/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి SGF వాలీబాల్ పోటీలు Mane Praveen
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి SGF వాలీబాల్ పోటీలు
నల్గొండ: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి SGF అండర్ 14, 17 బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్ మరియు సెలక్షన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, క్రీడాకారులందరికి భోజన మరియు మంచినీటి సదుపాయాలు కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి కి SGF పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు నాగరాజు, కవిత, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీదేవి, చంద్రయ్య, సురేందర్, కర్ణాకర్ రెడ్డి,  నుష్రత్, బ్రహ్మయ్య, మురళి, లెనిన్, సావిత్రి, రంగా, బొమ్మపాల గిరిబాబు, తస్లీమ్, రెహనా, శ్రీను, అజయ్ మరియు సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల స్కూల్ గేమ్స్ సెక్రటరీలు మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NLG: స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ కు ఘన సన్మానం
నల్లగొండ: పట్టణంలోని జిల్లా పరిషత్ జడ్పీ గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ కు ఘన సన్మానం నిర్వహించారు. ఈ మేరకు శాలి గౌరారం మండలం ఉట్కూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లాలోని శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

చట్టాలపై పూర్తి అవగాహన సదస్సులు తోపాటు విక్టిమ్స్ కు పూర్తిగా అండగా నిలబడతానని అన్నారు. నేరస్థులకు కచ్చితంగా శిక్ష పడే విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు.

నా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మరియు కమిటీ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు అని, వారి యొక్క సంఘానికి ఎల్లవేళలా సాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్రలోనే పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రధమంగా నియమించబడిన వేముల రంజిత్ కుమార్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు ప్రముఖ వ్యాపారవేత యాట వీరారెడ్డి, కాంగ్రెస్ క్రిస్టియన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కందుల విజయ్ కుమార్, కౌన్సిలర్ పల్లె రంజిత్ కుమార్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, అడ్వకేట్స్ ఏర్పుల కామేశ్వర్, బర్రె సైదులు, మీడియా యూనియన్ నాయకులు మల్లేష్ యాదవ్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, రమేష్, మిత్రాస్ యూనిట్ ఆఫ్ యూత్ చైర్మన్ కంబాలపల్లి శ్రీకాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంట సుమంత్, పుట్ట మహేష్ గౌడ్, నియోజకవర్గ కమిటి అధ్యక్షులు పగడాల శివతేజ, కొండల్, తదితరులు పాల్గొన్నారు.
TG: కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి ఆమోదం

HYD: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగ సందర్భంగా ఒక డీఏ ను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.

హైదరాబాద్‌ లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది. నాగోల్ – శంషాబాద్, రాయదుర్గం – కోకాపేట్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, మియాపూర్ – పటాన్ చెరు, ఎల్ బీ నగర్ – హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలతో సిద్ధం చేసిన డీపీఆర్‌ను కేంద్రానికి నివేదించాలి.

జీవో 317 కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు ఆమోదం.

జీవో 46 కు సంబంధించి కీలకమైన స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున న్యాయ సలహా తీసుకుని శాసనసభలో చర్చించిన తర్వాత నిర్ణయం.

రాష్ట్రంలో నవంబర్ 30 వరకు కుల, ఆర్థిక, సామాజిక గణన సర్వే పూర్తి చేయాలి. ఇందుకోసం 80 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించి నవంబర్ 4 నుంచి 19 వరకు రాష్ట్రమంతా ఇంటింటి సర్వే చేపడుతారు.

రాష్ట్రంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 25 నుంచి 28 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా పీపీపీ విధానంలో పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి.ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి గోషా మహల్ లో పోలీసు శాఖ పరిధిలోని స్థలాన్ని వైద్య శాఖకు బదిలీ.

ములుగులో ప్రతిపాదిత గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల స్థలం కేటాయింపు.గచ్చీబౌలీ స్టేడియాన్ని ప్రతిపాదిత యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి బదలాయింపు. మధిర, వికారాబాద్, హుజూర్ నగర్ ఏటీసీల ఏర్పాటు, కావలసిన పోస్టుల మంజూరు.

దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్ల మంజూరు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోతున్న కారణంగా వాటిల్లో స్టిల్ట్ తొలగించాలని నిర్ణయం. పైలట్ ప్రాజెక్టుగా మొదట కడెం ప్రాజెక్టులో సిల్ట్ తొలగింపు. గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్ల వద్ద పేరుకుపోయిన దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ధాన్యం క్లియరెన్స్ కు సంబంధించి సబ్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆమోదం.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం.

సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.

NLG: సిపిఐ శతవార్షికోత్సవాలను జయప్రదం చేయండి
నల్లగొండ : దోపిడీ లేని వ్యవస్థ కోసం సమ సమాజ స్థాపన కోసం నాడు స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగంలో నిలిచి పోరాడిన పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి అన్నారు.సిపిఐ వంద సంవత్సరాల  సందర్భంగా శనివారం స్థానిక మగ్దూం భవన్ లో, ఉమ్మడి నల్లగొండ జిల్లా సిపిఐ  శతవార్షికోత్సవ రాష్ట్ర ప్రారంభ సభ సన్నాహాక సమావేశం యాద్రది భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అధ్యకతన జరిగింది. ఈ సమావేశానికి పల్లా వెంకట రెడ్డి ముఖ్యతిధిగా హాజరై మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భావించి బ్రిటిష్ ప్రభుత్వం కు వ్యతిరేకంగా పోరాడి, ఎన్నో నిర్బంధాలను కుట్రలను జైలు జీవితాలను ఎదుర్కొని త్యాగలు చేసిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు.

అదేవిదంగా తెలంగాణ ప్రాంతంలో దొరలు,భూస్వాములకు , వ్యతిరేకంగా వెట్టిచాకిరి విముక్తి కోసం,నైజాం ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం నడిపి  4500 మంది అమరత్వం తో లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచి వేలాది గ్రామాలను రజాకార్ల కబంధాస్తాల నుండి విముక్తి కలిగించిందన్నారు. 

పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తూ అనేక పోరాటాలకు నాయకత్వం వహిస్తుందన్నారు.  పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలని దశాబ్దాల కాలంగా జిల్లా ప్రజలను పట్టి  పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అనేక దపాలుగా పోరాటాలు  నిర్వహించిందన్నారు.

దేశంలోసిపిఐ ఏర్పడి వంద సంవత్సరాలలో అడుగుపెడుతున్న సందర్భంగా  నల్లగొండ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 30వ తేదీన  రాష్ట్ర స్థాయి ప్రారంభ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది అన్నారు.

ఈ సమావేశంలో  నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, సినియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని యాదగిరావు,నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్,భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి దామోదర్ రెడ్డి ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
NLG: ఎస్.జి.ఎఫ్ క్రీడలకు పూర్తి సహకారం అందిస్తామన్న జిల్లా కలెక్టర్
నల్లగొండ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శిగా నియమింపబడిన దగ్గుపాటి విమల.. శనివారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా దగ్గుబాటి విమల ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి  అభినందించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా ఎస్.జి.ఎఫ్. క్రీడలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, గురుకులాలు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులందరూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని తద్వారా నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే క్రీడలలో మొదటి స్థానం సాధించేలా కృషి చేయాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి బొమ్మపాల గిరిబాబు, యడవెల్లి జెడ్.పి.హెచ్.ఎస్. ఫిజికల్ డైరెక్టర్ నారాయణ, కవిత తదితరులు పాల్గొన్నారు.
TG: కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన గ్రూప్-1 అభ్యర్థి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు

HYD: గ్రూప్ -1 పేపర్ కాపీయింగ్ పై పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్పందించింది.సీవీఆర్ కాలేజ్ గ్రూప్ -1 ఎగ్జామ్ సెంటర్లో ఒక మహిళా అభ్యర్థి అనుమానాస్పదంగా కనిపించిందని.. మహిళా అభ్యర్థి తన ఎడమ చేతి మీద కొన్ని జవాబులు రాసుకొని వచ్చిందని, దీంతో సదరు మహిళా అభ్యర్థిని ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదని తెలిపారు.

కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన మహిళా అభ్యర్థి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు కమిషన్ తెలిపింది.

NLG: కబడ్డీ లో సౌత్ జోన్ కు ఎంపికైన  NG కళాశాల విద్యార్థి
నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బి ఏ తృతీయ సంవత్సరం చదువుతున్న పి. ఉదయ్ కబడ్డీ లో సౌత్ జోన్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ శుక్రవారం  తెలిపారు. త్వరలో చెన్నైలో జరుగనున్న సౌత్ జోన్ పోటీల్లో ఉదయ్ నాగార్జున కళాశాల తరపున పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు కళాశాల అధ్యాపకులతో కలిసి ఉదయ్ ను అభినందించారు.  ఉదయ్ ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో  వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, వ్యాయామ అధ్యాపకులు ఎ. మల్లేశం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి బి. నాగారాజు, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డా. ప్రసన్న కుమార్, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, పాలనాధికారి డి. శ్రావణి, ఎన్ సి సి ఆఫీసర్ సిహెచ్ సుధాకర్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
TG:10 నాణేలు చట్టబద్ధమైనవి.. రోజువారి లావాదేవీలకు ఉపయోగించవచ్చు: జనరల్ మేనేజర్
HYD: రూ.10 నాణేలు  చట్టబద్ధమైనవని.. వీటిని రోజూవారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని, సెంట్రల్ బ్యాక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. వీటి చలామణి ని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కోఠి లోని బ్యాంక్ శాఖ వద్ద రూ.10 నాణేల  చలామణి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ధారాసింగ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. తమ ఖాతాదారులకు ఈ నాణేలు వినియోగించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లోనూ ఇవి చెల్లుబాటు అవుతున్నాయని, ప్రజల్లో రూ.10 నాణేలపై ఉన్న అపోహలను తొలిగించేందుకే ఈ మేళాను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ నాణేలను లావాదేవీలకు చలామణి చేయవచ్చని, రూ.10 నోటు కంటే నాణేం ఎక్కువ కాలం మన్నికతో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులకు రూ.10 నాణేలను అందజేశారు.
NLG: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుపాటి విమల
నల్లగొండ జిల్లా:
నాగార్జునసాగర్ పైలాన్ లో గల ఎస్.వి.ఏ.ఆర్ మోడల్ హైస్కూల్  ఫిజికల్ డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న దగ్గుపాటి విమలను జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు నల్గొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో గల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా దగ్గుపాటి విమల మాట్లాడుతూ జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులను అందరిని కలుపుకొని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను విజయవంతం చేయడానికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జాన్ రెడ్డి, మాజీ ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసుదేవరావు, హాకీ అసోసియేషన్ సెక్రెటరీ ఇమామ్ కరీం, ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు నాతి వెంకట్, వివిధ క్రీడల కోచ్ లు పాల్గొన్నారు.
NLG: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం

నల్లగొండ: ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా.. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది మరియు అమ్మ ఫౌండేషన్ నల్లగొండ టీం పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం కు సంబంధించిన విషయాల గురించి వీరు తయారు చేసిన ప్ల- కార్డులు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం వల్ల జరిగే ఉపయోగాలను అక్కడికి విచ్చేసిన పోలీసులు మరియు వివిధ సంఘాల సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ సభ్యులు 20 మంది రక్తదానం చేశారు. సతీష్, శివ, సంతోష్, పురుషోత్తం, వంశీ, అమృత రాజ్, మహేష్, శ్రీనాథ్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.

ఈ మేరకు అమ్మ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ సిహెచ్ రేఖా మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఇంట్లో ఒక రక్త దాత ను, ఒక సమాజ సేవకుడిని తయారు చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యునికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, స్థానిక డిఎస్పి శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ డానియేలు, ఎస్ఐ నాగరాజు, రూరల్ ఎస్సై సైదాబాబు, మరియు వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిఐ లు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు ఉన్నారు.