/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఢిల్లీలో దారుణంగా వాయు నాణ్యత Raghu ram reddy
ఢిల్లీలో దారుణంగా వాయు నాణ్యత

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకూ పడిపోతోంది. దీపావళి సందర్భంగా ప్రభుత్వం పటాకులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయకుండా పెద్దమొత్తంలో బాంబులను కాల్చడంతో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకూ పడిపోతోంది. దీపావళి సందర్భంగా ప్రభుత్వం పటాకులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయకుండా పెద్దమొత్తంలో బాంబులను కాల్చడంతో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్‌ (Delhi – NCR) ప్రాంతంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300కి పైనే నమోదవుతోంది. ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (SAFAR) సంస్థ ప్రకారం.. ఇది చాలా ఆధ్వాన్నమైన స్థాయిలో ఉన్నట్లు. ఈ కారణంగా ఢిల్లీతోపాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో ప్రజలు విష వాయువులను పీల్చుకుంటున్నారు. తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు

దేశ రాజధానిలో దీపావళి రాత్రి అధిక స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ రీడింగ్‌లు గరిష్ఠ సాయి 999కి చేరాయి. దీని కారణంగా ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంత ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను నివేదించినట్లు ఓ సర్వే తాజాగా వెల్లడించింది. 69 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గొంతునొప్పి, దగ్గుతో సహా కాలుష్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సదరు సర్వే నివేదించింది.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ ఈ సర్వే నిర్వహించింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో 21 వేల కంటే ఎక్కువ మందిపై సర్వే చేసింది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా 62 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కళ్ల మంటలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. 46 శాతం మంది ముక్కు కారటం వంటి సమస్యలు నివేదించారు. ఇక 31 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా ఆస్తమా ఉన్నట్లు తెలిపారు. మరో 31 శాతం మంది తలనొప్పిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

23 శాతం మంది ఏకాగ్రతను కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేయగా.. 15 శాతం మంది నిద్రపోతున్న సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. అయితే, 31 శాతం మంది మాత్రం కాలుష్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులనూ నివేదికంకపోవడం విశేషం. రాజధాని వాసులు చాలా మంది ఇప్పటికే దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రోన్కైటిస్‌ క్రానిక్‌, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. రానున్న రోజుల్లో ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు మరింత దిగజారే అవకాశం ఉందని సదరు సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక ఇదే సర్వే.. రాజధానిలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవుతున్నారని ఢిల్లీ వాసులను ప్రశ్నించింది. 10,630 మందిలో 15 శాతం మంది ఈ సీజన్‌లో నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరో 9 శాతం మంది రోగనిరోధక శక్తి పెరిగే ఆహారాలు, పానీయాలు తీసుకుంటూ ఇంటి పట్టునే ఉండాలనుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు. మరో 23 శాతం మంది ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించాలని యోచిస్తున్నారు. కొందరు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరికొందరు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.

తెలంగాణ సీఎం మార్పు వార్తలపై మంత్రి పొంగులేటి

తెలంగాణ సీఎం కుర్చీ మార్పు వార్తలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి పీరియడ్ ఇంకా నాలుగేండ్ల ఒక నెల ఉందని.. పూర్తి కాలం రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.

తెలంగాణలో సీఎం మార్పుపై గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పందించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ సీఎం మార్పు ఉండదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి పీరియడ్ ఇంకా నాలుగేండ్ల ఒక నెల ఉందని.. పూర్తి కాలం రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని తెలిపారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అవి టీ కప్పులో తుఫాను మాత్రమే అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోస్తామన్నారు. గ్రామ సభలు పెట్టి ఇండ్లను మంజూరు చేస్తామని.. నాలుగు విడతల్లో 5 లక్షలు పేమెంట్ చేస్తామన్నారు. ఫౌండేషన్ లెవల్‌కు లక్ష, లెంటల్ లెవల్‌కు 1.25 లక్షలు, స్లాబ్ లెవల్‌కు 1.75 లక్షలు, పూర్తి అయ్యాక లక్ష చెల్లిస్తామన్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉంటుందన్నారు. సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఇండ్లకు కూడా సహాయం చేస్తామన్నారు. ఈ నెల 20లోపు ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాను పంపిస్తాయన్నారు.

ఈ నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి అవుతుందని వెల్లడించారు. ఆ వెంటనే ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తామన్నారు. కేంద్ర గృహ నిర్మాణ స్కీం అడాప్ట్ చేసుకుంటున్నామని.. పేద ప్రజలకు అన్యాయం జరగొద్దని కేంద్రం ఎన్ని కండిషన్‌లు పెట్టినా ఒప్పుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కేంద్రం లోగో పెట్టుకోవడానికి కూడా ఒప్పుకున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజలకు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

రాబోయే నాలుగేళ్లు 20 లక్షల ఇండ్ల నిర్మాణం టార్గెట్ పెట్టుకున్నామని.. తల తాకట్టు పెట్టైనా పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మొదటి విడత ఇండ్లకు 26 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. సంక్రాంతి పండగ ముందు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్లు

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారింది. కాగా.. బీఆర్ఎస్‌పై ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతకాలన్ని తమ దగ్గరున్నాయని.. తాను నోరు విప్పితే తట్టుకోలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. నిన్నటివరకు మిత్రులుగా ఉన్నవాళ్లు కూడా తెల్లారే సరికి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ శత్రువులుగా మారిపోతుండటం చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు అచ్చంగా అదే జరిగింది తెలంగాణలో కూడా. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయని ఎంఐఎం నేతలు.. ఇప్పుడు మెల్లగా అది కూడా మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలపై ఏకంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

శనివారం (నవంబర్ 02న) రోజున మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. బీఆర్ఎస్ జాతకాలన్ని తమ దగ్గరున్నాయని.. అవన్ని చేప్తే వాళ్లు తట్టుకోలేరంటూ కీలక కామెంట్లు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా.. ఆ ప్రణాళిక వద్దని నేను చెప్పలేదా అంటు అసదుద్దీన్ ప్రశ్నించారు. అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా అని అడిగిన అసదుద్దీన్.. తాను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడతారంటూ హెచ్చరించారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని సూచించారు.

బీఆర్ఎస్ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ వల్లే ఎక్కువ సీట్లు వచ్చాయని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. ఎంఐఎం మద్దతుతోనే ఎక్కువ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని తెలిపారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు చాలా అహంకారం ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. ఎక్కువ మంది సంతానం ఉండాలని చంద్రబాబుతో పాటు స్టాలిన్‌ కూడా అంటున్నారని గుర్తు చేసిన అసదుద్దీన్.. అదే విషయాన్ని తాను చెప్పి ఉంటే ఎక్కడలేని రచ్చ చేసేవారని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత్ దేశంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారన్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టమేనని.. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుందన్నారు. బాగా పనిచేసిన రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభమని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు.

ప్రత్యేక కమిషన్‌’పై సర్కారు అభ్యంతరం

రాష్ట్రంలో కులగణన, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రత్యేక కమిషన్‌ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు తీర్పుపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో కులగణన, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రత్యేక కమిషన్‌ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు తీర్పుపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ నెల 21లోపు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కౌంటర్‌ ఎలా దాఖలు చేయాలన్న అంశంపై అడ్వకేట్‌ జనరల్‌తో ప్రభుత్వ వర్గాలు.. చర్చిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలంటే కులగణన చేయాల్సి ఉంది.

ఈ క్రమంలోనే బీసీ కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం.. కులగణనకు కూడా ఇదే కమిషన్‌ డెడికేటెడ్‌ కమిషన్‌గా ఉంటుందని జీవో 199లో పేర్కొంది. అయితే, ఈ అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

కులగణనకు డెడికేటెడ్‌ కమిషన్‌గా బీసీ కమిషన్‌నే గుర్తించడం సమంజసం కాదని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు పరిచేందుకు కొత్త డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించానలి హైకోర్టు పేర్కొనగా.. దీనిపై తన వాదనను వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం

పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గుంతలు లేని రోడ్లకు నేడు (శనివారం) అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో శ్రీకారం చుట్టామని తెలిపారు. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యారని.. ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గుంతలు లేని రోడ్లకు నేడు (శనివారం) అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో శ్రీకారం చుట్టామని తెలిపారు. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యారని.. ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డారు.

గుంతల రోడ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఎంతోమంది చనిపోయారని అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఐదేళ్లలో రహదారుల కోసం కేవలం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మంచి రోడ్లు నాగరికతకు చిహ్నమని.. అభివృద్ధికి ఆనవాళ్లు మంచి రహదారులు అని చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలన్నారు. వర్షం వస్తే గతంలో రోడ్లు స్విమ్మింగ్ ఫూల్‌ను తలపించే విధంగా ఉన్నాయన్నారు. రౌడీ రాజకీయాలు వద్దని.. అభివృద్ధి రాజకీయాలు కావాలని వెల్లడించారు.

‘‘నేను ఎక్కడకు వెళ్ళినా పరదాలు లేవు, చెట్లు కొట్టడం లేదు. మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మంచి రోడ్లు వస్తాయి’’ అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను, మద్యాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నారు. డబ్బులు ఊరికనే రావు... సంపద సృష్టిస్తే డబ్బులు వస్తాయన్నారు. రూ.860 కోట్లు తో రాష్ట్రంలో మొత్తం గుంతలు పూడుస్తున్నామన్నారు. రాష్ట్రంలో జగన్ విధ్వంసం సృష్టించారన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను...గాడిలో పెడతానని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని రోడ్లు వేస్తామని ఇందుకోసం ఒక పక్కా ప్రణాళిక వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

మరోవైపు విశాఖపట్నం పూర్ణ మార్కెట్ రామకృష్ణ థియేటర్ వద్ద గుంతల పూడ్చివేత కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గుంతలేని రహదారి కోసం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో రోడ్ల కోసం జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసిందని గుర్తుచేశారు. వైసీపీ కారణంగా ఈరోజు రోడ్లు గుంతలు పూడ్చుకునే స్థాయికి దిగజారాల్సి వచ్చిందన్నారు. ప్రజల సురక్షితవంతమైన ప్రయాణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు

వచ్చే సంక్రాంతి నాటికి రూ.600 కోట్లతో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని విమర్శించారు. గత ఐదు సంవత్సరాల పాలనలో అద్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామన్నారు. జగన్ పాలనలో మ్యాప్‌ను చూసి కాకుండా గుంతల రోడ్లను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించే స్థాయికి జగన్ దిగజార్చారంటూ మంత్రి రామానాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచి వైట్‌హౌస్‌లో అడుగుపెడతారు అని అమెరికా మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం ఇప్పటికే సంబరాలు చేస్తున్నారు. కమలా హారిస్ గెలవాలంటూ ఆ గ్రామంలో పూజలు కూడా చేస్తున్నారు. ఆ గ్రామం మొత్తం కమలా హారిస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అది కమలా హారిస్ తాత పుట్టిన ఊరు.

నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో ఉండగా.. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 3, 4 రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో కమలా హరిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుండటంతో.. ఎవరు గెలుస్తారనేది అన్ని దేశాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కమలా హారిస్ పూర్వీకుల గ్రామం అయిన మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తులసేంద్రపురంలో మాత్రం ఇప్పటికే సంబరాలు ప్రారంభం అయ్యాయి. తులసేంద్రపురం మొత్తం కమలా హారిస్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలవాలని తులసేంద్రపురంలో పూజలు నిర్వహిస్తున్నారు.

కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ భారతీయురాలు. శ్యామల తండ్రి గోపాలన్‌ తమిళనాడులోని తులసేంద్రపురంలో పుట్టారు. గోపాలన్ భారత ప్రభుత్వ అధికారిగా పలు హోదాల్లో పని చేశారు. కమలా హారిస్‌ తల్లి శ్యామల గోపాలన్.. 19 ఏళ్ల వయసులో ఉన్నపుడు పై చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్కడ శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్‌పై అనేక పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారిస్‌ను శ్యామల గోపాలన్ పెళ్లి చేసుకున్నారు. డొనాల్డ్ హారిస్, శ్యామల గోపాలన్‌లకు పుట్టిన తొలి బిడ్డనే కమలా హారిస్‌. తాను చిన్నతనంలో ఉన్నపుడు భారత్‌లోని తన అమ్మమ్మ, తాతయ్యలను కలిసినట్లు ఇటీవల కమలా హారిస్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కమలా హారిస్‌ గెలవాలని తులసేంద్రపురం స్థానికులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఆ గ్రామంలో పలుచోట్ల కమలా హారిస్ ఫ్లెక్సీలు వెలిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేయడం చారిత్రాత్మకమైనదని.. అది తమకు ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా తులసేంద్రపురంవాసులు వెల్లడించారు.

2014లో కమలా హారిస్ బంధువులు.. ఆమె పేరు మీద తులసేంద్రపురంలోని 300 ఏళ్ల నాటి గుడికి భారీగా విరాళం ఇచ్చారు. ఆ గుడి శిలాఫలకాలపైనా కమలా హారిస్‌ పేరు చెక్కించారు. ఇక స్థానికంగా ఉన్న వాటర్‌ ట్యాంక్‌కు కమలా హారిస్‌ పేరు పెట్టడం విశేషం. అంతేకాకుండా త్వరలో తులసేంద్రపురంలో నిర్మించే బస్‌స్టాండ్‌కు కమలా హారిస్ పేరు పెట్టాలని స్థానికులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమ ఊరి మూలాలు ఉన్న కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన సమయంలోనూ ఆమె గెలవాలని కోరుకుంటూ తులసేంద్రపురంవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: కేటీఆర్‌

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరుపై మ‌రోసారి ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయన్నారు. ప్రజాస్వామిక తెలంగాణలో మరోసారి ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయని దుయ్య‌బ‌ట్టారు. 

ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. ఇది నియంతృత్వ రాజ్యమని, ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తుందని ఫైర్ అయ్యారు.

హక్కులను అడిగితే బెదిరింపులకు పాల్పడుతారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోరాటం తెలంగాణకు కొత్తకాదని, ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉంద‌ని పేర్కొన్నారు. 

ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్ధరణకై పోరాడుతామన్నారు. హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ అమలులో ఉండగా, 13 జిల్లాల్లో అధికారికంగా, 20కిపైగా జిల్లాల్లో అనధికారికంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు.

ఎక్స్‌లో సీఎం రేవంత్ సంచలన పోస్ట్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌ వేదికగా సంచలన పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రియమైన మోదీ జీ అంటూ తమరు చేసిన అవాస్తవాలపై స్పష్టత ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన సీఎం.. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చేసిన వ్యాఖ్యలపై ధీటైన సమాధానం ఇచ్చారు. కేంద్రం చేసిన అవాస్తవాలపై స్పష్టత ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో చీకట్లను తరిమేసి వెలుగులు నింపామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ఇలా తదితర అంశాలను వివరిస్తూ ఎక్స్‌‌లో పోస్టు చేశారు సీఎం. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఆనందం వెల్లువిరుస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే రెండు వాగ్దానాలను నెరవేర్చామని.. 11 నెలల్లోనే దాదాపు 50వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని సీఎం రేవంత్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ప్రియమైన నరేంద్ర మోదీ జీ. నా రాష్ట్రం, నా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు, అవాస్తవాలపై స్పష్టత ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను. డిసెంబర్ 7, 2023 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఆనందం ఆశలు వెల్లువెత్తాయి. దశాబ్దం బీఆర్‌ఎస్ దుష్పరిపాలన పోయి ప్రజల్లో సంతోషం వెల్లివిరిసిందన్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే, తెలంగాణ ప్రభుత్వం మొదటి, రెండవ వాగ్దానాన్ని నెరవేర్చింది. అన్ని టీజీఎస్‌ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి కవరేజీని విడుదల చేసింది. గత 11 నెలల్లో తెలంగాణాలోని సోదరీమణులు, తల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు. రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఒక సంవత్సరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 3,433.36 కోట్లు ఖర్చు చేశాం. మా మొదటి సంవత్సరం పూర్తి కాకముందే, మేము రైతులకి భరోసా ఇస్తూ రైతు రుణమాఫీని అమలు చేశాం. 22 లక్షల 22 వేల మంది రైతులు (22,22,365) ఇప్పుడు ఎలాంటి రుణం లేకుండా, రాజులా జీవిస్తున్నారు. రూ. 2,00,000 వరకు రైతుల రుణాలన్నీ మాఫీ చేయబడ్డాయి. 25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం’’ అని సీఎం చెప్పుకొచ్చారు.

ఇళ్లకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఛార్జీ లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీంతో మహిళలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఎక్కువగా ఉంటే, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం రూ.500 కే సిలిండర్‌ లభిస్తుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా హయాంలో ఇప్పటివరకు 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ రీఫిల్‌లు జరిగాయి. 42,90,246 మంది లబ్ధిపొంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువత కోసం ఉద్యోగ నియామకాలను చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించింది. అన్ని స్థాయిల పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలను 11 నెలల కంటే తక్కువ సమయంలో నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 మంది అర్హులైన యువతకు ఉద్యోగాలు కల్పించింది. ఇది ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేయని రికార్డు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంగా పాఠశాల విద్యార్థులను విస్మరించింది. దశాబ్దం తర్వాత సంక్షేమ హాస్టళ్లలో పేద పిల్లలకు మెస్, కాస్మోటిక్ చార్జీలను 40 శాతానికి పైగా పెంచాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుభ్రం చేసి పునర్వైభవం తీసుకొస్తున్నాం. గత 10 ఏళ్లలో ఆక్రమణలకు గురై, ధ్వంసం చేసిన మా సరస్సులు, నాలాలు విలువైన నీటి వనరులను కూడా మేము పరిరక్షిస్తున్నాం.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అంగుళం సరస్సు కూడా ఆక్రమణకు గురికాలేదు. అలాగే మేము ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నాం. మాస్టర్‌ప్లాన్ ఖరారు చేయబడుతోంది. మేము యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, YI స్పోర్ట్స్ యూనివర్శిటీ, YI ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం బాల్ రోలింగ్‌ను సెట్ చేశాం. గత 11 నెలల్లో మేము తెలంగాణలో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపాం’’ అని రేవంత్‌ రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.

బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు షాక్

ఇటీవలి కాలంలో దేశంలో సంచలనం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు బిగ్ షాక్ తగిలింది. లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉండగా.. అతడి సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, ఫ్రెండ్ గోల్డీ బ్రార్‌లు విదేశాల నుంచి మొత్తం గ్యాంగ్‌ను నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్మోల్ బిష్ణోయ్‌ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్మోల్ బిష్ణోయ్ గురించి భారత్‌ను అమెరికా అలర్ట్ చేయడంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు.

సల్మాన్ ఖాన్‌కు వరుస బెదిరింపులు.. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీల హత్యలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌ ఆట కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. గత కొన్నేళ్లుగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే జైలులోకి అక్రమంగా సెల్‌ఫోన్లు వెళ్తుండగా.. ఫోన్ల ద్వారానే బయట ఉన్న తన గ్యాంగ్‌ను లారెన్స్ బిష్ణోయ్ నడిపిస్తున్నాడు. ఇందుకు తన ఫ్రెండ్ గోల్డీ బ్రార్, సోదరుడు అన్మోల్ బిష్ణోయ్.. సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అన్మోల్ బిష్ణోయ్ గురించి అమెరికా అలర్ట్ చేయడంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అన్మోల్‌ బిష్ణోయ్‌ని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలను ముంబై పోలీసులు మరింత వేగవంతం చేశారు.

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్ ఇంటి ముందు కొన్ని నెలల క్రితం కాల్పులు జరిపిన ఘటన సహా వివిధ కేసుల్లో అన్మోల్‌ బిష్ణోయ్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవలె ముంబై, సహా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితులతో కూడా అన్మోల్ బిష్ణోయ్‌ టచ్‌లో ఉన్నట్లు ముంబై పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే అన్మోల్ బిష్ణోయ్‌ని భారత్‌కు రప్పించేందుకు అనుమతి కోరుతూ గత నెల ముంబై పోలీసులు ప్రత్యేక కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

లారెన్స్‌ బిష్ణోయ్ తరఫున అన్మోల్ బిష్ణోయ్ పలు నేరాల్లో పాలుపంచుకున్నట్లు కోర్టుకు ముంబై పోలీసులు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే అన్మోల్‌ బిష్ణోయ్ జాడను అమెరికా అధికారులు.. భారత్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు.. అన్మో్ల్ బిష్ణోయ్‌ని ఎలాగైనా భారత్‌కు తీసుకురావాలనే ప్రయత్నాలను ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకోవడం సంచలనం రేపింది. ఈ కాల్పుల ఘటనకు బాధ్యులం తామే అంటూ అన్మోల్‌ బిష్ణోయ్ ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. విచారణలో భాగంగా అన్మోల్ బిష్ణోయ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అలాగే 2022లో ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులోను అన్మోల్ బిష్ణోయ్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

అంతేకాకుండా అన్మోల్ బిష్ణోయ్‌పై సుమారు 18 కేసులు ఉన్నట్లు ముంబై పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అన్మోల్‌ బిష్ణోయ్ భాను అనే పేరుతో ఫేక్ పాస్‌పోర్టును ఉపయోగించి భారత్ విడిచి విదేశాలకు పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుల విచారణలో భాగంగా అన్మోల్‌ బిష్ణోయ్ గురించి సమాచారం ఇచ్చినవారికి రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని ఇటీవలె నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ- ఎన్ఐఏ ప్రకటించింది.

సరిహద్దుల్లో చైనా సైనికుల్ని కలిసిన కేంద్రమంత్రి

భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో మూడేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన క్రమంగా తొలగిపోతోంది. గతంలో సరిహద్దుల్లో హోరాహోరీగా మోహరించిన ఇరు దేశాల బలగాలు దాదాపుగా వెనక్కి తగ్గాయి. దీంతో పాటు దీపావళి సందర్భంగా ఇరు దేశాల సైనికులు స్వీట్లు కూడా పంచుకున్నారు. దీనికి కొనసాగింపుగా అన్నట్లు కేంద్రమంత్రి ఒకరు ఇప్పుడు చైనా సైనికులతో సరిహద్దుల్లో బహిరంగంగానే మాట్లాడుతూ కనిపించడం ఆసక్తి రేపుతోంది.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా సరిహద్దుల్లో చైనా సైనికుల్ని కలిశారు. ఇరుదేశాల చెక్ పోస్ట్ వద్ద కిరణ్ రిజిజు చైనా సైనికులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు సరిహద్దుల్లోకి ఆర్మీ ఛీఫ్ వెళ్లే పరిస్ధితులే లేవు.

కానీ ఇప్పుడు ఏకంగా నిరాయుధుడైన కేంద్రమంత్రి చైనా సరిహద్దుల్లో వారి సైనికులతోనే చిట్ చాట్ చేయడం ఇప్పుడు ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల మధ్య మారిన పరిస్ధితులకు నిదర్శనంగా కనిపిస్తోంది.

శత్రునాష్ అనే అక్షరాలతో ఉన్న ఉన్ని టోపీని ధరించి చైనా సైనికులతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంభాషిస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న బుమ్లాలో ఉన్న ఆర్మీ ఫార్వార్డ్ ఏరియాలో ఈ దృశ్యం కనిపించింది. లడఖ్ లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు వెనక్కి తగ్గిన తర్వాత ఓ కేంద్రమంత్రి ఇక్కడకి రావడం ఇదే తొలిసారి.