భారత్ - బంగ్లా సరిహద్దుల్లో కొనసాగుతున్న హైఅలర్ట్
భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బంగ్లా-భారత్ సరిహద్దుల్లో రాకపోకలను భద్రతా సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది.
భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
బంగ్లా-భారత్ సరిహద్దుల్లో రాకపోకలను భద్రతా సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది. సరిహద్దులకు అదనపు బలగాలను బీఎస్ఎఫ్ తరలించింది.
ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేతలతో నేడు ఆ దేశ ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12.00 గంటలకు విద్యార్థి సంఘాల సమన్వయకర్తలతో సమావేశం జరిగింది.
దేశంలో నెలకొన్న అశాంతి, అల్లర్ల నేపథ్యంలో కీలక భేటీ జరిగింది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా అల్లర్లు కొనసాగాయి. ప్రధాని నివాసం, చీఫ్ జస్టిస్ నివాసం సహా అనేక అధికారిక నివాసాల్లోకి చొరబడి ఆందోళనకారులు లూటీ చేశారు.
అల్లర్లను అదుపుచేసే ప్రయత్నాల్లో బంగ్లాదేశ్ ఆర్మీ, పోలీసు బలగాలు ఉన్నాయి. బంగ్లా రాజధాని ఢాకా పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల కాల్పులు జరిగాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఇస్లామిక్ గ్రూపులపై కాల్పులు జరిగాయి. సోమవారం ఒక్కరోజే హింసాత్మక ఘటనల్లో 135 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావం భారత్-బంగ్లాదేశ్ వాణిజ్యంపై పడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం నాడే బంగ్లాదేశ్ ప్రభుత్వం మూడు రోజుల ట్రేడ్ హాలిడేను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అత్యవసర సర్వీసులను మాత్రం దీని నుంచి మినహాయించింది.
బంగ్లాదేశ్‌లోని అన్ని లాండ్ పోర్టుల్లో ఎగుమతి, దిగుమతుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. పశ్చిమ బెంగాల్ ఎగుమతిదారుల కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ ఉజ్జల్ సాహ తెలిపారు. బంగ్లాదేశ్ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం పట్ల భారత ఎగుమతిదారులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు. అయితే త్వరలోనే పరిస్థితులు సద్దుమణుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాసియాలో బంగ్లాదేశ్.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా.. ఆసియాలో బంగ్లాదేశ్‌కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.
Aug 06 2024, 12:12