులు తమ పనిని మొదలుపెట్టారు. ముందుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొదటి రోజు విచారణలో భాగంగా జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డు చేశారు.

సుప్రీంకోర్ట్ చారిత్రాత్మక తీర్పు

ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల పరిధి ఎంతవరకు అనే అంశంపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అన్నీ ప్రైవేటు ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు ఉండబోవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేసేందుకుగానూ అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోజాలవని స్పష్టం చేసింది.

ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల పరిధి ఎంతవరకు అనే అంశంపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అన్నీ ప్రైవేటు ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు ఉండబోవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేసేందుకుగానూ అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోజాలవని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు 9 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం 8:1 మెజారిటీతో ఈ తీర్పు ఇచ్చింది.

ఈ కీలక తీర్పుని సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బీ) ప్రకారం ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను రాష్ట్రం స్వాధీనం చేసుకునే హక్కు లేదన్నారు. ఈ మేరకు గతంలో జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పును మెజారిటీ తీర్పు తోసిపుచ్చింది.

ఆర్టికల్ 39(బీ) ప్రకారం ప్రైవేట్ ఆస్తులను ‘సమాజ ముఖ్య వనరులు’గా పరిగణించవచ్చా?, పంపిణీ కోసం ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవచ్చా? అనే న్యాయపరమైన ప్రశ్నలపై సీజే చంద్రచూడ్‌తో పాటు మరో ఏడుగురు న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పుఇచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్రాలు అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చంటూ గతంలో వెలువడిన అన్ని తీర్పులను జడ్జిలు తోసిపుచ్చారు.

కేవలం భౌతిక అవసరాలే అర్హతగా.. ఒక వ్యక్తికి చెందిన అన్ని ప్రైవేటు వనరులను కమ్యూనిటీ మెటీరియల్ రిసోర్స్‌గా పరిగణించకూడదని భావిస్తున్నాం. సందేహాస్పద వనరు గురించిన విచారణ రాజ్యాంగంలోని 39బీ నిబంధన కిందకు వస్తుంది. వనరుల స్వభావం, లక్షణాలు, సమాజానికి ఎంతవరకు ఉపయోగకరం, వనరుల కొరత, వనరుల పరిణామాలు వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతం (Public trust doctrine) సమాజానికి సంబంధించిన వనరుల పరిధిలోకి వచ్చే ఆస్తులను గుర్తించడంలో దోహదపడుతుంది’’ అని సీజే చంద్రచూడ్ పేర్కొన్నారు.

లాభాల్లో హైదరాబాద్‌ విమానాశ్రయం

జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి...

జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి ఈ విమానాశ్రయం డివిడెండ్‌ చెల్లిస్తుందని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) సౌరబ్‌ చావ్లా ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికకు తెలిపారు. మరో రెండు మూడేళ్లలో తమ నిర్వహణలోని ఢిల్లీ ఎయిర్‌పోర్టూ లాభాల బాటపడుతుందన్నారు. అలాగే హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెజ్‌లు, కార్యాలయ భవనాలు, విద్యా సంస్థలు, సీనియర్‌ సిటిజన్ల నివాస వసతుల కల్పన కోసం రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపడుతున్నట్టు చావ్లా వెల్లడించారు.

దీనికి తోడు వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో 1,400 ఎకరాలు, ఢిల్లీ, గోవా ఎయిర్‌పోర్టులోని 200 ఎకరాలు, కొత్తగా ఏర్పాటు చేసే భోగాపురం ఎయిర్‌పోర్టులో 200 ఎకరాల్లో కొత్త వసతులు, నిర్మాణాలు చేపట్టి.. వాటి నుంచీ పెద్దఎత్తున ఆదాయ ఆర్జనకు కృషి చేస్తామని చావ్లా తెలిపారు. హైదరాబాద్‌, ఢిల్లీ విమానాశ్రయాల ఆధునీకరణ కోసం ఇప్పటి వరకు రూ.12,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.

అప్పుల భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం తాము పని చేస్తున్నట్టు సౌరభ్‌ చావ్లా తెలిపారు. ఇటీవల అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (ఏడీఐఏ) సమకూర్చిన రూ.6,300 కోట్ల దీర్ఘకాలిక రుణంతో కంపెనీకి పెద్ద మొత్తంలో వడ్డీలు, అప్పుల చెల్లింపుల భారం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం కంపెనీ అప్పులు- స్థూల లాభం నిష్పత్తి 6 శాతంగా ఉంది. విమానాశ్రయేతర ఆదాయాల పెంపు చర్యలు, ఏడీఐఏ సమకూర్చిన రుణాలతో వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ఇది 3.5 నుంచి 5 శాతానికి తగ్గే అవకాశం ఉందని చావ్లా చెప్పారు.

ఘనంగా నాగుల చవితి వేడుకలు

నాగుల చవితి అంటే నాగదేవతలను ఆరాధించే పండుగ. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు అంటే చతుర్థినాడు నాగుల చవితిని జరుపుకుంటారు హిందువులు. కార్తీక మాసంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి ప్రధాన పండుగ. అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు.

నగరంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చోడవరం నాగేంద్ర స్వామిదేవాలయం, అయ్యప్ప నగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకాలు చేస్తున్నారు. నాగుల చవితి సందర్భంగా దేవాలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోస్తుంటారు.

నాగుల చవితి అంటే నాగదేవతలను ఆరాధించే పండుగ. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు అంటే చతుర్థినాడు నాగుల చవితిని జరుపుకుంటారు హిందువులు. కార్తీక మాసంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి ప్రధాన పండుగ. అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతమంది ఇంట్లో నాగదేవత విగ్రహం పెట్టి పూజలు చేస్తారు. కానీ కొన్ని ప్రదేశాలలో భక్తులు పాము పుట్ట వద్దకు వెళ్లి నైవేద్యం సమర్పించి ఇతర పూజలు చేసి పాలు పోస్తారు. నాగుల చవితి సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి నాగపూజను చేస్తారు. అలాగే ఆలయాల్లోని పుట్ట వద్దకు పాలు పోసి, నైవేద్యం సమర్పిస్తారు. తమ సంతానాన్ని క్షేమంగా ఉండాలని మహిళలు నాగపూజను ఆచరిస్తారు. పాలు, కుంకుడు, పసుపు, విభూతి, బెల్లం, నల్ల నువ్వుల మిశ్రమంతో చేసిన తీపి పదార్ధాలతో పాలు బెల్లం, తెల్ల నువ్వులు, ఉడకబెట్టని మిశ్రమంతో తయారు చేసి పుట్టల వద్ద నైవేద్యంగా ఉంచుతారు. అలాగే కొంతమంది గుడ్లను కూడా పుట్ట వద్ద ఉంచుతారు. నాగదేవత పుట్టపై పసుపు, కుంకుమ్మ వేసి పూలు పెడతారు. దీపం వెలిగించి తమతో తెచ్చుకున్న నైవేద్యాన్ని పుట్ట వద్ద ఉంచుతారు. పూజ అనంతరం కొంచెం పుట్ట మన్ను ను తీసుకుని వెళ్తారు మహిళలు. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని ఆరాధిస్తే సకల రోగాలు తొలగిపోయి ఆరోగ్యంవంతులం అవుతారమని భక్తుల విశ్వాసం.

అలాగే నాగుల చవిత నాడు ఏ సమయంలో పుట్టకు పాలు పోయాలి, చవితి ఘడియలు ఎప్పుడు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చవితి ఘడియలు నిన్న (నవంబర్ 4) రాత్రి 8:53 గంటల నుంచి ప్రారంభమై ఈరోజు (మంగళవారం) రాత్రి 9:25 గంటలకు ముగియనున్నాయి. అంటే ఈరోజు మొత్తం కూడా చవిత ఘడియలు ఉన్న నేపథ్యంలో మంగళవారం నాడు నాగుల చవితిని జరుపుకోవాలి. ఈరోజు ఉదయం 8:21 గంటల నుంచి 9:16 గంటల వరకు పుట్టలో పాలు పోయవచ్చని.. వర్జ్యం, దుర్ముహూర్తాలు లేకుండా పుట్టలో పాలు పోయవచ్చని పురోహితులు చెబుతున్నారు. మరోవైపు తిరుమలలో కూడా చవితి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు దర్శనమివ్వనున్నారు.

కేసులు కొట్టివేయండి

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం, ముత్తుకూరు పోలీసులు తనపై నమోదు చేసిన రెండు వేర్వేరు కేసులను కొట్టివేయాలని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం, ముత్తుకూరు పోలీసులు తనపై నమోదు చేసిన రెండు వేర్వేరు కేసులను కొట్టివేయాలని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ వద్ద విచారణకు రానున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై అసత్యాలు ప్రచారంతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముత్తుకూరు పోలీసులు కాకాణి పై కేసు నమోదు చేశారు.

అలాగే పత్రికా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని వెంకటాచలం మండలం టీడీపీ నాయకులు కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.