/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz జంట’గా గంజాయి విక్రయాలు.. Raghu ram reddy
జంట’గా గంజాయి విక్రయాలు..

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నేరాలబాట పట్టింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)కు చెందిన యాపర్తి గోపి(25), ఉమాహేశ్వరి(24) ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నేరాలబాట పట్టింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)కు చెందిన యాపర్తి గోపి(25), ఉమాహేశ్వరి(24) ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

చిన్నచిన్న పనులు చేసినా ఆదాయం చాలలేదు. గంజాయి సరఫరా చేసే బంధువు శివనాగరాజు వారికి పరిచయమయ్యాడు. అతడు 2 కేజీల నుంచి 5 కేజీల వరకు హోల్‌సేల్‌గా గంజాయి విక్రయించేవాడు.

దాన్ని 200 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి స్కూటీపై దంపతులిద్దరూ హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చి, విక్రయించి వెళ్లిపోయేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు ఎల్‌బీనగర్‌ మెట్రోస్టేషన్‌(LB Nagar Metro Station) వద్ద కాపుకాసి గంజాయి విక్రయిస్తున్న గోపి, ఉమాహేశ్వరి దంపతులతోపాటు కొనుగోలు చేస్తున్న నాగోలుకు చెందిన ప్రభుచరణ్‌(23), నగేష్(24)లను అదుపులోకి తీసుకొని ఎల్‌బీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

వారి నుంచి సుమారు కిలో గంజాయి, 3 సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం - కేంద్రానికి లేఖ, కీలక మలుపు..!!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణానికి సంబంధించి సూత్రపాయంగా ఆమోదం లభించింది .ఈ మేరకు కేంద్రానికి ప్రపంచ బ్యాంకు నుంచి లేఖ అందింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే ఈ మొత్తం సీఆర్డీఏకు అందనున్నాయి. అదే సమయంలో ఏపీకి రుణంగా ఇస్తున్న ఈ మొత్తం లోనూ కేంద్ర వాటా పైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్ లో రూ 15 వేల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తామని ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు, ఏపీ సీఎంతో పాటుగా సీఆర్డీఏ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తాజాగా కేంద్రానికి ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని కోసం రూ 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. దీంతో, రుణం మంజూరుకు సంప్రదింపులు వేగవంతం అయ్యాయి. అందులో భాగంగా కేంద్ర ఆర్దిక శాఖ అధికారులతో ప్రపంచ బ్యాంకు అధికారులు ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే ఈ మొత్తం సీఆర్డీఏకు అందనుంది. రాజధానిలో మౌళిక వసతుల కల్పనతో పాటుగా భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లే అవుట్ ల డెవలప్ మెంట్, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాయల భవనాల టవర్ల నిర్మాణానికి రూ 49 వేల కోట్ల ఖర్చు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి సంతకాల ప్రక్రియ ముగియనుంది. ఆ వెంటనే రుణం మొత్తంలో 25 శాతం అంటే రూ 3,750 కోట్లు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ లో ఈ మొత్తం అందుతాయని అంచనా వేస్తున్నారు.

ఇక, ఏపీ రాజధానికి ప్రపంచ బ్యాంకు.. ఏడీబీ రుణం ఇస్తున్నా అది ఏపీ ప్రభుత్వం పైన భారం పడదని ఆర్దిక శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులిస్తోంది. ఈ రుణం పై 15 ఏళ్ల మారిటోరియం ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ నాలుగు శాతం లూపే ఉంటుందని చెబుతున్నారు. ఈ రుణం లో కేంద్రం 90 శాతం..రాష్ట్రం 10 శాతం చొప్పున భరించనున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని చెబుతున్నారు. అయితే, రుణం మంజూరు..విధి విధానాల పైన వచ్చే వారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. తాజా రుణంతో అమరావతి నిర్మాణం వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

ఆలయాలల్లో ప్రభుత్వాల జోక్యం వద్దు: వీహెచ్‌పీ డిమాండ్

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి‌తో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ‘‘తిరుమల లడ్డు ప్రసాదం’’లో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధుల బృందం సోమవారం తిరుపతిలో కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశం నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అన్న భాండాగారంగా, ఆధ్యాత్మిక భాండాగారంగా సనాతన ధర్మానికి నిలయంగా ఉందన్నారు. హిందువులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగడం విచారకరం అన్నారు.

 

ఆలయ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం, ఆలయ నిర్వాహణ బాధ్యతలలో అన్య మతస్థులను నియమించడం తదితర కారణాల మూలంగా ఆలయ పవిత్రతకు విఘాతం కలుగుతోందని వీహెచ్‌పీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోని హిందూ ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ నియంత్రణ రాజ్యాంగ నిబంధనలు వివిధ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొనసాగుతోందని..తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయ, వ్యవహారాల్లో జోక్యం విరమించుకుని హిందువుల మత స్వేచ్ఛను గౌరవించాలని వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు కోరారు.

దేవాలయాల నిర్వాహణ బాధ్యతలను ధార్మిక పరిషత్ బోర్డులకు అప్పగించాలని ఈ సందర్భంగా వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక మండలి తీర్మానించింది. ఈ బోర్డులు ఆలయ నిర్వాహణ బాధ్యతలను ప్రజాస్వామ్య, సమ్మిళిత విధానాన్ని అనుసరించే విధంగా ఉండాలని తెలిపారు.

 

ఈ బోర్డులో ప్రధానంగా సాధువులు, హిందూ సంస్థలు, పండితులతో పాటు భక్తులు సభ్యులుగా ఉండాలన్నారు. హిందువులు వారి స్వంత మతపరమైన సంస్థలను నిర్వహించే దిశగా ప్రభుత్వాలు తీసుకునే చర్యలు వివిధ వర్గాల మధ్య సామరస్యంతో పాటు విశ్వసాన్ని, గౌరవాన్ని పెంపొందించగలవని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది.

హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు, వాటి స్వయంప్రతిపత్తిని నిర్థారించే విషయంలో వీహెచ్‌పీ రాజీ పడదని పునరుద్ఘటించింది. ఈ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశంలో పూజ్య శ్రీ విరజానంద స్వామి, పూజ్య శ్రీ సంగ్రామ మహారాజు, పూజ్య శ్రీ బెనారస్ బాబూ గురూజీ, పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామీజీ, పూజ్యశ్రీ స్వస్వరూపానంద గిరి స్వామీజీ, శ్రీ బజరంగ్ బాగ్డ, శ్రీ గుమ్మళ్ళ సత్యం పాల్గొన్నారు.

దేశంలో హిందూ బోర్డు ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి

బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఒకటి వుందని, అలాగే దేశంలోని హిందువులకు ఓ బోర్డు ఎందుకు వుండొద్దని సూటిగా ప్రశ్నించారు.

దేశంలో వెంటనే సనాతన హిందూ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. హిందూ సమాజం సంస్థాగతంగా బలంగా నిర్మాణం కావాలని, హిందూ సమాజానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.

 

ఈ కుట్రలను, మోసాలను అరికట్టడానికే ఇలా చేయాలన్నారు. హిందూమతం సమాజాన్ని, ప్రజలను, హిందూ సాంస్కృతిని, హిందువుల హక్కులను రక్షించడానికి వక్ఫ్ తరహాలోనే హిందూ బోర్డు రావాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.

హిందూ సమాజం ఇప్పుడు బలహీన స్థితిలో వుందని, అందుకే సమాజ భద్రత, స్వేచ్ఛ కోసం సంఘటితం కావాలన్నారు. ఇీవలే మధ్యప్రదేశ్ సీఎం జైన్ బోర్డు విషయంలో తనతో చర్చించారని, ఇలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు మాదిరిగానే.. హిందూ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయకూడదో చెప్పాలని నిలదీశారు.

శ్రీవారి లడ్డూ, అసలు మ్యాటర్ బయటపెట్టేసిన టీటీడీ ఉద్యోగులు

తిరుమల శ్రీవారి లడ్డుల తయారి కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణల వ్యవహారం ఊహించిన మలుపు తిరిగింది. శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి వాడారని, ఆ కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ కు చెందిన ల్యాబ్ నివేదిక ఆధారంగానే తాను ఈ విషయం బయటపెట్టానని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు.

మా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించ లేదని, స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగించామని మాజీ జగన్, టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డు పోటులో వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో నిష్టతో, నియమ నిబంధనలతో శ్రీవారి లడ్డులు తయారు చేస్తుంటారు. శ్రీవారి లడ్డూల తయారీ కోసం నాసిరకం నెయ్యి, నాసిరకం జీడిపప్ప, నాసిరకం యాలకులు, నాసిరకం దినుసులు ఉపయోగించారని లడ్డు పోటులో పనిచేసే సిబ్బంది ఆరోపిస్తున్నారు.

ఈ విషయం అప్పట్లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని, పెద్దలను ఎదిరించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో తాము శ్రీవారి లడ్డూలు తయారు చేశామని తిరుమల లడ్డు పోటులోని కొందరు ఉద్యోగులు, అక్కడ పని చేస్తున్న సిబ్బంది వాపోతున్నారు. శ్రీవారి ఆలయంలో రోజుకి సుమారు మూడు లక్షలకు పైగానే లడ్డూలు తయారు చేస్తారు. ఈ లడ్డుల తయారీ కోసం 14 టన్నుల నెయ్యిని ఉపయోగిస్తామని లడ్డు పోటు సిబ్బంది అంటున్నారు.

తిరుమలలో 82,000 కిలోలకు పైగా సామర్థ్యం ఉన్న మూడు నెయ్యి యూనిట్లు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాబాయ్ వైవీ. సుబ్బారెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా పని చేశారు.. సాధారణంగా తిరుమల మాడవీధుల్లో తిరుగుతుంటే శ్రీవారి లడ్డూల తయారు చేస్తున్న సువాసనకి తిరుమల భక్తులు పరవశించి పోయేవారు. అదంతా గతంలో అని భక్తులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి లడ్డు చేతిలో పట్టుకున్నా సువాసన రావడంలేదని ఇటీవల కాలంలోని తిరుమల భక్తుల ఆరోపించిన విషయము తెలిసిందే.

నాసిరకం నెయ్యి, యాలుకలు, నాసిరకం దినుసులు, జీడిపప్పు వాడితే ఎలా సువాసన వస్తుందని, ఈ విషయంపై అప్పటి టీటీడీ డిప్యూటీ ఈవో, సూపరెండెంట్ల దృష్టికి తీసుకెళ్లామని, నాసిరకం నెయ్యి ఉపయోగించినా, నిసిరకం దినుసులు లడ్డూలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తే సువాసన రాదని తాము పదే పదే చెప్పినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదని, ఉన్నతాధికారులను ఎదిరించి తాము ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండి పోయామని తిరుమల శ్రీవారి లడ్డు పోటులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

మొత్తం మీద శ్రీవారి లడ్డు పోటులో పనిచేస్తున్న ఉద్యోగులే నాసిరకం నెయ్యి లడ్డూల తయారీ కోసం ఉపయోగించామని ఇప్పుడు బయట పెట్టడంతో ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావు ఆ విషయంపై దృష్టి సారించారని తెలిసింది. శ్రీవారి లడ్డు పోటు సిబ్బంది ఫిర్యాదు చేసిన సమయంలో పనిచేసిన డిప్యూటీ ఈవో, సూపరెండెంట్ల వివరాలు తెలుసుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు త్వరలోనే వారి పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

మొత్తం మీద నాసిరకం నెయ్యి ఉపయోగించి శ్రీవారి లడ్డూలు తయారు చేశారని, లడ్డు పోటులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపించడం కలకలం రేపుతుంది. తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సైతం గతంలో శ్రీవారి లడ్డూలో నాణ్యత లేదని, సువాసన లేదని నాసిరకం నెయ్యి, యాలకులు, జీడిపప్పు, నాసిరకం దినుసులు లడ్డూలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తున్నారని, ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని పలుసార్లు ఆరోపించారు.

అయితే శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోని టీటీడీ అధికారులు అలాగే లడ్డులు తయారు చేశారని శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు శ్రీవారి లడ్డుల తయారీలో నాసిరకం నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో అప్పట్లో లడ్డూల తయారీకి ఇన్ చార్జ్ లుగా ఉన్న సూపరెండెంట్లు ఇప్పుడు భయంతో హడలి పోతున్నారని సమాచారం.

తిరుమల శ్రీవారి లడ్డు పోటులో లడ్డూలు తయారు చేస్తున్న ఉద్యోగులు చేసిన ఆరోపణలపై టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ విజిలెన్స్, శ్రీవారి లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుతం ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ అధికారులు దృష్టి సారించారని, లడ్డు పోటులో పని చేస్తున్న ఉద్యోగుల నుండి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి, నాసిరకం నెయ్యి ఉపయోగించారని లడ్డు పోటులో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోపించడం కలకలం రేపుతోంది.

నగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు..

మహానగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు.

మహానగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని లేఖలో కోరారు.

ప్యారానగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలోని ఖానాపూర్‌, సంగారెడ్డి పటాన్‌చెరు(Khanapur, Sangareddy Patancheru) మండలంలోని లక్డారం, దుండిగల్‌, చౌటుప్పల్‌లోని మల్కాపూర్‌ ప్రాంతాల్లో భూములను డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు గుర్తించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్వాసన రాకుండా, పర్యావరణంపై ప్రభావం పడకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల పునర్వినియోగం, నిర్వహణ చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా తడి చెత్త నుంచి బయో గ్యాస్‌, సేంద్రియ ఎరువులు, పొడి చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేయనున్నారు.

ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలాన్ని డంపింగ్‌ యార్డు కోసం గతంలో గుర్తించారు. రహదారి, ఇతరత్రా నిర్మాణ పనులూ ప్రారంభించారు. స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించాలని భావిస్తున్నారు. రోజూ 270 టన్నుల తడి చెత్తతో బయోగ్యాస్‌ ఉత్పత్తికి ఏర్పాటుచేయనున్నారు. చెత్తనూ భూగర్భంలోని బంకర్‌లో వేసి తడి, పొడి చెత్తగా వేరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం నగరంలో రోజూ 7,500 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో లక్ష టన్నులకుపైగా టన్నుల వ్యర్థాల తడి, పొడి చెత్త కుప్పలు ఉన్నాయి.

తిరుమలలో అనూహ్య పరిణామం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదికి వచ్చిన తరువాత తిరుమల లడ్డూ వివాదం కాస్త చల్లారినట్టే కనిపిస్తోంది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం జగన్ డిక్లరేషన్ అంశంపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో భాగంగా- తిరుమలను సందర్శించాలని, శ్రీవారిని దర్శించుకోవాలనీ జగన్ నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపాన్ని దాల్చలేకపోయింది.

చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని ఆయన పార్టీ క్యాడర్‌కు సూచించారు. అదే సమయంలో తాను స్వయంగా తిరుమలకు వెళ్లాలనీ, రాత్రి అక్కడే బస చేయాలనీ నిర్ణయించారు.

జగన్ తిరుమలకు వెళ్తారంటూ వార్తలొచ్చిన మరుక్షణం నుంచే డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆ పార్టీ శాసన సభ్యుడు సుజనా చౌదరి, సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, జనసేన, టీడీపీకి చెందిన పలువురు నేతలు- తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు.

జగన్ రానున్నారనే విషయం తెలిశాక- అటు తిరుమలలో కూడా కొత్తగా డిక్లరేషన్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. టీటీడీ అధికారులు తిరుమలలో పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. హైందవేతరుల ఆలయ ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు అవి.

టీటీడీ ఆలయాలు కేవలం హిందువులకు మాత్రమే చెందినవని, హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయదలచుకుంటే శ్రీవేంకటేశ్వర స్వామివారి పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, అదనపు కార్యనిర్వహణాధికారి క్యాంప్ ఆఫీస్, రిసెప్షన్ కార్యాలయాలు, అన్ని ఉప విచారణ కార్యలయాల వద్ద డిక్లరేషన ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయని పొందుపరిచారు.

ఆ ఫ్లెక్సీలు, బోర్డులను తిరుమలలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించిన తరువాత వాటిని అప్పటికప్పుడు తొలగించారు టీటీడీ సిబ్బంది. దీనితో- అవన్నీ కూడా జగన్‌ను ఉద్దేశించే పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తోన్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన

పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని దేశవ్యాప్తంగా డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని చాలా కాలంగా ఓ డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ అంశంపై మోదీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటి వేళ.. కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడంలో ఏకభిప్రాయం సాధించాలని ఆయన రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

పుణే ఇంటర్నేషనల్ సెంటర్‌ 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా రాబోయే దశాబ్దంలో భారతదేశం యొక్క ఇంధన భద్రతను పెంపొందించడానికి వ్యూహం మరియు చర్యలు" అనే అంశంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలకోపన్యాసం చేశారు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని చాలా కాలంగా ఓ డిమాండ్ అయితే ఉందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభా 1.4 మిలియన్లకు చేరిందన్నారు. దీంతో ఇంధనం వాడకం సైతం మూడింతలు పెరిగిందని చెప్పారు.

రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే 25 శాతం ఇంధనాన్ని భారత్ వినియోగించనుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ క్రమంలో కేంద్రం సైతం సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

అయితే ఇదే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించాలని గతంలో కేరళ హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కానీ ఈ సమావేశంలో చర్చించేందుకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గుర్తు చేశారు. మరోవైపు వ్యాట్‌ను వదులుకోవడానికి బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలు సిద్దంగా లేవన్నారు.

అదీకాక రాష్ట్రాలకు మద్యం, ఇంధనం ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపారు. అలాంటి వేళ.. ఇంధనాన్ని జీఎస్టీ పరధిలోకి తీసుకు వచ్చేందుకు పలు రాష్ట్రాలు సంసిద్ధత వ్యక్తం చేయక పోవచ్చునని కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంధన దిగుమతి చేసుకోని.. పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాల్సిన ప్రాముఖ్యత ఉందని పూణే ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

దేశంలో రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో వానలు కురుస్తాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

దేశంలో రుతుపవనాల పరిస్థితి చూస్తుంటే, ఇంకా తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలోని పర్వతాల నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ వర్షపాతం(rains) ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో హిమాచల్, జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో హిమపాతం కూడా ప్రారంభమైంది. దీంతో పెరిగిన వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. హిమాచల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల నమోదైంది. ఈ క్రమంలో నేడు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.

సెప్టెంబరు 28న పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల, తూర్పు యూపీలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు చోట్ల గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని టెరాయ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా యూపీలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

మహారాష్ట్రతో పాటు బీహార్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అయితే నేడు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వర్ష సూచనలు లేవు. సెప్టెంబరు 28న పంజాబ్-హర్యానా, చండీగఢ్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని తెలిపింది. బీహార్‌లో బాగమతి ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా, కోసి, గండక్‌లు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్‌లో వచ్చే 24 గంటల్లో పాట్నా సహా 13 జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక వరద హెచ్చరిక ఉన్న జిల్లాల మెజిస్ట్రేట్‌లకు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు పంపింది. అదే సమయంలో ఐదు జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

మరోవైపు జమ్మూ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలలో వాతావరణం స్పష్టంగా ఉంటుంది, వర్షం సంకేతాలు లేవు. ఉత్తరాఖండ్‌లో ఎల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ గురించి మాట్లాడినట్లయితే తూర్పు, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలు త్వరలో విడిచిపెట్టబోతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వాతావరణం స్పష్టంగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన బెంగాల్‌లోని డార్జిలింగ్ పరిస్థితి భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కొండ ప్రాంతాలలో సామాన్య ప్రజల ఇబ్బందులు పెరగడమే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల రాక ఆగిపోయింది. శనివారం కూడా ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం కూడా పర్వతాలు, మైదానాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైడ్రా' భ‌యంతో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఏమ‌న్నారంటే..!

హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేత‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా త‌లో ఇల్లును రాసిచ్చారు. 

అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విష‌యం తెలిసి త‌మ బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. 

స్పందించిన‌ 'హైడ్రా' క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్..

ఈ ఘ‌ట‌న‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పందించారు. బుచ్చ‌మ్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేత‌ల్లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూలుస్తార‌నే భ‌యంతో వారి కూతుర్లు ఆమెను ప్ర‌శ్నించారు. దాంతో బుచ్చ‌మ్మ మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

హైడ్రా ఎవ‌రికీ నోటీసులు ఇవ్వ‌లేద‌న్న రంగ‌నాథ్‌.. శివ‌య్య దంప‌తులు త‌మ కూతుళ్ల‌కు రాసిచ్చిన ఇళ్లు కూక‌ట్‌ప‌ల్లి చెరువుకు స‌మీపంలోనే ఉన్న‌ప్ప‌టికీ ఎఫ్‌టీఎల్ ప‌రిధికి దూరంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇక కూల్చివేత‌ల‌కు సంబంధించి మూసీ ప‌రిధిలో చేప‌ట్టిన ఏ స‌ర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. 

మూసీ న‌దిలో శ‌నివారం భారీగా ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేయ‌బోతున్న‌ట్లు ఫేక్ న్యూస్ ప్ర‌చారం అవుతోంది. కొన్ని సోష‌ల్ మీడియా ఛాన‌ళ్లు ఒక ఎజెండాతో హైడ్రాపై న‌కిలీ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నాయ‌ని రంగ‌నాథ్ మండిప‌డ్డారు. కూల్చివేత‌ల గురించి ప్ర‌జ‌లు అనవ‌స‌ర భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. కూల్చివేత‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఇబ్బందులు ప‌డ‌కుండా హైడ్రాకు ప్ర‌భుత్వం క‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింద‌ని తెలిపారు.