/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు Mane Praveen
Mane Praveen

Aug 31 2024, 20:43

NLG: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
నల్లగొండ: రానున్న 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు, ముఖ్యమైన కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

వర్షాలకు సంబంధించి అత్యవసర సమాచారం, సహాయం కోసం
(1). కలెక్టర్ కార్యాలయం- 18004251442
(2).ట్రాన్స్కో నల్గొండ సర్కిల్ -  9440813326
(3).నల్గొండ డివిజన్ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్* నెంబర్ 9542451160
(4).మిర్యాలగూడ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నంబర్ 9493951399
(5).దేవరకొండ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నెంబర్ 9440203717


(6).నీటిపారుదల శాఖకు సంబంధించిన నల్గొండ కంట్రోల్ రూమ్ నెంబర్ 9989997950
(7).నాగార్జునసాగర్ హిల్ కాలనీ డివిజన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8465080694
(8).జివి గూడెం కంట్రోల్ రూమ్ నెంబర్ 9948042977
(9).మాల్ డివిజన్ కు సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్ 9912534475
(10).పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్ 9059834706

ప్రజలు వర్షం కారణంగా ఇబ్బందులకు గురైనా, లేదా ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేసేందుకు సంబంధించి పైన పేర్కొన్న కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Mane Praveen

Aug 31 2024, 20:28

NLG: జిల్లా క్రీడల అధికారికి ఘనంగా వీడ్కోలు
నల్గొండ: గత 25 సంవత్సరాలుగా  జిల్లాలో హాకీ కోచ్ గా మరియు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారిగా సమర్థవంతంగా పనిచేస్తూ శనివారం రిటైర్మెంట్ పొందిన మక్బూల్ మొహమ్మద్ ను జిల్లా క్రీడల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించి మంచి అధికారిగా గుర్తింపు సాధించారని తెలిపారు.

Mane Praveen

Aug 31 2024, 19:17

NLG: విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు ఆత్మీయ సన్మానం'
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలంలోని, తమ్మడపల్లి ప్రాథమిక పాఠశాలలో 2002 లో ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి 8 సం.లుగా  విద్యార్థులతో, గ్రామ ప్రజలతో మమేకమై విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రత్యేక చొరవ చూపించి విద్యార్థుల హృదయాలను గెలిచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు శ్రీరేఖ వ్యక్తిగత పనిపై శనివారం గ్రామానికి వచ్చిన విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆమెను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు, ఉపాధ్యాయులు ఉమా శంకర్ రావు, కొట్టం శ్రీనివాస్,శ్రీలత, పూర్వ విద్యార్థులు చేల్లం నర్సింగరావు, అనిల్, కొట్టం సరిత, శివ, హుస్సేన్, పవన్, రమేష్ పాల్గొన్నారు.

Mane Praveen

Aug 31 2024, 12:55

NLG: వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ నారాయణ రెడ్డి
నల్లగొండ: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల  జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన చోట్ల సహాయ సహకారాలు అందించాలన్నారు.
మరో రెండు రోజులపాటు వర్షాలు  కురియనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మట్టి మిద్దెలు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండొద్దని సూచించారు. మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులకు తెలియజేస్తే అవసరమైతే తక్షణమే వసతి కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టుల గేట్లు తెరిచినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలలో నీటిలోకి ఎవరు వెళ్లొద్దు. పశువులను సైతం నీటిలోకి తీసుకెళ్లొద్దు.ఈత కొట్టేందుకు యువత నదులు ప్రాజెక్టుల వద్ద నీటిలోకి దిగవద్దు.మత్స్యకారులు చేపలు పట్టేందుకు నీళ్లలోకి వెళ్ళవద్దు.పిల్లలు, పెద్దలు నీటి ప్రాంతాల వద్ద సెల్ఫీలు దిగేవారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కు షార్ట్ సర్క్యూట్ వచ్చేందుకు అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా మనుషులు, పశువులు వెళ్లొద్దు.విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.విద్యుత్ అధికారులు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న వాటిని గుర్తించి ముందే తొలగించాలి. వర్షం ,గాలుల కారణంగా  ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోయిన, స్తంభాలు ఒరిగిపోయినచో తక్షణమే సరి చేయాలి.

మున్సిపల్ ప్రాంతాలు, గ్రామాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.ఎక్కడైనా నీరు నిలువ ఉంటే  తక్షణమే నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీలు, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలి. కల్వర్టులు, రోడ్లు పొంగి పొర్లుతున్నట్లయితే వాటిని దాటే సాహసం ఎవరు చేయొద్దు.ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అలాంటి ప్రదేశాలలో తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి,బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

మోటార్ బైకులు వాహన దారులు పొంగి పొర్లి ప్రవహించే కల్వర్టులు, వాగులను దాటే సాహసం చేయవద్దు.
వర్షం వల్ల రోడ్లపై చెట్లు విరిగిపడినట్లయితే తక్షణమే తొలగించాలి.నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వర్షాల కారణంగా చెరువులు, కుంటలు ఎక్కడైనా నిండి తెగిపోయేందుకు ఆస్కారం ఉన్నచోట తక్షణమే వాటిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

వర్షం వల్ల రైతులు పంటలు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలి.వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలకు తక్షణ చికిత్స అందించేందుకు  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అవసరమైన మందులు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చోట్ల సహాయక చర్యలను చేపట్టాలని అన్నారు.జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అందరూ జిల్లా యంత్రంగానికి అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

Mane Praveen

Aug 31 2024, 11:44

NLG: లెంకలపల్లి లో దంచి కొడుతున్న వర్షం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో శనివారం జోరున వాన కురుస్తుంది. ఇవాళ తెల్లవారుజామున ఓ మోస్తారు గా కురిసిన వర్షం.. ఉదయం 11 గంటల సమయానికి వర్ష తీవ్రత పెరిగింది. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. రోడ్లపై జనసంచారం లేకుండా ఖాళీగా ఉంది. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Mane Praveen

Aug 31 2024, 11:28

NLG: సమస్యలతో సతమతమవుతున్న గురుకులాలు
నల్లగొండ జిల్లా: MJP, SC గురుకుల పాఠశాలలో చాలా వరకు  పరిశుభ్రత లోపం ఉన్నాయి. పాఠశాలలోని విద్యార్థుల తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టాప్ రూమ్స్ మాత్రమే క్లీనింగ్ చేస్తూ విద్యార్థుల  డార్మట్స్, టాయిలెట్స్ క్లీనింగ్ చెయ్యట్లేదని తెలిపారు.

600 నుండి 1000 వరకు వున్న పిల్లలకు హాలిడేస్ లో ఒక్కరే టీచర్ ఉండడం బాధాకరం అని అన్నారు.  పేరెంట్స్ ప్రశ్నిస్తే  వారి పిల్లలను టార్గెట్ చేయడం కొట్టడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం  జరుగుతుందని వాపోయారు.

ప్రతి విద్యార్థి పేరెంట్స్ అందరు ఎప్పటికి అప్పుడు అప్రమత్తం గా ఉండాలనీ, విద్యార్ధి సంఘాలు పేరెంట్స్ సంఘాలు ఈ సమస్యలపట్ల  పోరాటం చేయాలని వారు కోరుతున్నట్లు తెలిపారు.ఉన్నతాధికారులు దృష్టి సారించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

Mane Praveen

Aug 30 2024, 21:58

NLG: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బండారు ప్రసాద్
నల్గొండ మండలం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యశాల బిజెపి నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బిజెపి నల్గొండ పార్లమెంట్ కన్వీనర్  బండారు ప్రసాద్ పాల్గొని కార్యకర్తలను, ఉద్దేశించి మాట్లాడుతూ.. నల్లగొండ మండలంలో అధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వానికి నల్లగొండ మండల నాయకులందరూ కృషి చేయాలని తద్వారా రానున్న స్థానిక ఎన్నికలలో అధిక స్థానాలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు గెలవడానికి అవకాశం ఉంటుందని,m కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
    
ప్రతి బూత్ లో 200 మంది సభ్యత్వానికి తగ్గకుండా చేసి నల్లగొండ జిల్లాలో నల్లగొండ మండలాన్ని మొదటి స్థానంలో నిలపాలని కోరారు.

ఈ సమావేశంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కొత్తపళ్లి ప్రమోద్, చామకూరి మహేష్, మండల సభ్యత్వ కన్వీనర్ పనస సురేష్, మండల ఉపాధ్యక్షులు రేగట్టే రూక్న గౌడ్, మండల కార్యదర్శిలు చింతపల్లి వెంకన్న, మేకల అనిల్, నారబోయిన మల్లేష్,మాజీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపల్లి వినోద్, మాజీ వార్డ్ మెంబర్ కస్పరాజు ధర్మయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పోతేపాక శంకర్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు జక్కల శంకర్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షుడు ఎస్ కె. సాదక్, భూత్ అధ్యక్షులు ఉప్పునూతల శ్రీహరి,సుంకర బోయిన లింగ స్వామి,అంతటి శ్రీకాంత్, పోతేపాక నవీన్, బైరెడ్డి రాంరెడ్డి, చిలుకల అనిల్, బోయిన జానయ్య యాదవ్, నరేష్ ముప్ప వెంకటరెడ్డి , పగిల్లా వెంకన్న, సురిగి వెంకటరెడ్డి మండల సీనియర్ నాయకులు పోతేపాక విజయ్, పోతేపాక సురేష్ ,శరత్, సంజీవ, రాజు మండల సోషల్ మీడియా కన్వీనర్ గన్నెబొయిన శ్రీశైలం యాదవ్  తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 30 2024, 20:15

NLG: ఉత్తమ పోటో అవార్డు గ్రహీతల ను సన్మానించిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్

నల్గొండ: జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని రామాలయం లో నల్లగొండ జిల్లాలో వివిధ పత్రికల ఫోటో జర్నలిస్టులు గా విధులు నిర్వర్తిస్తూ.. ఇటీవల రాష్ట్ర స్థాయి అవార్డులు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బంజారా సాంప్రదాయం లో ఫోటో జర్నలిస్టులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నగేష్ నాయక్ మాట్లాడుతూ.. ఫోటో జర్నలిస్టులు అనునిత్యం ప్రజల కోసం ఛాయా చిత్రాలను తీసి వార్తలకు ప్రాణం పోస్తున్నారని తెలిపారు. కార్మిక కర్షకుల సమస్యలను, వారి జీవన విధానాన్ని, వారు పడుతున్న కష్టాలను అందమైన ఫోటోలు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారని అన్నారు.

ఒక్క ఫోటో గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేస్తున్నదని తెలిపారు. వారు చేస్తున్న కృషికి అవార్డులు రావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

అవార్డులు అందుకున్న సన్మాన గ్రహీతలు ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ హన్స్ ఇండియా, కంది భజరంగ్ సాక్షి, చిలుముల నరేందర్ సూర్య, ముచ్చర్ల విజయ్ కుమార్ ఆంధ్ర జ్యోతి, ఆకాష్ నమస్తే తెలంగాణ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు శివ, రవి, జనార్దన్, చారి, వినోద్, మల్లికార్జున్, ఆకాష్, శ్రీను, సతీష్,జిల్లా రాజశేఖర్,నాయకులు సాగర్ నాయక్, వెంకన్న, శంభు రెడ్డి,యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 30 2024, 14:38

NLG: సెల్ఫీ దిగుతూ కాలుజారి నీటిలో పడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..

నల్లగొండ జిల్లా:

నాగార్జున సాగర్ ఎడమ కాలువ వేములపల్లి బ్రిడ్జి వద్ద ఇవాళ ఓ మహిళ సెల్ఫ్ దిగుతూ కాలుజారి నీటిలో పడడం జరిగింది.

అటుగా వెళుతున్న స్థానికులు మాడుగులపల్లి మండలం, గజలాపురం గ్రామానికి చెందిన యువకులు జక్క నాగయ్య, జక్కా నాగరాజు ,తదితరులు వెంటనే నీటిలో దూకి తాడు సాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడారు.

పైకి చేరిన తర్వాత కూడా ఆమె సెల్ఫీ దిగిందని తెలిసింది.

Mane Praveen

Aug 30 2024, 14:05

NLG: సెప్టెంబర్ 1 న ఉమ్మడి జిల్లా స్థాయి యోగాసన పోటీలు
నల్లగొండ: యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి యోగాసనా పోటీలు సెప్టెంబర్ 1 వ తేదీ ఆదివారం రోజున స్థానిక  *భోది యోగ అండ్ ఫిట్నెస్ సెంటర్, శ్రీనగర్ కాలనీ, రోడ్ నెం.4,ఎన్ జి కళాశాల వెనుక*  జరుగుతాయని అధ్యక్షులు కోట సింహాద్రి, జనరల్ సెక్రటరీ  రాయనబోయిన శ్రీను ఒక ప్రకటనలో  తెలిపారు.

*పోటీలు నిర్వహించే విభాగాలు*

*సబ్ జూనియర్*
10 నుంచి 14 సంవత్సరాల వయస్సు వారికి
*జూనియర్*,
14 నుంచి 18 సంవత్సరాల వయస్సు వారికి
*సినియర్* 
18 నుంచి 28 సంవత్సరాల వారికి   ,
*మాస్టర్స్*
28 నుంచి 35 సంవత్సరాల వారికి  ,
35 నుంచి 45 సంవత్సరాలు మరియు ,  45 నుంచి 55 సంవత్సరాల వారికి మూడు విభాగాల్లో మాస్టర్స్ పోటీలు జరుగుతాయని చెప్పారు. బాల బాలికలకు వేరుగా పోటీలు జరుగుతాయి అని వారు తెలిపారు.

ట్రెడిషనల్ యోగాసన ,  artistic యోగాసన ( సింగిల్ ,  పెయిర్ ) , Rhythmic యోగాసన (జంట)  విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పోటీలో పాల్గొనేవారు వయస్సు ధ్రువీకరణ పత్రం బోనఫైడ్ తో పాటు ఫోటోను సమర్పించాలని అన్నారు. పోటీల్లో పాల్గొనేవారు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని తెలిపారు.

ప్రతి విభాగంలో *మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలను రాష్ట్రస్థాయి యోగాసనా పోటీల్లో పాల్గొనే అవకాశం* కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే జాతీయ స్థాయి పోటీలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.

పోటీలో పాల్గొనే వారు *9182046383,* *8886465858*  ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని యోగ సాధకులు అందరూ సద్వినియోగం చేసుకొని రాష్ట్ర , జాతీయస్థాయిలో జిల్లాకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.